Homeఎంటర్టైన్మెంట్OTT Weekend Movies: ఈ వారం OTTలో అద్భుతమైన కిక్కిచ్చే 5 చూడాల్సిన సినిమాలు ఇవే!

OTT Weekend Movies: ఈ వారం OTTలో అద్భుతమైన కిక్కిచ్చే 5 చూడాల్సిన సినిమాలు ఇవే!

OTT Weekend Movies: ప్రతీ వీకెండ్ మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ లో సరికొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాలు కూడా, కేవలం 4 వారాలకే ఓటీటీ లో దర్శనమిస్తున్నాయి. ఈ వారం కూడా అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఓటీటీ లో వచ్చే సినిమాలను మన తెలుగు ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా చూస్తుంటారు. కరోనా లాక్ డౌన్ సమయం నుండి […]

OTT Weekend Movies: ప్రతీ వీకెండ్ మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ లో సరికొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాలు కూడా, కేవలం 4 వారాలకే ఓటీటీ లో దర్శనమిస్తున్నాయి. ఈ వారం కూడా అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఓటీటీ లో వచ్చే సినిమాలను మన తెలుగు ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా చూస్తుంటారు. కరోనా లాక్ డౌన్ సమయం నుండి ఇది బాగా అలవాటైంది. ఈ వారం కూడా ఇతర భాషల్లో సంచలన విజయం సాధించిన సినిమాలను ఓటీటీ లో విడుదల చేశారు. వాటిల్లో ఒక 5 సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఇప్పుడు చెప్పబోయే సినిమాల్లో కొన్ని ఫ్లాప్స్ కూడా అయ్యాయి. కానీ ఓటీటీ లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. వాటి గురించి కూడా ఇప్పుడు చూడబోతున్నాము.

1) బేతేలమ్ కుడుంబా యూనిట్ :

గత దశాబ్ద కాలం నుండి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మలయాళం స్టార్ హీరో నివిన్ పౌలీ నటించిన ‘బేతేలమ్ కుడుంబా యూనిట్’ ఎలాంటి భారీ అంచనాలు లేకుండా గా సైలెంట్ గా విడుదలై , మలయాళం లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అక్కడి ట్రేడ్ అందించిన లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 320 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు. మమిత బైజు ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. మధ్య వయస్సుకి చెందిన ఒక అబ్బాయి , టీనేజ్ కి చెందిన అమ్మాయికి మధ్య జరిగిన క్యూట్ లవ్ స్టోరీ ఇది. అక్టోబర్ 2 నుండి ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని చూడొచ్చు. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.

2) సర్దార్ 2:

తమిళ హీరో కార్తీ నటించిన ఈ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. 2022 లో విడుదలైన సర్దార్ చిత్రానికి ఇది సీక్వెల్. అక్టోబర్ 1 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం అన్ని భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమాని ఓటీటీ లో చూసినప్పుడు , అంత పెద్ద ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా కాదే అనే ఫీలింగ్ వస్తుంది. సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువైనట్టు అనిపించింది కానీ , అనవసరమైన సన్నివేశాలతో విసుగుపుట్టించకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోనే సినిమాని నడిపిన ఫీలింగ్ ని కలిగించాడు డైరెక్టర్ మిత్రన్. కాకపోతే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ తగ్గినట్టు అనిపిస్తుంది కానీ , ఓవరాల్ గా చూడదగిన సినిమానే.

3) రోమాంచకం :

సుమంత్ ప్రభాస్ , అనంతిక హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిల్చింది. వేణు గోపాల్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు కాగా , సందీప్ రెడ్డి వంగ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. అక్టోబర్ 1న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అన్ని భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ హాఫ్ అదిరిపోతోంది. నేటి తరం జెన్ జీ ఆడియన్స్ కి నచ్చే విధంగా చాలా అద్భుతంగా తీసాడు డైరెక్టర్. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో ఉండదు కానీ , టైం పాస్ ఎంటర్టైనర్ ని చూశాము అనే ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది.

4) మహేంద్రగిరి వారాహి :

విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే ప్రముఖ హీరో సుమంత్ నటించిన ఈ థ్రిల్లర్ ఫాంటసీ చిత్రం రీసెంట్ గానే థియేటర్స్ లో విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది. అక్టోబర్ 2 న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా , ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది ఈ సినిమా. ముఖ్యంగా ఈ చిత్రం లో వచ్చే రెండు కీలక ట్విస్టులు ఆడియన్స్ మైండ్ బ్లాస్ట్ చేసే రేంజ్ లో ఉంటాయి. వాటి కోసమైనా ఈ చిత్రాన్ని ఒక్కసారి చూడొచ్చు.

5) ది ఇండియా స్టోరీ :

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ హిందీ చిత్రం రీసెంట్ గానే థియేటర్స్ లో విడుదలైన మిశ్రమ స్పందన ని సొంతం చేసుకుంది. దీంతో సెప్టెంబర్ 18 న ఈ చిత్రాన్ని జియో హాట్ స్టార్ లో విడుదల చేశారు. తెలుగు తో పాటు , అన్ని భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే సరిగా ప్రమోషన్స్ చేయడం వల్ల ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదని అనిపించింది కానీ , కాన్సెప్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందనే చెప్పొచ్చు. సామాన్యులకు కొన్ని విషయాల్లో అవగాహనా కచ్చితంగా ఉండాలి, వాటిని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ చిత్రాన్ని జియో హాట్ స్టార్ లో చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper