Homeఅంతర్జాతీయంIran US Peace Deal: డిజిటల్ విధానంలో సంతకాలు.. ఇరాన్, అమెరికా మధ్య శాంతి నిజంగానే...

Iran US Peace Deal: డిజిటల్ విధానంలో సంతకాలు.. ఇరాన్, అమెరికా మధ్య శాంతి నిజంగానే వర్ధిల్లుతుందా..

Iran US Peace Deal: అమెరికాకు సంబంధం లేని యుద్ధం ఇది. అమెరికా వేలు పెట్టకుండా ఉండాల్సిన పరిణామం ఇదే. ఒకరోజు భాగవతానికి మూతి మీసాలు తీసుకున్నట్టు.. ఇజ్రాయిల్ దేశంతో ఉన్న అనుబంధాన్ని మనసులో పెట్టుకొని యుద్ధంలోకి దిగింది అమెరికా. చివరికి నష్టాన్ని మూటకట్టుకొని.. మోయలేని భారంతో తలవంచుకుంది. అగ్రరాజ్యం కాబట్టి ప్రపంచం ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. కానీ తెరవెనుక జరిగింది అందరికీ తెలుసు. ఇరాన్ మహా మొండిగా యుద్ధాన్ని కొనసాగించింది. నష్టపోయినప్పటికీ వెన్ను చూపించలేదు. […]

Iran US Peace Deal: అమెరికాకు సంబంధం లేని యుద్ధం ఇది. అమెరికా వేలు పెట్టకుండా ఉండాల్సిన పరిణామం ఇదే. ఒకరోజు భాగవతానికి మూతి మీసాలు తీసుకున్నట్టు.. ఇజ్రాయిల్ దేశంతో ఉన్న అనుబంధాన్ని మనసులో పెట్టుకొని యుద్ధంలోకి దిగింది అమెరికా. చివరికి నష్టాన్ని మూటకట్టుకొని.. మోయలేని భారంతో తలవంచుకుంది. అగ్రరాజ్యం కాబట్టి ప్రపంచం ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. కానీ తెరవెనుక జరిగింది అందరికీ తెలుసు.

ఇరాన్ మహా మొండిగా యుద్ధాన్ని కొనసాగించింది. నష్టపోయినప్పటికీ వెన్ను చూపించలేదు. ప్రపంచ దేశాలు సపోర్ట్ చేయకపోయినప్పటికీ.. తనకు తానుగా స్వీయ శక్తితో యుద్ధాన్ని కొనసాగించింది. అమెరికాకు కొరకరాని కొయ్యలాగా మారిపోయింది.. దీంతో అమెరికా మధ్య మార్గంలో భాగంగా పాకిస్తాన్ దేశాన్ని రంగంలోకి దించింది. శాంతి చర్చలు అంటూ ప్రవచనాలు వల్లించింది. చివరికి ఇరాన్ అయిష్టంగానే పీస్ డీల్ కు ఒప్పుకుంది.

ఇప్పటికే హార్మోజ్ తెరుచుకుంది. G7 సమ్మిట్ లో కూడా ట్రంప్ ఇదే విషయాన్ని చెప్పారు. మొత్తానికి రెండు దేశాల మధ్య ఇంతటి రక్తపాతం జరిగిన తర్వాత శాంతి కుదిరింది. ఈ శాంతి అవగాహన ఒప్పందంపై ఇరాన్, అమెరికా దేశాలు సంతకాలు చేశాయి. అయితే పూర్తి డిజిటల్ విధానంలోనే ఈ ప్రక్రియ పూర్తయింది. అదే కాదు యుద్ధం ముగిసినట్టు ఆ రెండు దేశాలు ప్రకటించాయి.. ఇరాన్ అంతర్గత వ్యవహారాలలో ఇకపై అమెరికా జోక్యం చేసుకోదు. 60 రోజుల్లో శాంతి ఒప్పందంపై తుది నిర్ణయం జరుగుతుంది. ఎటువంటి చార్జీలు లేకుండానే హర్మజ్ నుంచి సరుకు రవాణా జరుగుతుంది. మిల్ట్రీ ఆపరేషన్లు మొత్తం అమెరికా నిలిపివేయాల్సి ఉంటుంది. అయితే లెబనాన్ విషయంలో మాత్రం అమెరికా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. బహుశా అక్కడ మిలిటరీ ఆపరేషన్లు కొనసాగించే అవకాశం ఉంది.

డిజిటల్ విధానంలో సంతకాలు పూర్తి అయిన నేపథ్యంలో శాంతి వెల్లి విరుస్తుందా.. లేక కథ మళ్ళీ మొదటి వస్తుందా.. అనే అనుమానాలు అంతర్జాతీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్ల భారీగా నష్టం జరిగిన నేపథ్యంలో ఇరాన్ పునర్నిర్మాణానికి చాలా సమయం పడుతుంది. సుప్రీమ్ లీడర్లను ఇరాన్ కోల్పోయింది. సైన్యాన్ని కూడా నష్టపోయింది. భారీగా నష్టాన్ని చవి చూసింది. గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మళ్లీ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper