Homeజాతీయ వార్తలుGandhi Ambedkar Politics: ప్రచారానికి గాంధీ, అంబేద్కర్.. గెలిచాక.. టిప్పు సుల్తాన్, రజకార్లు.. థూ మీ...

Gandhi Ambedkar Politics: ప్రచారానికి గాంధీ, అంబేద్కర్.. గెలిచాక.. టిప్పు సుల్తాన్, రజకార్లు.. థూ మీ రాజకీయం తగలబడ..

Gandhi Ambedkar Politics: ఇటీవల కాలంలో కొంతమంది కుహనా మేధావులు.. కుహనా రాజకీయ నాయకులకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్.. జాతిపిత మహాత్మా గాంధీ మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొస్తున్నది. అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేయడం.. జయంతి.. వర్ధంతిల సమయంలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేయడం.. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడం.. వంటివి చేస్తున్నారు. ఇంకా కొందరైతే మహాత్మా గాంధీ జయంతి.. వర్ధంతి రోజు సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వారి మీద జనాలకు సహజంగానే ప్రేమ కలగడం ఖాయం. ఎందుకంటే మనదేశంలో అంబేద్కర్.. గాంధీ మహాత్ముడిని ప్రేమించని వారు ఉండరు.

మహనీయులను తలచుకోవడం.. వారి సేవలను గుర్తుంచుకోవటం.. వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం గొప్ప కార్యక్రమం. కానీ ఇది ప్రేమతో చేస్తున్నది కాదు. గౌరవంతో చేస్తున్నది అంతకంటే కాదు. కేవలం రాజకీయ ప్రాపకం కోసం కొంతమంది ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారు.. అంతేకాదు ఎన్నికల్లో ప్రచారానికి మహనీయుల ఫోటోలను వాడుకుంటున్నవారు.. ఆ తర్వాత దేశ వ్యతిరేక శక్తులను తలచుకుంటున్నారు. వారి ఫోటోలను ఏకంగా అధికారిక కార్యాలయాలలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటువంటి సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలో మాలేగాన్ డిప్యూటీ మేయర్ షాన్ ఏ హింద్ ఇటీవల తన అధికారిక కార్యాలయంలో టిప్పు సుల్తాన్ ఫోటో పెట్టుకుంది. ఇది మీడియాలో పడి సంచలనంగా మారింది. దీనిపై మీడియా ప్రతినిధులు ఆమె వివరణ కోరడానికి ప్రయత్నించారు. “నా కార్యాలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అందువల్లే టిప్పు సుల్తాన్ ఫోటో గోడకు మీకు కనిపించి ఉన్నట్టుంది. దాన్ని నాకు కొంతమంది తెలిసినవాళ్లు బహుమతిగా ఇచ్చారు” అని చెప్పింది..”కేవలం టిప్పు సుల్తాన్ ఫోటో మాత్రమే గోడకు ఉంది.. అంబేద్కర్.. మహాత్మా గాంధీ ఫోటోలు ఎక్కడ అని'” మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే..”టిప్పు సుల్తాన్ ఫోటో మాత్రమే మా వాళ్ళు గోడకు ఉంచారు.. మిగతా ఫోటోలు పక్కన పెట్టారు.. పునరుద్ధరణ పనులు పూర్తికాగానే ఏర్పాటు చేస్తామని” ఆమె బదులిచ్చింది.

కానీ ఆ డిప్యూటీ మేయర్ కు ఎన్నికలలో ప్రచారం వరకే మహాత్మా గాంధీ కావాలి. అంబేద్కర్ కావాలి. ఎన్నికల్లో గెలిచింది కాబట్టి తన స్వభావాన్ని ఆమె ప్రదర్శిస్తుంది. టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడటా.. మైసూర్ షేర్ అట.. ఇదే మాట డిప్యూటీ మేయర్ అంటుంటే.. అక్కడి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆ డిప్యూటీ మీద ఉండేది మహారాష్ట్ర కాబట్టి.. మరాఠా యూదుడు శివాజీ.. లేదా ఇంకా ఇతర దేశభక్తుల ఫోటోలు పెట్టుకోవాలి. కానీ టిప్పు సుల్తాన్ ఫోటో పెట్టుకోవడం నిజంగా ఆశ్చర్యకరం.

ఈమె మాత్రమే కాదు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ ఫార్మేషన్ డే జరుపుకుంటున్నప్పుడు దానికి రివైవల్ డే అని పేరు పెడుతుంది. అంతేకాదు ఆ దినోత్సవం సందర్భంగా రజాకార్లను స్మరించుకుంటూ ఉంటుంది. వాస్తవానికి ఎంఐఎం పార్టీ వ్యవస్థాపక దినం జరుపుతున్నప్పుడు ఆ పార్టీ ఏర్పాటుచేసిన వ్యక్తి ఫోటో పెట్టుకోవాలి. ఆయన గురించి స్మరించుకోవాలి. అంతేగాని రజాకార్లను స్మరించుకోవడం ఏంటో.. ఎంఐఎం నేతలకే తెలియాలి. అన్నట్టు ఈ తరహా నాయకులను ఎంకరేజ్ చేస్తున్న మిగతావాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular