Homeఅంతర్జాతీయంModi vs Trump Trade War: మోదీ దెబ్బ అట్లుంటదీ.. ఇప్పటికైనా ట్రంప్ తెలుసుకోవాలి

Modi vs Trump Trade War: మోదీ దెబ్బ అట్లుంటదీ.. ఇప్పటికైనా ట్రంప్ తెలుసుకోవాలి

Modi vs Trump Trade War: అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది పాలనలో ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధించడంతోనే గడిపేశాడు. ముఖ్యంగా భారత్‌పై అయితే కక్ష సాధింపు చర్యలకు దిగాడు. ఫస్ట్‌ టర్మ్‌లో మోదీ తన మిత్రుడు అన్న ట్రంప్‌.. ఈసారి మోదీని విమర్శించడం, భారత్‌ను విమర్శించడం, భారత్‌లో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకోవడం, అమెరికాలో భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ఆదేశాలు ఇవ్వడం వంటివి చేశారు. […]

Modi vs Trump Trade War: అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది పాలనలో ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధించడంతోనే గడిపేశాడు. ముఖ్యంగా భారత్‌పై అయితే కక్ష సాధింపు చర్యలకు దిగాడు. ఫస్ట్‌ టర్మ్‌లో మోదీ తన మిత్రుడు అన్న ట్రంప్‌.. ఈసారి మోదీని విమర్శించడం, భారత్‌ను విమర్శించడం, భారత్‌లో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకోవడం, అమెరికాలో భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ఆదేశాలు ఇవ్వడం వంటివి చేశారు. భారత ఎకానమీ డెడ్‌ ఎకానమీ అని వ్యాఖ్యానించారు. ఇక పాకిస్తాన్‌తో దోస్తీ చేశారు. కానీ ట్రంప్‌ వ్యాఖ్యలను మోదీ, భారత్‌ లెక్క చేయలేదు. సైలెంట్‌గా మోదీ తన పని తాను చేసుకుంటూ ముందుకుసాగారు. అపర చాణక్యం ప్రదర్శించారు. దీంతో ట్రంప్‌ దెబ్బకు దిగిరాక తప్పలేదు. మోదీ దిగిరావాలని అనుకుట్రంప్‌.. ఇప్పుడు తాను స్వయంగా ఫోన్‌ చేసి ట్రేడ్‌ డీల్‌కు అభ్యర్థిస్తున్నాడు.
దీని వెనుక భారత్‌ సంకల్పం..
గతేడాది ఆగస్టు–సెప్టెంబర్‌లో షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా అధినేత పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్‌ ఏకతలో కనిపించడం ట్రంప్‌కు ఆఘాతంగా మారింది. భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ అమెరికా సందర్శనలో భారత షరతులను స్పష్టం చేసి, చర్చలకు సిద్ధతను తెలిపారు. ఈ సమయంలో ట్రంప్‌ మోదీకి ఫోన్‌ చేసి ఆహ్వానాలు పంపినా, భారత్‌ బ్రిటన్, ఆస్ట్రేలియా, ఈయూతో ఒప్పందాలు ముగించి బహుళ ఆప్షన్లను ఏర్పరిచింది. ట్రంప్‌ టారిఫ్‌లను ఎదుర్కొనే స్థితిలోకి చేరాడు. మన ప్రయోజనాలు వదులుకుని ఒప్పందం చేసుకోబోమని,. అవసరమైతే అమెరికాతో ట్రంప్‌ దిగిపోయాక వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి కూడా అమెరికా సిద్ధమైంది.
పరిశ్రమలు, పెట్టుబడుల విస్తరణ
టారిఫ్‌లు ఆభరణాలు, వస్త్రాలు, తోళ్ల పరిశ్రమలను తాత్కాలికంగా ప్రభావితం చేసినా, విస్తృత వాణిజ్య వ్యవధులు ఈ నష్టాన్ని సమతుల్యం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్‌ వంటి సంస్థల 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, టెస్లా ప్రవేశం భారత ఆకర్షణను పెంచాయి. బ్రెజిల్, కెనడా నాయకుల సందర్శనలు ఈ దిశగా బలం చేకూర్చుతున్నాయి. భారత్‌ 41 దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ, సార్వభౌమ నిర్ణయాలను కాపాడుకుంటోంది. అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ముందే ఒప్పందం పూర్తి చేయాలనే ఒత్తిడి ట్రంప్‌ వైపు పడింది.
విపక్షాల ఆందోళనలు..
విపక్షాలు ఒప్పందానికి ముందే భారత లాభాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, భారత మౌనం, బహుళ ఒప్పందాలు దీనికి సమాధానంగా నిలుస్తాయి. తన ఆర్థిక వ్యవస్థ, సార్వభౌమత్వం, నిర్ణయాధికారం విషయంలో అమెరికాకు లొంగబోమని స్పష్టత ఇచ్చింది. దీంతో ట్రంప్‌ తలొగ్గక తప్పలేదు.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper