Pakistan Independence Day: మనకంటే ఒకరోజు ముందు పాకిస్తాన్లో స్వాతంత్ర దినోత్సవం జరుగుతుంది. మన నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుంది. వాస్తవానికి ఒక దేశానికి స్వాతంత్ర దినోత్సవం అంటే దేశం మొత్తం పండగ వాతావరణం ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశమైనా సరే స్వాతంత్ర దినోత్సవాన్ని గొప్పగా జరుపుతూ ఉంటుంది. ఒక పాకిస్తాన్ తప్ప.
గతంలో పాకిస్తాన్ దేశంలో జరిగిన స్వాతంత్ర వేడుకలకు సంబంధించిన దృశ్యాలు అంతగా కనిపించేవి కావు. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా ఇంత బలంగా లేదు. మీడియా కూడా పాకిస్తాన్ దేశానికి సంబంధించిన నెగెటివ్ వార్తలను పెద్దగా చూపించేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియా అత్యంత బలంగా రూపాంతరం చెందింది. ఫలితంగా పాకిస్తాన్ దేశానికి సంబంధించిన అన్ని విషయాలు మనకు వెంటనే తెలిసిపోతున్నాయి.
పాకిస్తాన్ దేశంలో స్వాతంత్ర వేడుకలకు సంబంధించిన దృశ్యాలు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. గాడిద మీద కూర్చున్న ఓ బాలుడు పాకిస్తాన్ జెండా పట్టుకొని.. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరో వృద్ధుడు పాకిస్తాన్ జెండా చివరన ఉన్న లాలీపాప్ తింటూ కనిపించాడు. ఇంకొక వ్యక్తి పాకిస్తాన్ జాతీయ జెండా రూపంలో ఉన్న వస్తువులను ధరించాడు. నెత్తి మీద పాకిస్తాన్ జాతీయ జెండాలు ధరించి.. విచిత్రంగా డ్యాన్స్ వేస్తున్నాడు. ఇక పాకిస్తాన్ అధ్యక్షుడు ఆ జెండాను ఎగరవేసే క్రమంలో తాడు గట్టిగా లాగడంతో అది మొత్తం కింద పడిపోయింది. ఒక క్రియేటర్ ఈ దృశ్యాలను మొత్తం ఒకే వీడియోలో రూపొందించాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో చూసిన భారతీయులు పాకిస్తాన్ దేశాన్ని తెగ ఆడేసుకుంటున్నారు. చూశారు కదా పాకిస్తాన్ గొప్పతనం.. మనకంటే ఒక రోజు ముందు స్వాతంత్రం ప్రకటించుకుంది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికీ అదే దరిద్రం. అదే చండాలం. పాకిస్తాన్ మారదు. మారే అవకాశం లేదు. ఒకవేళ మారితే అది పాకిస్తాన్ కాదు.. ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పాకిస్తాన్ దేశం కూరుకుపోయింది. కనీసం రోజువారి ఖర్చులకు కూడా ఆ దేశం దగ్గర డబ్బులు లేవు. దీంతో ప్రపంచ దేశాల వద్ద అప్పులు చేస్తోంది. అందువల్లే పాకిస్తాన్లో పరిస్థితి ఇంతకు దిగజారిపోయింది.