Homeఅంతర్జాతీయంDonald Trump: ఒకటి కాదు.. రెండు కాదు.. ట్రంప్ ఓటమికి ఎన్నో కారణాలు..

Donald Trump: ఒకటి కాదు.. రెండు కాదు.. ట్రంప్ ఓటమికి ఎన్నో కారణాలు..

Donald Trump: కర్ణుడి చావుకు కారణాలు అనేకం అంటారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఎన్నో కారణాలు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ట్రంప్ అమెరికా ఓటర్లకు ఎన్నో వాగ్దానాలు చేశారు. ధరలను పూర్తిగా తగ్గిస్తానని.. స్థానిక పరిశ్రమలకు ఊతం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఏనాడూ ఆ దిశగా ట్రంప్ చర్యలు తీసుకోలేదు. పైగా మిడ్ టర్మ్ ఎన్నికల్లో పై హామీలను మరోసారి అమెరికా ప్రజల ముందు ప్రస్తావించారు ట్రంప్. […]

Donald Trump: కర్ణుడి చావుకు కారణాలు అనేకం అంటారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఎన్నో కారణాలు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ట్రంప్ అమెరికా ఓటర్లకు ఎన్నో వాగ్దానాలు చేశారు. ధరలను పూర్తిగా తగ్గిస్తానని.. స్థానిక పరిశ్రమలకు ఊతం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఏనాడూ ఆ దిశగా ట్రంప్ చర్యలు తీసుకోలేదు. పైగా మిడ్ టర్మ్ ఎన్నికల్లో పై హామీలను మరోసారి అమెరికా ప్రజల ముందు ప్రస్తావించారు ట్రంప్. కానీ, వాటిని అక్కడి ప్రజలు నమ్మలేదు.

అమెరికాలోని కాంగ్రెస్ ఉభయ సభల్లో (సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రెసెంటేటివ్స్) డెమోక్రాట్లు తిరుగులేని పట్టును సొంతం చేసుకున్నారు. మిడ్ టర్మ్ (అధ్యక్ష ఎన్నికలు జరిగే మధ్యకాలంలో నిర్వహించే పార్లమెంటు ఎన్నికలు) ఎన్నికలను తన అధ్యక్ష పరిపాలనకు రెఫరండం లాగా ట్రంప్ భావించారు. తనకు మద్దతు ఇవ్వాలని అమెరికా ప్రజలను కోరారు. ఆయన పాల్గొన్న ప్రతి ఎన్నికల సభలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. “మీకు నేను హామీ ఇస్తున్నాను.. మీకు ఇచ్చిన వాగ్దానాలను కచ్చితంగా నెరవేర్చుతాను. ప్రతి అభ్యర్థి లో నన్ను చూసుకోండి. నా ప్రతిబింబాన్ని చూసి బ్యాలెట్ మీద ఓటు వేయండి” అంటూ ట్రంప్ సూచించారు. అయితే దీనిని అమెరికా ఓటర్లు సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ట్రంప్ పరిపాలనా లోపాలను.. ప్రజా వ్యతిరేక విధానాలను ఓటు రూపంలో వారు బయటపెట్టారు.

అమెరికాతో ట్రేడ్ కొనసాగిస్తున్న దేశాల మీద పెద్ద మొత్తంలో టారిఫ్ లు విధించారు ట్రంప్. ఇరాన్ మీద అనవసరమైన యుద్ధాన్ని చేశారు. దీనివల్ల ఇంధనాలు.. ఇతర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఇది ఓటర్లలో విపరీతమైన ఆగ్రహాన్ని పెంచింది. చివరికి అమెరికాకు వచ్చే ఔషధాలను సైతం వదిలిపెట్టలేదు ట్రంప్. దీంతో అమెరికా ప్రజల జీవనం పూర్తిగా మారిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా వలస విధానం.. హెచ్ 1 బీ వీసాల మీద ఆంక్షలు పెరిగిపోయాయి. దీంతో భారత సంతతి అమెరికా ప్రజలు డెమోక్రాట్ల మీద ఆసక్తిని చూపించారు. ఎన్నికల అనంతరం వచ్చిన ఫలితాల తర్వాత ట్రంప్ కు దిమ్మ తిరిగిపోయింది. అప్పటిదాకా జరిగిన ఎన్నికల ప్రచారంలో పోస్టల్ బ్యాలెట్ మీద నేనే ఉన్నాను అనుకొని ఓటు వేయండి అని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నేను బ్యాలెట్ లో లేను.. నేను పోటీ చేస్తే కదా.. ఒకవేళ నాకు ఆ అవకాశం ఉంటే కచ్చితంగా చారిత్రాత్మకమైన ఫలితాలు వచ్చేవని.. తన అధికారిక సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో  వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ముందుండి నడిచారు. అనేకరకాల వాగ్దానాలు.. హామీలు ఇచ్చారు. అమెరికా ప్రజలను గొప్పగా మార్చుతానని మాట్లాడారు. కానీ ఆయన మాటలను అమెరికా ప్రజలు నమ్మలేదు. గొర్రె మాదిరిగా తామ మరోసారి కసాయి లాంటి ట్రంప్ ను నమ్మేది లేదని అమెరికా ఓటర్లు పరోక్షంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అయితే గెలిచినప్పుడు ఘనత మొత్తం తనదే అని చెప్పుకున్న ట్రంప్.. ఇప్పుడు ఓడిపోతే దానిని మొత్తం అభ్యర్థుల మీదికి నెట్టేశారు. మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాలు 2028 ఎన్నికలను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ప్రజావ్యతిరేకత విపరీతంగా ఉన్న నేపథ్యంలో.. తమ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చే నాయకుడి మీద రిపబ్లికన్లు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది

ఇక ఎన్నికల్లో అత్యంత చర్చకు దారి తీసిన అంశం ఒకటి ఉంది. 2024 లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకు గట్టిగా మద్దతు ఇచ్చిన రాష్ట్రాలలో డెమోక్రాట్లు సత్తా చూపించారు. అమెరికా సెనెట్ లో వంద స్థానాలు ఉంటే.. రిపబ్లికన్ ల ఆధీనంలో ఉన్న కనీసం ఏడు స్థానాలను డెమోక్రాట్లు సొంతం చేసుకున్నారు. టెక్సాస్.. కన్సస్ (94 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రాలు డెమోక్రాట్లకు దక్కాయి), లోవా, ఓహియో, మైనే, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా ను డెమోక్రాట్లు దక్కించుకున్నారు. సుదీర్ఘకాలంగా రిపబ్లికన్ నేతలకు మద్దతు ఇస్తున్న ఓటర్ల సైతం ఈసారి మార్పు కోరుకున్నారు. అమెరికాలో రాష్ట్రాల పరిపాలనకు గవర్నర్లు కీలకంగా ఉంటారు. ఎన్నికలలో కూడా డెమోక్రాట్లు సత్తా చూపించారు. టెక్సాస్, లోవా, రోహియో గవర్నర్ పదవులను డెమో క్రాట్లు దక్కించుకున్నారు. ఓహియోలో ట్రంప్ సపోర్ట్ ఉన్న వివేక్ రామస్వామి ఓడిపోవడం విశేషం.

ఇరాన్ యుద్ధం ట్రంప్ కొంపముంచింది

ఇరాన్ మీద ట్రంప్ కొనసాగించిన యుద్ధం ప్రజలకు కోపం కలిగించింది. కీలకమైన హార్మోజ్ జల సంధిని ట్రంప్ మూసివేశారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేసింది. ఈ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా పడింది. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హిస్పానిక్ ఓటర్లు (స్పెయిన్ లేదా లాటిన్ అమెరికా దేశాల మూలాలు ఉన్నవారు) నుంచి సపోర్ట్ లభించింది. వారు మాత్రమే కాదు, ఉద్యోగులు, యువకులు ట్రంప్ కు అప్పటి ఎన్నికల్లో సపోర్ట్ ఇచ్చారు. కానీ ఇప్పటి ఎన్నికల్లో మాత్రం వారి సపోర్ట్ పూర్తిగా తగ్గింది. దాదాపు 30 ఏళ్ల వయసు ఉన్న ఓటర్లలో 70%.. హిస్పానిక్ ఓటర్లలో 60% డెమో క్రాట్ అభ్యర్థులను గెలిపించారు. ముఖ్యంగా టెక్సాస్.. మెక్సికో సరిహద్దు ప్రాంతాల్లో ఓటర్లు తమ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకొని.. డెమోక్రాట్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper