Homeఆంధ్రప్రదేశ్‌Annadata Sukhibhava: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్..'అన్నదాత సుఖీభవ' పై అప్డేట్!

Annadata Sukhibhava: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్..’అన్నదాత సుఖీభవ’ పై అప్డేట్!

Annadata Sukhibhava: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ మలివిడత నిధుల చెల్లింపులపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అన్నదాత సుఖీభవ నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి రెండో విడత నిధులు జూన్ నెలలో జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు వినాయక చవితి పండగకు ముందే మలి విడత నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు. కానీ కేంద్ర ప్రభుత్వం […]

Annadata Sukhibhava: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ మలివిడత నిధుల చెల్లింపులపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అన్నదాత సుఖీభవ నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి రెండో విడత నిధులు జూన్ నెలలో జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు వినాయక చవితి పండగకు ముందే మలి విడత నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు. కానీ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కు సంబంధించిన సంసిద్ధత రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలన్న ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం ఆ సన్న హాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన తేదీ వస్తే అదే రోజు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయాలన్న ఆలోచనతో ఉంది.

* గత ఆర్ధిక సంవత్సరం మూడు విడతల్లో..
టిడిపి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం సాగు నిమిత్తం రైతులకు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20 వేల రూపాయల సాయం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే గత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమలు చేస్తున్నారు. కేంద్రం అందించే పీఎం కిసాన్ సాయంతోనే అన్నదాత సుఖీభవ మొత్తాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి రెండుసార్లు అందించారు. మూడోసారి సాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. మూడో విడత సాయానికి సంబంధించి కేంద్రం ఒక తేదీని ప్రకటిస్తే.. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అందించేందుకు సిద్ధంగా ఉంది.

* మొత్తం మూడు విడతల్లో..
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరంగా రూ.14000.. కేంద్ర ప్రభుత్వపరంగా 6 వేల రూపాయల సాయం అందుతూ వస్తోంది. అయితే ఈ మొత్తం 20 వేల రూపాయలు మూడు విడతల్లో అందిస్తున్నారు. తొలి రెండు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 5000 అందిస్తే.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కేంద్ర 2000 కలిపి.. మొత్తం 7000 అందుతోంది. రెండో విడత కూడా అదే విధంగా 7000 అందిస్తూ వస్తోంది. చివరి విడతలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 4000, కేంద్ర ప్రభుత్వం 2000 కలిపి 6000 అందనుంది. అయితే ఈ మలి విడత సాయానికి సంబంధించి వినాయక చవితి తర్వాత కానీ. ముందు కానీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అక్టోబర్ మొదటి వారంలో అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడే సాయం అందించనుందని తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper