Trump Modi Relations: ‘భారత ప్రధాని నరేంద్రమోదీ నాకు మంచి మిత్రుడు. భారత్ అమెరికాకు మంచి మిత్ర దేశం.. రెండు దేశాల మధ్య వాణిజ్యం, వ్యాపారంతోపాటు సైనిక సహకారం బాగుంది’ ఇదీ మొన్నటి వరకు ట్రంప్ పలికిన చిలుక పలుకులు. కానీ, ఇప్పుడు భారత్ అన్నా.. మోదీ అన్నా ట్రంప్ నిప్పులు చెరుగుతున్నారు. ఉరిమి చూస్తున్నారు. భారత్‌తో దోస్తీ కటీఫ్ చేసి.. పాకిస్తాన్‌తో మిత్రుత్వం పెంచుకుంటున్నారు. ఇక ప్రతీకార సుంకాలు భారీగా విధించారు. దీంతో భారత్, పాక్ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఈనేపథ్యంలో అసలు ట్రంప్‌కు కోపం ఎందుకు అన్న చర్చ జరుగుతోంది.
Also Read: భారత్ నిజంగా ‘డెడ్ ఎకానమీ’నా?
భారత్, అమెరికా మధ్య సంబంధాలు చారిత్రకంగా సమతుల్యంగా సాగుతున్నప్పటికీ, ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా, భారత్‌పై కోపంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భారత్ ఆర్థిక వృద్ధి, విదేశాంగ విధానం, వాణిజ్య ఒప్పందాలపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలు ఈ ఉద్రిక్తతకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
డెయిరీ ఉత్పత్తుల నిరాకరణ..
అమెరికా డెయిరీ ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేయడానికి నిరాకరించడం ట్రంప్ కోపానికి ఒక ముఖ్య కారణం. చైనా అమెరికా డెయిరీ ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవడంతో, భారత్‌ను కొత్త మార్కెట్‌గా చూసిన అమెరికా, ఈ విషయంలో నిరాశకు గురైంది. అమెరికాలో పశువులకు మాంసాహార ఆహారం ఇవ్వడం వల్ల ఉత్పత్తి అయ్యే పాల ఉత్పత్తులు భారత సాంస్కృతిక, ఆహార ఆచారాలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రధాని మోదీ ఈ ఒప్పందాన్ని తిరస్కరించారు. ట్రంప్ దీనిని అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు అడ్డంకిగా భావించారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు..
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం అమెరికాకు మరో కీలక సమస్యగా మారింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్న దేశంగా భారత్‌ను అమెరికా దృష్టిలో ఉంచింది. ఈ యుద్ధం ఆగితే ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాలను స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆలోచనకు భారత్ అడ్డంకిగా కనిపిస్తోంది. భారత్ యొక్క ఈ విదేశాంగ విధానం, తన శక్తి అవసరాలను స్వతంత్రంగా నిర్వహించుకునే ప్రయత్నంగా ఉన్నప్పటికీ, అమెరికా దీనిని తమ భౌగోళిక రాజకీయ లక్ష్యాలకు వ్యతిరేకంగా భావిస్తోంది.
ఆపరేషన్ సిందూర్‌తో అమెరికా గుట్టు రట్టు..
పాకిస్తాన్‌లోని అణ్వాయుధాలపై అమెరికా పెట్టిన నియంత్రణ ఆపరేషన్ సిందూర్ ద్వారా బహిర్గతమవడం అమెరికాకు, ముఖ్యంగా ట్రంప్‌కు తీవ్ర ఆఘాతం కలిగించింది. ఈ ఆపరేషన్ ద్వారా అమెరికా రహస్య ఎజెండా బయటపడడంతో, భారత్ దాని విదేశాంగ విధానంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ సంఘటన భారత్–పాకిస్తాన్ సంబంధాల్లో అమెరికా పాత్రను ప్రశ్నార్థకం చేసింది, ఫలితంగా ట్రంప్ భారత్‌పై కోపాన్ని మరింత పెంచింది.
ట్రంప్‌ను చీపురు పల్లలా తీసేసిన మోదీ..
భారత్–పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపివేయడంలో తామే కీలక పాత్ర పోషించామని ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నారు. భారత్ ప్రధాని మోదీ ఈ విషయంలో మూడో దేశం జోక్యం లేదని పార్లమెంటులో స్పష్టం చేశారు. ఈ ప్రకటన ట్రంప్ వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసింది. భారత్ ఈ స్వతంత్ర ధోరణి, అమెరికా ఆధిపత్య ఆలోచనలకు వ్యతిరేకంగా ఉండటం ట్రంప్ కోపానికి మరో కారణంగా మారింది.
వాణిజ్య ఒప్పందం విషయంలో..
అమెరికా వాణిజ్య ఒప్పందాల్లో తన షరతులను రుద్దేందుకు ప్రయత్నించినప్పటికీ, భారత్ తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడంలో దృఢంగా ఉంది. ఈ నేపథ్యంలో, ట్రంప్ భారత ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధించారు. అయితే, భారత్ ఈ ఆంక్షలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, పరస్పర ప్రయోజనాల ఆధారంగా మాత్రమే ఒప్పందాలకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ ధోరణి ట్రంప్‌కు మరింత కోపం తెప్పించింది.
Also Read: మోడీ ఒక్క అడుగు.. పాకిస్తాన్ లో వణుకు
భారత ఆర్థిక ప్రగతి..
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుండటం అమెరికాకు ఒక సవాలుగా మారింది. భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి, స్వతంత్ర విదేశాంగ విధానం, ఆంక్షలను ఎదుర్కొనే సామర్థ్యం ట్రంప్‌కు ఆందోళన కలిగిస్తోంది. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఫోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో అమెరికా ఆంక్షలను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లే, ప్రస్తుతం కూడా భారత్ ఈ ఆంక్షలను బలంగా ఎదుర్కొంటోంది.