Australia 12 Runs All Out: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 12 పరుగులకే ఆల్ అవుట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ఈ వార్త క్రికెట్ అభిమానులను షాక్ గురిచేస్తుంది. నిజంగా ఆస్ట్రేలియా టీం అంత చెత్తగా ఆడుతుందా.. కేవలం 12 పరుగులకు మాత్రమే కుప్పకూలుతుంది ఇది ఎలా సాధ్యం..
అంతర్జాతీయ క్రికెట్ రికార్డులను పరిశీలిస్తే ఆస్ట్రేలియా పురుషుల జట్టు 12 పరుగులకు ఆల్ అవుట్ అయిన దాఖలాలు ఇంతవరకు లేవు. టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా అత్యల్ప స్కోరు 36 పరుగులు. 1902 లో ఎడ్జ్ బస్టాన్ లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా ఈ స్కోర్ కు కుప్పకూలింది.
ఇక వన్డే క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యల్ప స్కోరు 70 పరుగులు. 1977లో ఇంగ్లాండ్ జట్టుపై.. 1986లో న్యూజిలాండ్ జట్టుపై ఆస్ట్రేలియా 70 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
టి20 అంతర్జాతీయ క్రికెట్ లోనూ ఆస్ట్రేలియా అత్యల్ప స్కోరు 62 పరుగులు. 2021లో బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా 62 పరుగులకు ఆలౌట్ అయింది…
మరి ఈ 12 పరుగుల కథ ఏంటి
సోషల్ మీడియాలో పోస్టులలో 12 పరుగుల అనే సంఖ్యను ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ స్కోర్ గా చూపిస్తూ కొన్ని వీడియోలు కనిపిస్తున్నాయి. కానీ అధికారికా రికార్డులలో అలాంటి స్కోరు కనిపించడం లేదు. అంతేకాకుండా 2026 లో ఆస్ట్రేలియా అంతర్జాతీయ మ్యాచులు ఆడుతోంది. ఉదాహరణకు జూన్ 20266 లో బంగ్లాదేశ్ టెస్ట్ తో జరిగిన టి20 లో ఆస్ట్రేలియా 133/6 పరుగులు చేసే విజయం సాధించింది..
ఇక అసలు రికార్డులను పరిశీలిస్తే
- టెస్టులలో 36 పరుగులు.. 1902 లో ఇంగ్లాండ్ జట్టుపై..
- వన్డేలలో 70 పరుగులు ఇంగ్లాండ్/ న్యూజిలాండ్ జట్టుపై..
- టి20లో 62 పరుగులు బంగ్లాదేశ్ జట్టుపై 2021లో..
- ఇవి ఆస్ట్రేలియా జట్టు మీద ఉన్న అత్యంత చెత్త రికార్డులు.
అయితే ఆస్ట్రేలియా 12 పరుగులకే ఆల్ అవుట్.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఘోర పతనం అనే ప్రచారానికి ఆధారం లేదు. దీనిని కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారం లేదా.. టెక్నాలజీ ఉపయోగించి చేస్తున్న ఫేక్ వీడియోలు అని చెప్పవచ్చు. వాస్తవానికి ఆస్ట్రేలియా జట్టులో ఉన్న బ్యాటర్లు.. బౌలర్లు. ప్రపంచ స్థాయి ప్లేయర్లు. ఇంతటి దిగ్గజ ప్లేయర్లు ఉన్నప్పటికీ కూడా ఆస్ట్రేలియా అంత తక్కువ స్కోరుకు ఆల్ అవుట్ అవుతుంది అంటే నమ్మశక్యమైన విషయం కాదు.
UNBELIEVABLE CRICKET SHOCK!
Australia have been bowled out for just 12 runs!
Yes, you read that right- 12 ALL OUT!
A collapse so extraordinary that it feels almost impossible to believe.Cricket has just witnessed one of those moments that will be remembered for a long, long time!
— Dr. Dileep Maurya (@drdileepjnu) October 6, 2026