Homeఅంతర్జాతీయంPakistan Donkey Processing Plant Closure: పాకిస్తాన్ లో బోర్డు తిప్పేస్తున్నారు.. దాయాది ’దుకాణం‘ బంద్

Pakistan Donkey Processing Plant Closure: పాకిస్తాన్ లో బోర్డు తిప్పేస్తున్నారు.. దాయాది ’దుకాణం‘ బంద్

Pakistan Donkey Processing Plant Closure: పాకిస్తాన్‌ అనుసరిస్తున్న విధానాలతో అక్కడి కంపెనీలు బోర్డు తిప్పేస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కూడా చాలా సంస్థలు మూతపడ్డాయి. ఉగ్రవాదులను పెంచి పోషించడం, ఆఫ్గానిస్తాన్, భారత్‌తో గొడవలు పెట్టుకోవడం, స్థానిక రాజకీయ అస్థిరత తదితర కారణాలతో చాలా ప్రముఖ కంపెనీలు చేతులు ఎత్తేస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన హ్యాంగెంగ్‌ ట్రేడ్‌ కంపెనీ గ్వాదర్‌లోని డాంకీ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను మూసివేసింది. ఇరకరడ గాడిదల చర్మాలు, మాంసం చైనాకు ఎగుమతి చేస్తుంది. కంపెనీ […]

Pakistan Donkey Processing Plant Closure: పాకిస్తాన్‌ అనుసరిస్తున్న విధానాలతో అక్కడి కంపెనీలు బోర్డు తిప్పేస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కూడా చాలా సంస్థలు మూతపడ్డాయి. ఉగ్రవాదులను పెంచి పోషించడం, ఆఫ్గానిస్తాన్, భారత్‌తో గొడవలు పెట్టుకోవడం, స్థానిక రాజకీయ అస్థిరత తదితర కారణాలతో చాలా ప్రముఖ కంపెనీలు చేతులు ఎత్తేస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన హ్యాంగెంగ్‌ ట్రేడ్‌ కంపెనీ గ్వాదర్‌లోని డాంకీ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను మూసివేసింది. ఇరకరడ గాడిదల చర్మాలు, మాంసం చైనాకు ఎగుమతి చేస్తుంది.

కంపెనీ నేపథ్యం
హ్యాంగెంగ్‌ ట్రేడ్‌ 2023లో గ్వాదర్‌ నార్త్‌ ఫ్రీ జోన్‌లో స్థాపించబడింది. చైనా–పాక్‌ ఒప్పందం ప్రకారం ఏటా 2–3 లక్షల గాడిదల చర్మాలు, మాంసం సరఫరా చేయాలి. చైనాలో ఎజియావ్‌ (గాడిద చర్మం)కు డిమాండ్‌ ఎక్కువ.

భారీగా పెట్టుబడి..
50 మిలియన్‌ యువాన్లు (సుమారు 7 మిలియన్‌ ్ఖ ఈ) పెట్టుబడి. అధునాతన స్లాటర్‌హౌస్, 50 కంటైనర్లు/నెల ఎగుమతి లక్ష్యం. గాడిదలు చంపి చర్మాలు శుద్ధి, మాంసం ప్రీజ్‌ చేసి రసాయనాలు కలిపి ఎగుమతి.

మూసివేత కారణాలు
‘నాన్‌–కమర్షియల్‌ ఫ్యాక్టర్లు‘, ఎగుమతి ఆలస్యాలు, అధికారుల సహకారం లేకపోవడం. 3 నెలలు చర్చలు ఫలం కాలేదు. అధికారులు ఇబ్బంది పెడుతుండడంతో మే 1న కంపెనీని చైనా మూసివేసింది. బలూచిస్తాన్‌లో అల్లర్లు, బీఎల్‌ఏ దాడులు కూడా ఇందుకు ఓ కారణం. ఇది చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో కీలకం.

బతిమిలాడుతున్న పాకిస్తాన్‌..
పాక్‌ ప్రధాని షెహ్బాజ్‌ షరీఫ్‌ కార్యాలయం జోక్యం చేసుకుని కంపెనీ మూసివేయొద్దని చైనాను వేడుకుంటోంది. ఏం కావాలన్నా ఇస్తామని కంపెనీ మాత్రం మూసివేద్దని బతిమిలాడుతోంది. ‘చైనా స్నేహితుడు‘ అని ప్రశంసించింది. కంపెనీ మూత పడితే దేశం పరువు పోతుందని ఆందోళన చెందుతోంది.

కంపెనీ మూతపడడం చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌కు తీవ్ర దెబ్బ, చైనా పెట్టుబదులకు ఆందోళన. పాక్‌ బ్యూరోక్రసీ సమస్యలు, భద్రతా కొరతలు బయటపడ్డాయి. గాడిదల సంఖ్య తగ్గుతున్నా ఒప్పందం కొనసాగుతుంది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చైనా పెట్టుబదులను ఆపవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper