Homeఅంతర్జాతీయంRussia Dollar Business: రష్యా డాలర్‌ బిజినెస్‌.. భారత్‌పై ప్రభావం?

Russia Dollar Business: రష్యా డాలర్‌ బిజినెస్‌.. భారత్‌పై ప్రభావం?

Russia Dollar Business: రష్యా–ఉక్రెయిన్‌ మధ్య నాలుగేళ్లుగా యుద్ధం జరుగుతోంది. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో యుద్ధం ఆపుతానని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కానీ అధికారం చేపట్టి ఏడాది అయినా యుద్ధం ఆగలేదు. ఇక యుద్దం నేపథ్యంలో రష్యాపై అమెరికా, యురోపియన్‌ యూనియన్‌ దేశాలు వ్యాపారం తగ్గించాయి. దీంతో రష్యా తన వ్యాపార తీరును మార్చుకుంది. రూబుల్స్, యువాన్, రూపాయల్లోకి మార్చింది. అయితే తాజాగా రష్యా తన నిర్ణయాన్ని మళ్లీ […]

Russia Dollar Business: రష్యా–ఉక్రెయిన్‌ మధ్య నాలుగేళ్లుగా యుద్ధం జరుగుతోంది. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో యుద్ధం ఆపుతానని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కానీ అధికారం చేపట్టి ఏడాది అయినా యుద్ధం ఆగలేదు. ఇక యుద్దం నేపథ్యంలో రష్యాపై అమెరికా, యురోపియన్‌ యూనియన్‌ దేశాలు వ్యాపారం తగ్గించాయి. దీంతో రష్యా తన వ్యాపార తీరును మార్చుకుంది. రూబుల్స్, యువాన్, రూపాయల్లోకి మార్చింది. అయితే తాజాగా రష్యా తన నిర్ణయాన్ని మళ్లీ మార్చుకుంది. తిరిగి డాలర్లలో బిజినెస్‌ చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపనుంది.

మార్పు కారణాలు..
స్విఫ్ట్‌ బహిష్కారం తర్వాత రూబుల్, యువాన్‌లకు మారిన రష్యా, ఇప్పుడు డాలర్‌ ప్రాముఖ్యతను గుర్తించింది. ట్రంప్‌తో రాజకీయ మార్పులు, ఇంధన–ఖనిజాల వ్యాపారంలో ఉపశమనం కోసం రష్యా డాలర్‌వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. డాలర్‌ అంగీకారంతో మార్కెట్లో సౌలభ్యం పెరుగుతుంది.

ప్రపంచ ఆర్థిక పరిణామాలు..
ప్రపంచంలో ఒకవైపు డీ డాలరైజేషన్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్రిక్స్‌ దేశాలు ఈమేరకు కసరత్తు చేస్తున్నాయి. దేశాల మధ్య అనైక్యత కొంత ఇబ్బందిగా మారింది. ఇలాంటి తరుణంలో రష్యా నిర్ణయం డీ–డాలరైజేషన్‌ ప్రయత్నాలకు దెబ్బ తగిలే అవకాశం ఉంది. డాలర్‌ డిమాండ్‌ పెరిగి అమెరికా ఆర్థిక బలాన్ని పెంచుతుంది. బ్రిక్స్‌ లక్ష్యాలు దెబ్బతింటాయి. చమురు ధరలు స్థిరంగా ఉంటాయి.

భారతదేశంపై ప్రభావాలు..
ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో భారత్‌ రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతి పెంచింది. ఇదే సమయంలో రష్యా భారత్‌కు రూపాయల్లో కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. రూపాయలను కూడా భారత్‌లోనే పెట్టుబడి పెట్టింది. రష్యాలో తాజా మార్పు భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆయిత్‌ దిగుమతి తగ్గడంతోపాటు అమెరికా డాలర్‌ బలపడితే మన రూపాయి బలహీనపడుతుంది. దిగుమతి ఖర్చులు పెరుగుతాయి. ద్రవోల్బణం పెరిగే ప్రమాదం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper