Homeఅంతర్జాతీయంIran Drone Attacks On UAE: యూఏఈపై ఇరాన్‌ భీకర దాడులు.. టార్గెట్‌ అదేనా?

Iran Drone Attacks On UAE: యూఏఈపై ఇరాన్‌ భీకర దాడులు.. టార్గెట్‌ అదేనా?

Iran Drone Attacks On UAE: పశ్చిమాసియాలో యుద్ధం మొదలు పెట్టిన అమెరికా ఇజ్రాయెల్‌ సహాయంతో ఇరాన్‌పై భీకర దాడులు చేస్తోంది. అయితే వారం పది రోజుల్లో ఇరాన్‌ పని ముగిస్తామనుకున్న అమెరికాకు ఇరాన్‌ షాక్‌ ఇస్తోంది. యుద్ధం మొదలై 22 రోజులైనా ఎక్కడా తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా గల్ఫ్‌ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇరాన్‌ తక్కువ ఖర్చుతో తయారు చేసిన […]

Iran Drone Attacks On UAE: పశ్చిమాసియాలో యుద్ధం మొదలు పెట్టిన అమెరికా ఇజ్రాయెల్‌ సహాయంతో ఇరాన్‌పై భీకర దాడులు చేస్తోంది. అయితే వారం పది రోజుల్లో ఇరాన్‌ పని ముగిస్తామనుకున్న అమెరికాకు ఇరాన్‌ షాక్‌ ఇస్తోంది. యుద్ధం మొదలై 22 రోజులైనా ఎక్కడా తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా గల్ఫ్‌ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇరాన్‌ తక్కువ ఖర్చుతో తయారు చేసిన డ్రోన్లతో జరుపుతున్న దాడులతో అమెరికా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. రెండు రోజుల క్రితం అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్‌–35ని కూడా ఇరాన్‌ కూల్చింది. మరోవైపు గల్ఫ్‌ దేశాల్లోని ఆయిల్, ఎల్‌పీజీ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ దాడులు చేస్తోంది.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

అమెరికా ఆర్థిక వ్యవస్థ టార్గెట్‌గా..
ఇరాన్‌ తాజాగా యూఏఈపై డ్రోన్‌ దాడులు తీవ్రం చేసింది. దుబాయ్‌ విమానాశ్రయాలు, ఆకర్షణల స్థలాలు లక్ష్యాలుగా మారడంతో ప్రపంచ పెట్టుబడుల హబ్‌ స్థిరత్వం కుప్పకూలుతోంది. ట్రంప్‌ ప్రభుత్వానికి యూఏఈ నుంచి వచ్చిన భారీ పెట్టుబడులను దెబ్బతీసే ఇరాన్‌ వ్యూహం విజయవంతమవుతోంది.

తాజాగా భీకర దాడులు
అబుదాబి జాయెద్‌ విమానాశ్రయం, దుబాయ్‌ పామ్‌ జుమేరా ప్రాంతాలపై 137 బాలిస్టిక్‌ క్షిపణులు, 209 డ్రోన్లు ప్రయోగించిన ఇరాన్‌ భారీ నష్టం కలిగించింది. డ్రోన్‌ శకలాలు తగిలి ఒకరు మృతిచెందారు. 11 మంది గాయపడ్డారు. విమాన రాకపోకలు నిలిచి 20 వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దుబాయ్‌ ఎయిర్‌పోర్టు తాత్కాలిక మూసివేశారు.

అమెరికాలో యూఏఈ భారీగా పట్టుబడులు..
2025లో ట్రంప్‌ ప్రభుత్వానికి 5.2 ట్రిలియన్‌ పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 27% యూఏఈ నుంచే వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఇరాన్‌ దాడులు దుబాయ్‌ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను పరోక్షంగా లక్ష్యం చేస్తోంది. భారత్‌కు చెందిన 800 కంపెనీలు కూడా అమెరికాలో 1.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.

ఫలిస్తున్న ఇరాన్‌ వ్యూహం..
అమెరికా సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ ‘మా శత్రువులకు ఆశ్రయం ఇస్తే మూల్యం చెల్లించాలి‘ అనే సందేశం ఇస్తోంది. 2019 సౌదీ ఆయిల్‌ దాడుల మోడల్‌ను విస్తరించి గల్ఫ్‌ దేశాల్లోకి తీసుకువచ్చింది. తక్కువ ఖర్చుతో భారీ ఆర్థిక నష్టం కలిగించే డ్రోన్‌ యుద్ధం విజయవంతమవుతోంది. ఇక యూఏఈ, దుబాయ్‌లో భారత్‌ కూడా పెట్టుబడులు పెట్టింది. తాజా ఇరాన్‌ దాడులతో భారత్‌ పెట్టుబడులు ప్రమాదంలో పడ్డాయి.

యూఏఈ ‘దుబాయ్‌ సురక్షితం‘ అని ప్రచారం చేస్తూ పెట్టుబడిదారుల నమ్మకాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ ఇరాన్‌ దాడులు కొనసాగితే గల్ఫ్‌ ఆర్థిక కేంద్రాలు మూతపడే ప్రమాదం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper