Homeఆంధ్రప్రదేశ్‌Venkatrami Reddy Controversy: ఉద్యోగము లేదు.. జగన్ ఆదరణ లేదు.. పాపం వెంకట్రామిరెడ్డి

Venkatrami Reddy Controversy: ఉద్యోగము లేదు.. జగన్ ఆదరణ లేదు.. పాపం వెంకట్రామిరెడ్డి

Venkatrami Reddy Controversy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉద్యోగులు వ్యతిరేకం అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వానికి గా పని చేసేవారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికంటే ఎక్కువగా విధేయత చూపేవారు జగన్మోహన్ రెడ్డి పట్ల. ఐదేళ్లపాటు ఒక వెలుగు వెలిగారు ఆయన. కూటమి వచ్చిన తర్వాత కూడా అదే చేష్టలతో ముందుకు వెళ్లారు. అందుకే ఇప్పుడు కూటమి న్యాయపరంగా, సాంకేతికంగా.. పక్కాగా ఆధారాలను సేకరించి […]

Venkatrami Reddy Controversy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉద్యోగులు వ్యతిరేకం అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వానికి గా పని చేసేవారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికంటే ఎక్కువగా విధేయత చూపేవారు జగన్మోహన్ రెడ్డి పట్ల. ఐదేళ్లపాటు ఒక వెలుగు వెలిగారు ఆయన. కూటమి వచ్చిన తర్వాత కూడా అదే చేష్టలతో ముందుకు వెళ్లారు. అందుకే ఇప్పుడు కూటమి న్యాయపరంగా, సాంకేతికంగా.. పక్కాగా ఆధారాలను సేకరించి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. అయితే అప్పటివరకు తనను తాను ఓ స్థాయిలో ఊహించుకున్న వెంకట్రామిరెడ్డి.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో భరోసా లేక.. న్యాయస్థానం నుంచి ఉపశమనం పొందాలని చూస్తున్నారు. కానీ కూటమి అన్ని ఆధారాలు చూపించడంతో అక్కడ కూడా వర్కౌట్ కావడం లేదు.

* పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్..
ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న వెంకట్రామిరెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో పని ఏంటి? అక్కడకు వెళ్లి తరచు మీడియాతో మాట్లాడిన పాత వీడియోలు ఇప్పుడు కోర్టు దృష్టికి వెళ్లడంతో ఆయనకు అక్కడ తగిన రీతిలో సానుకూలత రావడం లేదు. దీంతో ఉద్యోగం కోల్పోయి.. కోర్టుల్లో ఊరట దక్కక ఆయన పడుకున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు కీలకమైన పోస్ట్ దక్కుతుందని ఎంతో ఆశపడ్డారు వెంకట్రామిరెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి అంత సీన్ లేదన్నట్టు వదిలేసినట్లు ప్రచారం నడుస్తోంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వారు ఆయనకు ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నారు. అయినా సరే పక్కా ఆధారాలు ఉండడంతో కోర్టులు కూడా పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు లేవు.

* ముఖం చాటేసిన జగన్..
సాధారణంగా ఏదైనా ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించే ఉద్యోగ సంఘం నేతలకు ఆ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. కానీ వెంకట్రామిరెడ్డి విషయంలో భిన్నం కనిపిస్తోంది. వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లు పెట్టేందుకు ఓకే కానీ.. పెద్ద పెద్ద పదవులు అంటే మాత్రం నో ఛాన్స్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి నుంచి సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఉన్న ఉద్యోగము పోయి.. న్యాయస్థానాల్లో ఊరట దక్కక.. వెంకట్రామిరెడ్డి పడుతున్న బాధ.. ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయం చేయాలనుకున్న వారికి ఒక గుణపాఠమే…

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper