Homeజాతీయ వార్తలుDelhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ వేర్పాటు వాదులు అందులోకి ప్రవేశించారు. సరిగ్గా గణతంత్ర దినోత్సవం జరిగిన తర్వాత ఎర్రకోట మీద ఖలీస్థానీ జెండా ఎగరవేశా. దీంతో ఈ రైతు ఉద్యమం వెనుక ఉన్న అజెండా ఏమిటో అందరికీ అర్థమైంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే ఆ […]

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ వేర్పాటు వాదులు అందులోకి ప్రవేశించారు. సరిగ్గా గణతంత్ర దినోత్సవం జరిగిన తర్వాత ఎర్రకోట మీద ఖలీస్థానీ జెండా ఎగరవేశా. దీంతో ఈ రైతు ఉద్యమం వెనుక ఉన్న అజెండా ఏమిటో అందరికీ అర్థమైంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే ఆ చట్టాలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. తద్వారా యూపీ ఎన్నికల్లో విపక్ష పార్టీలు ఊహించని విధంగా స్కెచ్ వేశారు. దీంతో ఆ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. మనదేశంలో ఉద్యమాల వెనుక ఉన్న శక్తులు ఎలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయో నాడు ఈ సంఘటన బయటకు తెలిసేలా చేసింది.

ఇప్పుడు ఢిల్లీలో కొంతమంది ఉద్యమాలు చేస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నీటి పేపర్ లీకేజీ.. విద్యార్థుల ఆత్మహత్యలు వంటిఘటనలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇటీవల సోనం వాంగ్ చుక్ నిరధిక నిరాహార దీక్షకు దిగారు. ఆ తర్వాత ఆయన దీక్షను ప్రభుత్వం విరమింపజేసింది. ఆయన ఢిల్లీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సరిగా నిన్న ఢిల్లీలో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. చలో పార్లమెంట్ నినాదంతో ఢిల్లీ నగరంలో హడావిడి చేశారు. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పడంతో అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కిసాన్ ఘాట్ వద్ద రైతులు నిరసన తెలపడం మొదలుపెట్టారు. వేల సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. భారత్ – అమెరికా వాణిజప్పంలో భాగంగా తక్కువ ధరకు.. రాయితీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. అందువల్లే శంభు బార్డర్ (పంజాబ్, హర్యానా సరిహద్దు) వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. అయితే పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకున్నారు.

అటు బొద్దింకలు.. ఇటు రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో మరోసారి బిజెపికి విపత్కర పరిస్థితి తప్పదా అంటూ విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా రైతుల ఉద్యమం ముసుగులో చాలామంది ఢిల్లీలో తిష్ట వేసుకున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే పోలీసులు సమర్థవంతంగా అడ్డుకోవడంతో వారి పాచికలు పారలేదు. ఇప్పుడు మళ్లీ నీట్.. అమెరికా ఒప్పందం వంటి వాటిని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. అయితే దీని వెనక కూడా విదేశీ శక్తులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అందువల్లే ఈ ఉద్యమాలను ఉక్కుపాదంతో తొక్కి వేస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper