Homeఅంతర్జాతీయంIsrael, Crocodiles: ఉగ్రవాదులను మొసళ్లతో చంపేస్తోంది.. మోడీ సార్.. మనదేశంలోనూ ప్లాన్ చేయండి..

Israel, Crocodiles: ఉగ్రవాదులను మొసళ్లతో చంపేస్తోంది.. మోడీ సార్.. మనదేశంలోనూ ప్లాన్ చేయండి..

Israel Crocodiles: ఆయుధాలు అవసరం లేదు. శక్తివంతమైన బాంబులు కూడా అవసరం లేదు. జస్ట్ ముల్లును ముల్లుతోనే తీసినట్టు.. ఉగ్రవాదులను చంపేయడానికి గట్టి స్కెచ్ వేసింది ఆ దేశం. దీనికోసం భారీగా ఖర్చుపెట్టడం లేదు. కేవలం జంతువులను ఉపయోగిస్తుంది. అంతేకాదు, రెండవ కంటికి తెలియకుండా పని జరిగే విధంగా ప్లాన్లు చేస్తోంది. మొసళ్ళ ను నమ్ముకుంది ఇజ్రాయిల్ తెలుసు కదా. సాంకేతిక పరిజ్ఞానానికి.. ఆయుధపరిజ్ఞానానికి ప్రపంచానికే సరికొత్త పాఠాలు చెప్పే దేశం. ఎడారిలో వ్యవసాయం చేస్తుంది. డ్రిప్ […]

Israel Crocodiles: ఆయుధాలు అవసరం లేదు. శక్తివంతమైన బాంబులు కూడా అవసరం లేదు. జస్ట్ ముల్లును ముల్లుతోనే తీసినట్టు.. ఉగ్రవాదులను చంపేయడానికి గట్టి స్కెచ్ వేసింది ఆ దేశం. దీనికోసం భారీగా ఖర్చుపెట్టడం లేదు. కేవలం జంతువులను ఉపయోగిస్తుంది. అంతేకాదు, రెండవ కంటికి తెలియకుండా పని జరిగే విధంగా ప్లాన్లు చేస్తోంది.

మొసళ్ళ ను నమ్ముకుంది

ఇజ్రాయిల్ తెలుసు కదా. సాంకేతిక పరిజ్ఞానానికి.. ఆయుధపరిజ్ఞానానికి ప్రపంచానికే సరికొత్త పాఠాలు చెప్పే దేశం. ఎడారిలో వ్యవసాయం చేస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలు పండిస్తోంది. అంతేనా.. దేశాన్ని కాపాడుకునే విధానంలో ఏకంగా ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. అక్కడితోనే ఆగిపోలేదు ఇప్పుడు వేగంగా చుట్టూ ఉన్న శత్రువులకు గట్టి పాఠం చెప్పే విధంగా.. భవిష్యత్తు కాలంలో తమ జోలికి రాకుండా ఉండేందుకు మొసళ్ళ ను నమ్ముకుంది. తమ శత్రు దేశాల మీదికి వాటిని ప్రయోగించనుంది.

వారిని క్రొకోడైల్స్ చంపి తినేస్తాయి

ఇజ్రాయిల్ దేశానికి శత్రువులు చాలా ఎక్కువ. అందువల్లే తమ సెక్యూరిటీ ఏజెన్సీలు పట్టుకున్న ఉగ్రవాదులను అత్యంత కఠినమైన కారాగారాలలో బంధిస్తూ ఉంటుంది. అయితే వీరు పోలీసుల కళ్ళు కప్పి బయటపడకుండా ఉండేందుకు.. జైళ్ళ చుట్టూ కందకాలు తవ్విస్తోంది. వాటిల్లో క్రొకోడైల్స్ ను వదిలిపెడుతోంది. ఒకవేళ ఉగ్రవాదులు గోడ దూకి బయటకి పారిపోతే.. నేరుగా కందకాలలో పడతారు. వారిని క్రొకోడైల్స్ చంపి తినేస్తాయి. శత్రు శేషం.. రుణ శేషం మొత్తం క్లియర్ అవుతుంది. ఇదే ఆలోచనను ఇజ్రాయిల్ చేస్తోంది.

గతంలో అమెరికా కూడా ఇదే ఆలోచన

ఇజ్రాయిల్ కాకుండా గతంలో అమెరికా కూడా ఇదే ఆలోచన చేసింది. ట్రంప్ ప్రాంతంలో డీ టెన్షన్ సెంటర్ ఆధారంగా అప్పట్లో తెరపైకి అల్లిగెడర్ ఆల్కాట్రాజ్ అనే విధానం తెరపైకి వచ్చింది. దాని నుంచి స్ఫూర్తి పొందిన ఇజ్రాయిల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఈ వ్యూహాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. అత్యంత కఠినమైన భద్రత మధ్య సూపర్ మాక్సిమం జైళ్ళ చుట్టూ క్రొకోడైల్స్ ను ఏర్పాటు చేయాలనేది వారి ముఖ్య ఉద్దేశం.

మరో కారణం కూడా

ఇజ్రాయిల్ ఈ స్థాయిలో క్రొకోడైల్స్ ఏర్పాటు చేయాలని అనుకోవడం వెనుక మరో కారణం కూడా ఉంది. ఒకప్పుడు నైలునది ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో విస్తరించి ఉండేది. అయితే ఆ నదిలో క్రొకోడైల్స్ ను విస్తారంగా వేటాడటం వల్ల అవి అంతరించిపోయాయి. సరిగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్ దేశంలో చివరి వైల్డ్ నైల్ క్రొకోడైల్ కనిపించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 2012లో క్రొకోడైల్స్ ను వాణిజ్యంగా వినియోగించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు శత్రు దేశాలు మరింత పెరిగిపోవడంతో.. ఉగ్రవాదులు దాడులు చేసేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో వారి ఆగడాలకు చెక్ పెట్టేందుకు.. ఉన్న ఉగ్రవాద ఖైదీలు బయటికి వెళ్లకుండా ఉండేందుకు జైళ్ళ చుట్టూ క్రొకోడైల్ ఫార్మింగ్ ప్లాన్ ను ఇజ్రాయిల్ సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ పర్యావరణ శాఖ మంత్రి జూలైలో క్రొకోడైల్స్ పై ఉన్న రక్షిత ప్రాణి హోదాను రద్దు చేశారు. వాటిని పెంచుకోదగిన వన్యప్రాణి అనే కేటగిరీలోకి చేర్చారు. ఈ సవరణ వల్ల క్రొకోడైల్స్ కంట్రోల్ అనేది కేవలం అటవీశాఖ అధికారులకే కాకుండా.. జైళ్ళ శాఖ అధికారుల చేతుల్లో కూడా చేరిపోయింది.

కందకాలు తవ్వుతున్నారు

ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత పాలస్తీనా ఖైదీలు ఎక్కువగా ఉండే నెగెవు ఎడారి ప్రాంతంలో కేడ్జీ యోట్ జైలు చుట్టూ కందకాలు తవ్వుతున్నారు. దీనికోసం ప్రభుత్వం ఏకంగా ఏడు మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ ఉండటం విశేషం. ఈ క్రమంలో ఈ విధానం మీద జెరూసలేం డిస్ట్రిక్ట్ కోర్ట్.. జంతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు మీద తాత్కాలికంగా స్టే విధించింది. దీనిపై లెట్ ది యానిమల్స్ లీవ్ అనే సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు స్టే విధించినప్పటికీ ఇజ్రాయిల్ మంత్రులు ఏమాత్రం తగ్గలేదు. మా దేశం మీద దాడి చేస్తే.. క్రొకోడైల్స్ చేతిలో చస్తారని హెచ్చరికలు జారీ చేయడం విశేషం.

ఇజ్రాయిల్ సెక్యూరిటీకి మాత్రమే పరిమితం కాలేదు

మరోవైపు ఈ క్రోకోడైల్స్ వ్యవహారం కేవలం ఇజ్రాయిల్ సెక్యూరిటీకి మాత్రమే పరిమితం కాలేదు. ఈ దేశంలో ఉన్న విస్తృతమైన భూ నిర్వహణ.. ఇతర విధానాల మీద పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయిల్ ల్యాండ్ అథారిటీ కేకేఎల్, జే ఎన్ ఎఫ్ వంటి సంస్థలు విస్తృతంగా మొక్కలు నాటుతున్నాయి. ఎడారి ప్రాంతంలో మొక్కలు నాటుతూ దాదాపు 13 శాతం భూభాగాన్ని పచ్చగా మార్చేశాయి. ఇది ఇలా ఉంటే పాలస్తీనా పరిశోధకులు మాత్రం సరికొత్త చర్చను తెరమీద తీసుకొస్తున్నారు. వెస్ట్ బ్యాంక్ లాంటి నగరంలో పర్యావరణ పరిరక్షణ పేరుతో పశువులను మేత మేయకుండా చేస్తున్నారని.. ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఈ రెండు దేశాల మధ్య జాటర్ మూలికల సేకరణ పై నిషేధం కొనసాగుతోంది. ఇప్పుడు క్రొకోడైల్స్ వ్యవహారం సరికొత్తగా జత చేరింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.

ఇజ్రాయిల్ సంగతి ఎలా ఉన్నప్పటికీ..  మన దేశంలో కూడా ఇటువంటి ఆలోచన చేయాలని.. ఉగ్రవాదులకు కంటిమీద కునుకు లేకుండా చేయాలని నరేంద్ర మోడీకి నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper