Homeసినిమా వార్తలుJabardasth Comedian Komuram : జబర్దస్త్ కమెడియన్ కట్టే ఈఎంఐల విలువ ఎంతో తెలుసా?

Jabardasth Comedian Komuram : జబర్దస్త్ కమెడియన్ కట్టే ఈఎంఐల విలువ ఎంతో తెలుసా?

Jabardasth Comedian Komuram : సరదా కోసం మనం చూసే యూట్యూబ్ ద్వారా ఎంతోమంది జీవితాలు నిలబడ్డాయి. కొంతమంది అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా యూట్యూబ్ ద్వారా స్టార్లు అయిన వారు సినిమాల్లో అవకాశాలు పొంది ఎంతో హ్యాపీగా ఉంటున్నారు. అలాంటి వారిలో కొమరక్క పేరుతో ప్రఖ్యాతి పొందిన కొమురం కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు సాధించుకున్న ఈ కమెడియన్ ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి సినిమాలో […]

Jabardasth Comedian Komuram : సరదా కోసం మనం చూసే యూట్యూబ్ ద్వారా ఎంతోమంది జీవితాలు నిలబడ్డాయి. కొంతమంది అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా యూట్యూబ్ ద్వారా స్టార్లు అయిన వారు సినిమాల్లో అవకాశాలు పొంది ఎంతో హ్యాపీగా ఉంటున్నారు. అలాంటి వారిలో కొమరక్క పేరుతో ప్రఖ్యాతి పొందిన కొమురం కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు సాధించుకున్న ఈ కమెడియన్ ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి సినిమాలో నాగులు పాత్రలో పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే ఆయన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నెలకు కట్టే ఈఎంఐ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎంత ఈఎంఐ చెల్లిస్తున్నాడో తెలుసా?

జీవితం ఆరంభంలో ఎన్నో కష్టాలు పడిన కొమురం అలియాస్ కొమరక్క.. ఒకానొక సందర్భంలో హోటల్ కార్మికుడిగా ఉండేవారు. కానీ ఆ తర్వాత తల టాలెంట్ కు పదును మిమిక్రీ ఆర్టిస్టుగా మీడియా లోకి ప్రవేశించాడు. మొదట ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 9 లో దండోరా అనే కార్యక్రమంలో కొమరక్క పాత్రలో అందరినీ అలరించారు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ లో ప్రవేశించి తన కామెడీతో అందరిని ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ప్రత్యేకంగా కొమరక్క పేరుతో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి లక్షల రూపాయలు సంపాదించాడు.

అయితే ఈయన ఇటీవల నెలకు కట్టే ఈఎంఐ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. కొమురం నెలకు 1,80,000 ఈఎంఐ చెల్లిస్తున్నట్లు తెలిపాడు. కొన్ని కారణాలవల్ల లోన్ తీసుకోవాల్సి వచ్చిందని.. ఈ లోన్ ద్వారా నెలకు ఇంత ఈఎంఐ చెల్లిస్తున్నట్లు తెలిపాడు. తనకు ఉన్న కొమరక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒకప్పుడు నెలకు రూ. 7 నుంచి 8 లక్షల వరకు ఆదాయం వచ్చేదని.. ప్రస్తుతం రూ. నెలకు లక్ష వరకు ఆదాయం వస్తున్నట్లు తెలిపాడు.

అయితే ఇటీవల ఆయన ఇరుముడి సినిమాలోకి ప్రవేశించిన తర్వాత సినీ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు లభించింది. దీంతో ఆయనకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో తన కామెడీతో అందరిని ఆకట్టుకుంటానని చెబుతున్నాడు. కష్టపడే వారికి కచ్చితంగా సక్సెస్ ఉంటుందని.. అయితే కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలని ఈ సందర్భంగా కొమరక్క అలియాస్ కుమార్ ఇతరులకు సూచిస్తున్నాడు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper