Shocking Truth: మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్లు.. అమెరికా సైనిక రహస్యాలు పాకిస్థాన్‌లో ఉన్నాయి. అందుకే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలను ద్వంసం చేసింది. ప్రతిగా పాకిస్థాన్ భారత పైరులపై దాడులకు తెగబడింది. వీటిని తిప్పకొట్టిన భారత్ పాకిస్థాన్‌లోని 11 ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడుల చేసింది. దీంతో అప్రమత్తమైన అమెరికా.. తన గుట్టు రట్టు కాకుండా సీజ్‌ఫైర్‌కు ఒప్పించింది.
పాకిస్థాన్ రక్షణ విశ్లేషకుడు ఇంతియాజ్ గుల్ రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం అమెరికా నియంత్రణలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వెల్లడి అమెరికా–పాకిస్థాన్ సైనిక సంబంధాలపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్ర శిబిరాలు, సైనిక స్థావరాలు ధ్వంసమైన నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఆపరేషన్ సిందూర్‌తో భారత్ దూకుడు..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలతోపాటు పలు వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ దాడులు తీవ్రతరం చేసిన కొద్ది గంటల్లోనే అమెరికా కాల్పుల విరమణ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో నూర్ ఖాన్ వైమానిక స్థావరం లక్ష్యంగా ఉందని, దానికి నష్టం జరిగిందని కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ విషయంపై పాకిస్థాన్ సైన్యం లేదా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదు.
Read Also: రేషన్ కార్డు ఉన్నవారికి ఇది గుడ్ న్యూస్
నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై అమెరికా ఆధిపత్యం
ఇంతియాజ్ గుల్ వెల్లడించిన వివరాల ప్రకారం, రావల్పిండిలోని వ్యూహాత్మకంగా కీలకమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరం అమెరికా నియంత్రణలో ఉంది. ఈ స్థావరంలో పాకిస్థాన్ సీనియర్ సైనిక అధికారులకు సైతం జోక్యం చేసుకునే అనుమతి లేదని గుల్ పేర్కొన్నారు. ఈ బేస్ వద్ద అమెరికన్ విమానాలు తరచూ కనిపిస్తున్నప్పటికీ, వాటిలోని కార్యకలాపాలు లేదా రవాణా సరుకు వివరాలు రహస్యంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇస్లామాబాద్, రావల్పిండి సమీపంలో ఉన్న ఈ స్థావరం పాకిస్థాన్‌కు వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైనది.
అమెరికా–పాక్ సంబంధాలపై ఆందోళన
గుల్ వ్యాఖ్యలు అమెరికా, పాకిస్థాన్ మధ్య అప్రకటిత ఒప్పందం ఉండవచ్చనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ ఒప్పందం పాకిస్థాన్ సైనిక పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. భారత్ దాడుల తర్వాత అమెరికా వేగంగా కాల్పుల విరమణ ప్రకటించడం, నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు జరిగిన నష్టం వెనుక అమెరికా ఆత్రుత ఉందా అనే చర్చ జాతీయ మీడియాలో జోరందుకుంది. ఈ వైమానిక స్థావరంలో అమెరికా నియంత్రణ, పాకిస్థాన్ సైనికులకు అనుమతి లేకపోవడం రెండు దేశాల సైనిక సహకారంపై లోతైన సందేహాలను కలిగిస్తోంది.
నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై అమెరికా నియంత్రణ, ఆపరేషన్ సిందూర్‌లో భారత్ దాడులు, అమెరికా కాల్పుల విరమణ ప్రకటనలు రాజకీయ, సైనిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వెల్లడి అమెరికా–పాకిస్థాన్ సంబంధాలను, పాక్ సైనిక స్వయం ప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేస్తోంది.