Homeఅంతర్జాతీయంVivek Ramaswamy: ట్రంప్ ఓటమి.. ఈ భారతీయుడి అధ్యక్ష కలలను కల్లలు చేసింది..

Vivek Ramaswamy: ట్రంప్ ఓటమి.. ఈ భారతీయుడి అధ్యక్ష కలలను కల్లలు చేసింది..

Vivek Ramaswamy:అమెరికా రాజకీయాలలో భారతీయ సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి సంచలన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. భవిష్యత్తు కాలంలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా అతడు నిలబడతాడని ప్రచారంలో కూడా ఉంది. అయితే ఈయన అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఓహియో గవర్నర్ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన డెమోక్రటిక్ అభ్యర్థి అమీ యాక్టన్ చేతిలో ఓడిపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఈయన అత్యంత దగ్గర వ్యక్తి. ట్రంప్ రూపొందించిన మాగా విధానాల వెనక వివేక్ […]

Vivek Ramaswamy:అమెరికా రాజకీయాలలో భారతీయ సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి సంచలన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. భవిష్యత్తు కాలంలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా అతడు నిలబడతాడని ప్రచారంలో కూడా ఉంది. అయితే ఈయన అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఓహియో గవర్నర్ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన డెమోక్రటిక్ అభ్యర్థి అమీ యాక్టన్ చేతిలో ఓడిపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఈయన అత్యంత దగ్గర వ్యక్తి. ట్రంప్ రూపొందించిన మాగా విధానాల వెనక వివేక్ ఉన్నాడని అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. వివేక్ ఓడిపోవడం పట్ల రిపబ్లికన్ పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఓహియో కు స్వింగ్ స్టేట్ అనే పేరు ఉంది అయితే ఇక్కడ వివేక్ ఓడిపోవడం వెనక ట్రంప్ కారణమని తెలుస్తోంది. దేశంలో ధరలు పెరిగిపోవడం.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఓటర్లు విసుగు చెందారు. అందువల్ల ఓటర్లు రిపబ్లికన్ల వైపు ఆసక్తి చూపించలేదు. వివేక్ రామస్వామి కూడా వ్యాపారవేత్తగా కాకుండా.. ట్రంప్ నీడలో ఉన్న వ్యక్తిగానే ప్రచారం చేశారు. స్థానికంగా ఉన్న సమస్యల మీద ఆయన దృష్టి పెట్టలేదు. తన ప్రచారంలో జాతీయస్థాయి అంశాల మీద మాట్లాడారు. వివాదాస్పద అంశాల గురించి దృష్టి పెట్టారు . ఇవి ఆయన విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి.

ఈ ఓటమితో వివేక్ భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన మొదలైంది. ఆయన అమెరికా అధ్యక్ష రేసులో ఉండేది అనుమానమే అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. 2024లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ప్రైమరీలలో వివేక్ పోటీ చేశారు. గుర్తింపు కూడా పొందారు. 2028 వైట్ హౌస్ రేసులో రిపబ్లికన్ తరఫున ప్రధాన పోటీదారిగా ఉంటాడని అందరూ అనుకున్నారు. సొంత రాష్ట్రమైన ఓహియో లోనే ఆయన గవర్నర్ గా గెలవలేకపోయారు . ఇలాంటి సమయంలో జాతీయస్థాయిలో దేశ అధ్యక్షుడిగా ఓట్లు సాధించడం అనుమానమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం ఓటర్ల మనో గతాన్ని.. విరాళాలు ఇచ్చే దాతలను ప్రభావితం చేస్తుందని వారు చెబుతున్నారు.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వివేక్ భవిష్యత్ కాలంలో అధ్యక్షుడు కావడం దాదాపు అసాధ్యం. సొంత రాష్ట్రంలో ఆయన పట్టు కోల్పోయారు. ఇలాంటి వ్యక్తులకు సొంత పార్టీలో నేషనల్ కమిటీ అధ్యక్షుడిగా నామినేషన్ ఇవ్వడం దాదాపుగా కష్టం. వచ్చే రోజుల్లో ఆయన మీడియా విశ్లేషకుడి పాత్ర లేదా కార్పొరేట్ రంగానికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తు కాలంలో మళ్ళీ అధ్యక్ష రేసులకి రావాలి అనుకుంటే.. ప్రత్యర్థులు ఓహియో పలితాన్ని తెర ముందు పెట్టే ప్రమాదం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper