Ramayan Movie: నితీష్ తివారీ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ బడ్జెట్ ‘రామాయణ’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఇప్పుడు ఇండియా వైడ్ గా చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు , హిందీ వెర్షన్ లో మాత్రం భారీ రేంజ్ లో ఉన్నాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రం కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. నార్త్ అమెరికా లో అయితే కేవలం ప్రీ సేల్స్ తోనే ప్రీమియర్స్ నుండి 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఒక హిందీ సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు నార్త్ అమెరికా లో జరగలేదని , కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ కురుస్తుందని అంటున్నారు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 100 కోట్ల రూపాయలకు చేరిందని , రేపు సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే , మొదటి రోజు కచ్చితంగా 150 నుండి 170 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఈ చిత్రానికి ఉందని అంటున్నారు. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 26 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. రేపు ఒకవేళ ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ గంటకు లక్ష టిక్కెట్లు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఈమధ్య కాలం లో పాన్ ఇండియన్ సినిమాలకు వెయ్యి కోట్ల గ్రాస్ బెంచ్ మార్క్ ని కొల్లగొట్టడం ఒక ప్రెస్టీజియస్ టార్గెట్ గా మారింది. అన్ని కలిసిసొస్తే ఈ చిత్రం మొదటి వారం లోనే వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రం లో రాముడిగా రణబీర్ కపూర్ నటించగా, రావణుడిగా రాకింగ్ స్టార్ యాష్ నటించాడు. అదే విధంగా సీత గా సాయి పల్లవి, సూర్పనక్క గా రకుల్ ప్రీత్ సింగ్, మండోదరి గా కాజల్ అగర్వాల్ , హనుమంతుడిగా సన్నీ డియోల్ నటించారు. వీరిలో రేపు ఎవరు బాగా షైన్ అవ్వబోతున్నారో చూడాలి.