Mahesh and Rajamouli film : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పై సోషల్ మీడియా లో రోజుకో వార్త ప్రచారం లో ఉంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఏది నిజమో, ఏది అబద్దమో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పై రాజమౌళి ఇప్పటి వరకు నోరు మెదపలేదు. కనీసం సినిమా మొదలైంది అనే విషయాన్నీ కూడా ఇప్పటి వరకు అధికారికంగా చెప్పలేదు. సైలెంట్ గా రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసి సమ్మర్ హాలిడేస్ తీసుకున్నారు. అయితే ఈ చిత్రం లో మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ విలన్ గా నటిస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారమైన సంగతి తెలిసిందే. పృథ్వీ రాజ్ ఈ చిత్రం లో నటిస్తున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ వీడియోస్ కూడా లీక్ అయ్యాయి. కానీ ఈయన విలన్ క్యారక్టర్ చేస్తున్నాడా అనే దానిపై క్లారిటీ లేదు.
ఎందుకంటే విలన్ క్యారక్టర్ కోసం రీసెంట్ గానే తమిళ స్టార్ హీరోలలో ఒకరైన చియాన్ విక్రమ్(Chiyaan Vikram) ని సంప్రదించాడట డైరెక్టర్ రాజమౌళి. కానీ విక్రమ్ తాను ఇతర హీరోల సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి సిద్ధం గా లేనని చెప్పాడట. రాజమౌళి తో కలిసి పని చేయాలనీ విక్రమ్ చాలా రోజుల నుండి కోరుకుంటున్నాడు. రెండు మూడు సార్లు వీళ్ళ కాంబినేషన్ కోసం చర్చలు కూడా జరిగాయి. కానీ ఎందుకో అవి కార్య రూపం దాల్చలేదు. ఇప్పటికీ రాజమౌళి తో సినిమా చేయడానికి విక్రమ్ సిద్దంగానే ఉన్నాడు. కానీ అది కేవలం సోలో హీరో గా మాత్రమే అట. విక్రమ్ ఈ రోల్ ని రిజెక్ట్ చేయడం తో ఇప్పుడు మాధవన్ ని సంప్రదించాడు డైరెక్టర్ రాజమౌళి. ఆయన నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : ధూమ్ 4′ లో సూపర్ స్టార్ మహేష్ బాబు..? డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రస్తుతం మాధవన్ తో కథ గురించి చర్చిస్తున్నారు. త్వరలోనే ఆయన ఈ సినిమాలో భాగం కాబోతున్నాడా లేదా అనేది తెలియనుంది. మాధవన్ కి హీరో గా ఒకప్పుడు ఉన్న స్టార్ ఇమేజ్ ఇప్పుడు లేదు. అందుకే ఆయన వరుసగా క్యారక్టర్ రోల్స్ చేస్తున్నాడు. కానీ విక్రమ్ అలా కాదు, స్టార్ స్టేటస్ ఉన్న హీరో. ఆయన సినిమా పెద్ద హిట్ అయితే కనీసం 250 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుంది. ఇలాంటి సమయంలో విలన్ రోల్ కి ఒప్పుకుంటే, ఇక అందరూ ఆయన్ని అదే రోల్ కి సంప్రదించడం మొదలు పెడుతారు, అందుకే విక్రమ్ తెలివిగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపోతే ఈ సినిమా స్టోరీ రామాయణం ని బేస్ చేసుకొని ఉంటుందట. అప్పట్లో లక్ష్మణుడి ప్రాణాలకు కాపాడడం కోసం హనుమంతుడు పారిజాత పుష్పం కోసం ఒక పర్వతాన్నే తీసుకొస్తాడు. మళ్ళీ ఆ పారిజాతం కోసమే మహేష్ ప్రయాణం ఈ చిత్రంలో ఉంటుందని తెలుస్తుంది.