Homeఅంతర్జాతీయంBLA Attacks: బలూచ్‌ దెబ్బ.. పాకిస్తాన్‌ అబ్బ.. ఉ*చ్ఛ పోసుకుంటున్న ఆర్మీ!

BLA Attacks: బలూచ్‌ దెబ్బ.. పాకిస్తాన్‌ అబ్బ.. ఉ*చ్ఛ పోసుకుంటున్న ఆర్మీ!

BLA Attacks: పాకిస్తాన్‌లో బలూచ్‌ స్వాతంత్య్ర సైనికుల దాడులు ఆ దేశ ఐక్యతకు తీవ్ర ఆధిపత్య ముప్పుగా మారాయి. ఏప్రిల్‌ 25 నుంచి మే 4 వరకు 11 చోట్ల గెరిల్లా దాడులతో పాక్‌ సైన్యం, పంజాబ్‌ నాయకత్వం దెబ్బలు తాకుతున్నాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో ఉండి, గ్వాదర్‌ పోర్టు, పస్ని బేస్‌తో కీలకమైన ఈ ప్రాంతం విడిపోతే పాకిస్తాన్‌ ఆర్థిక–కాంటినెంటల్‌ ఆధారాలు కుప్పకూలే ప్రమాదం ఉంది. భారీగా ఆస్తినష్టం.. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ఆధ్వర్యంలో […]

BLA Attacks: పాకిస్తాన్‌లో బలూచ్‌ స్వాతంత్య్ర సైనికుల దాడులు ఆ దేశ ఐక్యతకు తీవ్ర ఆధిపత్య ముప్పుగా మారాయి. ఏప్రిల్‌ 25 నుంచి మే 4 వరకు 11 చోట్ల గెరిల్లా దాడులతో పాక్‌ సైన్యం, పంజాబ్‌ నాయకత్వం దెబ్బలు తాకుతున్నాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో ఉండి, గ్వాదర్‌ పోర్టు, పస్ని బేస్‌తో కీలకమైన ఈ ప్రాంతం విడిపోతే పాకిస్తాన్‌ ఆర్థిక–కాంటినెంటల్‌ ఆధారాలు కుప్పకూలే ప్రమాదం ఉంది.

భారీగా ఆస్తినష్టం..
బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ఆధ్వర్యంలో టెలికామ్‌ టవర్లు, మిలిటరీ క్యాంపులు, ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరిగాయి. నాలుగు ఐఈడీ దాడులతో 11 మంది సైనికులు మరణించారు. ముగ్గురు ఇంటెలిజెన్స్‌ అధికారులు బందీలుగా పట్టుపడ్డారు. పంచ్‌గుర్‌ మెయిన్‌ రోడ్‌ను రెండు రోజులు దిగ్బంధనం చేసి, సంపద తరలణ ట్రక్కులను దగ్ధం చేశారు. దల్‌బందీ, కళాత్, చండీ, లోడీ, అల్మా ప్రాంతాల్లో గ్రెనేడ్, కాల్పుల దాడులు జరిగాయి. బలూచ్‌ వైపు కేవలం ముగ్గురు (అసద్‌ జమాలుద్దీన్, షకీల్‌ రహ్మాన్, షేక్‌ మింగల్‌) మరణించారు, వీరిని అమరులుగా ప్రకటించారు.

పాక్‌ సైన్య ప్రతిస్పందన
పాక్‌ ప్రభుత్వం అదనపు సైన్యం పంపాలని ఆలోచిస్తోంది, బందీల విడుదలకు ప్రయత్నాలు లేవు. పఠాన్‌ సైనికులకు ‘పోరాడండి, చావండి‘ ఆదేశాలు జారీ చేసి, సెలవులు రద్దు చేశారు. అమాయక బలూచ్‌ యువకులు, వృద్ధులు, పిల్లలను కిడ్నాప్‌ చేసి ఐదారు వేల మందిని చంపేశారని ఆరోపణలు ఉన్నాయి. మే 1న భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

బలూచ్‌ ఆస్తులు దోచుకుంటోందని..
బలూచిస్తాన్‌ సంపద (గ్యాస్, కనీమాలు) పంజాబ్‌ చొరబడి తీసుకుంటోందని బలూచ్‌ ఆరోపణలు. చైనా సీపీఈసీ ప్రాజెక్టు ద్వారా ప్రాంతాన్ని ఆక్రమించాలనే ప్రయత్నం తిరుగుబాటును ఊపింది. పాక్‌ సైన్యం బలూచ్, పఠాన్‌ల మధ్య విభేదాలను పెంచుతూ, అణచివేతకు పాల్పడుతోంది.

పాకిస్తాన్‌ ఈ తిరుగుబాటును అణచివేయాలంటే రాజకీయ సంభాషణలే మార్గం. సైనిక దాడులు విభజనను వేగవంతం చేస్తాయి. అంతర్జాతీయ సమాజం ఈ మానవ హక్కుల ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలి. లేకపోతే, పాక్‌ మరో బంగ్లాదేశ్‌లా విడిపోతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper