Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: ఓటింగ్ లో దుమ్ము లేపుతున్న త్రిగున్..రోహిత్ కి డేంజర్ బెల్స్..!

Bigg Boss 10 Telugu: ఓటింగ్ లో దుమ్ము లేపుతున్న త్రిగున్..రోహిత్ కి డేంజర్ బెల్స్..!

Bigg Boss 10 Telugu: నెగెటివ్ కంటెంట్ తో ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లో ఓట్లు రప్పించుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. నెగెటివ్ కంటెంట్ తో హౌస్ నుండి బయటకు వెళ్లిన వాళ్ళే ఎక్కువ. మొట్టమొదటిసారి నెగెటివ్ కంటెంట్ తో కూడా ఆడియన్స్ నుండి మంచి మార్కులు సంపాదించొచ్చు, భారీ ఓటింగ్ పెంచుకోవచ్చు, టాప్ 5 కంటెస్టెంట్ గా నిలబడొచ్చు అని నిరూపించుకున్న కంటెస్టెంట్ సంజన గల్రాని. ఇలాంటి కంటెస్టెంట్ ని మళ్లీ బిగ్ […]

Bigg Boss 10 Telugu: నెగెటివ్ కంటెంట్ తో ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లో ఓట్లు రప్పించుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. నెగెటివ్ కంటెంట్ తో హౌస్ నుండి బయటకు వెళ్లిన వాళ్ళే ఎక్కువ. మొట్టమొదటిసారి నెగెటివ్ కంటెంట్ తో కూడా ఆడియన్స్ నుండి మంచి మార్కులు సంపాదించొచ్చు, భారీ ఓటింగ్ పెంచుకోవచ్చు, టాప్ 5 కంటెస్టెంట్ గా నిలబడొచ్చు అని నిరూపించుకున్న కంటెస్టెంట్ సంజన గల్రాని. ఇలాంటి కంటెస్టెంట్ ని మళ్లీ బిగ్ బాస్ హౌస్ లో చూడలేము, నెగెటివ్ కంటెంట్ తో ఈ రేంజ్ కి ఎవ్వరూ చేరుకోలేరు అని అంతా అనుకున్నారు. కానీ ఆమెని ఆదర్శంగా తీసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాను అనే విధంగా ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో త్రిగున్ వ్యవహార శైలి ఉంది. హౌస్ లోకి వచ్చిన మొదటి క్షణం నుండే తన మార్కు వేయడానికి రెడీ అయ్యాడు త్రిగున్.

కంటెస్టెంట్స్ అందరినీ ఓవర్ గా డామినేట్ చేస్తూ , తన పాయింట్స్ ని వాళ్ళ బుర్రలో రిజిస్టర్ అయ్యేలా చేయడం , వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేయడం వంటి లక్షణాలు చూసిన ఆడియన్స్ , ఎవరు ఇతను ఇంత వెరైటీ గా ఉన్నాడు?, కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కి కూడా ఇతన్ని చూస్తుంటే చిరాకు కలుగుతోంది అని అనిపించేలా చేసాడు. ఇక ఆ తర్వాత రోహిత్ తో గొడవ పెట్టుకోవడం , అతన్ని అనరాని మాటలు అంటూ , నాన్ స్టాప్ గా ట్రిగ్గర్ చేయడం వంటివి ఈయన పై ఇంకా నెగెటివిటీ పెంచేలా చేశాయి. కానీ టాస్కుల విషయం లో కూడా రోహిత్ కి ఇతను మాత్రమే పోటీ ఇవ్వగలడు, ఒక యాక్షన్ మూవీ థ్రిల్లర్ లో పవర్ ఫుల్ హీరో కి ధీటుగా పవర్ ఫుల్ విలన్ ఉంటే ఎలా ఉంటుందో , ఈ సీజన్ అలా ఉంది , రోహిత్ మరియు త్రిగున్ మధ్య ఫైట్స్ ని చూస్తుంటే మంచి కిక్ ని ఇస్తోంది, ఇలాగే సీజన్ మొత్తం సాగాలి అని ఆడియన్స్ కూడా అనుకునేలా చేసాడు త్రిగున్ .

ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ లో త్రిగున్ నిజ స్వరూపం మొత్తాన్ని బయటపెట్టారు రోహిత్ , సుధీర్. సెలబ్రిటీలందరినీ తన గుప్పిట్లో పెట్టుకొని గేమ్ ని ఆడించాలని చూసిన త్రిగున్ కి సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ట్విస్టులు ఇస్తూ త్రిగున్ కి దూరం అయ్యారు. ఇప్పుడు త్రిగున్ కి కేవలం రోహిత్ ఒక్కడే కాదు , వర్షిణి, సుధీర్, ముకేశ్ , దేబ్జాని వంటి కంటెస్టెంట్స్ కూడా నెగెటివ్ అయిపోయారు. ఇలా హౌస్ మొత్తం తన వైపు తిప్పుకునేలా చేయడం త్రిగున్ సక్సెస్ అవ్వడం తో , ఈ సీజన్ లో త్రిగున్ లేకపోతే పెద్ద డిజాస్టర్ గా నిలిచేది , త్రిగున్ లేని బిగ్ బాస్ 10 ని ఊహించలేం, ది కంటెంట్ కింగ్ అతను అంటూ సోషల్ మీడియా లో రివ్యూయర్స్ సైతం అతన్ని పొగడ్తలతో ముంచి ఎత్తడం మొదలు పెట్టారు.

ఇవన్నీ కలిసి రావడం వల్ల , త్రిగున్ కి ఓటింగ్ భారీగా పెరిగింది. మొన్నటి వరకు 7 వ స్థానం లో కొనసాగుతూ వచ్చిన త్రిగున్ , ఇప్పుడు ఏకంగా మూడవ స్థానానికి ఎగబాకాడు. ముకేశ్ తో సమానమైన ఓటింగ్ ని సంపాదించాడు. నేటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ రెండవ లెవెల్ లో రోహిత్ , త్రిగున్ కి మధ్య పోటీ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరగబోతుంది అట. ఈ ఎపిసోడ్ తో ఇద్దరి గ్రాఫ్ మరో లెవెల్ కి వెళ్లే అవకాశం ఉందని , త్రిగున్ ముకేశ్ ని దాటి రెండవ స్థానానికి చేరుకుంటాడని అంటున్నారు నెటిజెన్స్. అదే జరిగితే రోహిత్ స్థానానికి కూడా డేంజర్ బెల్స్ మోగినట్టే అనుకోవచ్చు.

ఎక్కడో 7 వ స్థానం లో ఉన్న వ్యక్తి 2 వ స్థానానికి ఎగబాకే రేంజ్ కి వచ్చాడు అంటే, రోహిత్ ఎంజాయ్ చేస్తున్న నెంబర్ 1 స్థానాన్ని అందుకోవడం ఎంతసేపు చెప్పండి?. ఇప్పటి వరకు రోహిత్ ఎలాంటి తప్పు చేయలేదు, ఆ కారణం చేత అతనికి ఓటింగ్ తగ్గడం లేదు. ఒకవేళ ఆయన షాలిని తో లవ్ ట్రాక్ పెట్టుకుంటే గేమ్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అదే జరిగితే త్రిగున్ నెంబర్ 1 స్థానానికి ఎగబాకడం పెద్ద కష్టమేమి కాదు. అయితే అందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఓటింగ్ లో వీళ్లిద్దరి మధ్య చాలా దూరం ఉంది. రోహిత్ కి 60 శాతానికి పైగా ఓటింగ్ పడుతుంటే, ముకేశ్ కి 23 శాతం, త్రిగున్ కి 12 శాతం ఓటింగ్ నమోదు అవుతోంది. రాబోయే రోజుల్లో రోహిత్ ఓటింగ్ కచ్చితంగా తగ్గొచ్చు.

ఎందుకంటే చరణ్ ఎలిమినేట్ అవ్వడం రోహిత్ కి బాగా కలిసొచ్చింది. వీళ్లిద్దరు మంచి స్నేహితులు కాబట్టి, చరణ్ ఎలిమినేషన్ తో ఆయన ఫ్యాన్ బేస్ ఓట్లు మొత్తం రోహిత్ కి పడ్డాయి. ఆ కారణం చేత , రోహిత్ తిరుగులేని ఆధిక్యంతో కొనసాగుతున్నాడు. నేడు చరణ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ వారం ‘పవర్ ఆఫ్ పీపుల్’ థీమ్ లో భాగంగా, బిగ్ బాస్ మొదటి వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో వైదొలగిన చరణ్ , చైత్ర లలో ఎవరిని మీరు బిగ్ బాస్ హౌస్ లో చూడాలని అనుకుంటున్నారో ఓటు వేయండి అంటూ ఆడియన్స్ చేతుల్లో వాళ్ళ భవిష్యత్తు ని పెట్టారు. కచ్చితంగా చరణ్ కి ఎక్కువ ఓటింగ్ పడుతుంది కాబట్టి, ఆయన ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఒకవేళ అదే జరిగితే రోహిత్ ఓటింగ్ కాస్త తగ్గే అవకాశం ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది. మీరేమి అనుకుంటున్నారు ?, రాబోయే రోజుల్లో త్రిగున్ ఓటింగ్ రోహిత్ ఓటింగ్ ని దాటేస్తుందని అనుకుంటున్నారా?, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper