Homeజాతీయ వార్తలుKhan Sir Arrest: కోట్ల మందికి ఆదర్శనీయుడు.. ఈగో పెరిగి జైలు పాలయ్యాడు.. మామూలు స్టోరీ...

Khan Sir Arrest: కోట్ల మందికి ఆదర్శనీయుడు.. ఈగో పెరిగి జైలు పాలయ్యాడు.. మామూలు స్టోరీ కాదు ఇది

Khan Sir Arrest: ఆయన పాఠం చెబితే మామూలుగా ఉండదు. విశ్లేషణ చేస్తే అంచనాలకు అందదు. బిజెపిని తిడతారు. కాంగ్రెస్ పార్టీని ఏకిపారేస్తారు. ప్రజలకు మంచి చేయని ఏ నాయకుడిని కూడా వదిలిపెట్టకుండా తిట్టేస్తుంటారు. ఆయన అనర్గళంగా పాఠాలు చెబుతూనే ఉంటారు. వందల మంది విద్యార్థులను సైతం ఒక్కడే పర్యవేక్షిస్తారు. విద్యార్థులలో ఏదైనా మార్పు కనిపిస్తే మొహమాటం లేకుండా బయటికి పంపిస్తారు. నిర్లక్ష్యానికి మించిన దరిద్రం లేదని.. వినే ఓపిక లేనప్పుడు సాధించే సత్తా ఉండదని ఆయన […]

Khan Sir Arrest: ఆయన పాఠం చెబితే మామూలుగా ఉండదు. విశ్లేషణ చేస్తే అంచనాలకు అందదు. బిజెపిని తిడతారు. కాంగ్రెస్ పార్టీని ఏకిపారేస్తారు. ప్రజలకు మంచి చేయని ఏ నాయకుడిని కూడా వదిలిపెట్టకుండా తిట్టేస్తుంటారు. ఆయన అనర్గళంగా పాఠాలు చెబుతూనే ఉంటారు. వందల మంది విద్యార్థులను సైతం ఒక్కడే పర్యవేక్షిస్తారు. విద్యార్థులలో ఏదైనా మార్పు కనిపిస్తే మొహమాటం లేకుండా బయటికి పంపిస్తారు. నిర్లక్ష్యానికి మించిన దరిద్రం లేదని.. వినే ఓపిక లేనప్పుడు సాధించే సత్తా ఉండదని ఆయన అంటుంటారు. ఆయన మరెవరో కాదు ఖాన్ సార్..

బీహార్ రాష్ట్రంలో ఖాన్ పేరు తెలియని వారు ఉండరు. యూట్యూబ్ చూసేవారికి కూడా ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు తక్కువ ఫీజులో ఆయన శిక్షణ ఇస్తూ ఉంటారు. వర్తమాన అంశాల నుంచి మొదలు పెడితే ఆర్థిక శాస్త్రం వరకు ఇలా అన్నింటి మీద ఆయనకు విపరీతమైన పట్టు ఉంటుంది. బీహార్ రాష్ట్రంలో ఖాన్ సార్ అకాడమీలో చేరడానికి విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఆయన గురించి జాతీయ.. అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అయితే ఇంతటి విద్వత్తు ఉన్న ఆయన.. ఈగో వల్ల దారి తప్పారు. సప్త సముద్రాలు దాటి.. మురికిగుంటలో పడ్డట్టు.. ఇప్పుడు జైలు గోడల మధ్య ఉండిపోయారు.

బీహార్ లో ఖాన్ సార్ కు పోటీగా రోషన్ ఆనంద్ అనే విద్యావంతుడు అకాడమీ పెట్టాడు. ఖాన్ కంటే తక్కువ ధరకు కోచింగ్ ఇస్తానంటూ ముందుకు వచ్చాడు. దీంతో ఈ రెండు అకాడమీ లలో పనిచేసేవారు పోటాపోటీగా పోస్టర్లు వేశారు. అంతేకాదు ఒకరి పోస్టర్లను మరొకరు చించేశారు. దీంతో ఇద్దరి మధ్య ఈగో పెరిగిపోయింది.. ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని స్థాయికి అది దిగజారింది. ఈ నేపథ్యంలో రోషన్ ఆనంద్ తన కార్యాలయం మీదికి వచ్చి దాడి చేశారని ఖాన్ సార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎటువంటి ఆధారాలు సేకరించకుండానే ఖాన్ సార్ మీద ఉన్న నమ్మకంతో రోషన్ ఆనంద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం బీహార్ రాష్ట్రంలో కలకలం సృష్టించడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.

పోలీసుల దర్యాప్తులో ఖాన్ సార్ అనుచరులు కాల్పులు జరిపినట్లు తేలింది. దీంతో వాళ్లు ఖాన్ సార్ ను అదుపులోకి తీసుకున్నారు.ఖాన్ సార్ కు యూట్యూబ్లో కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన పాఠాలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయినప్పటికీ కేవలం ఈగో వల్ల.. ఖాన్ సార్ తన స్థాయిని కోల్పోయారు. చివరికి జైలు గోడల మధ్య ఉండిపోయారు. అందుకే అంటారు ఎంత చదివినా సరే.. ఎంత విజ్ఞానం ఉన్నా సరే.. మనిషి వివేచన కోల్పోకూడదు అని.. అది కోల్పోయి ఖాన్ సార్ చివరికి ఇలా మారిపోయారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper