Homeఅంతర్జాతీయంUkraine Supports US In Iran War: ఇరాన్‌ యుద్ధంలోకి ఉక్రెయిన్‌.. సంక్షోభంలోనూ సహాయం!

Ukraine Supports US In Iran War: ఇరాన్‌ యుద్ధంలోకి ఉక్రెయిన్‌.. సంక్షోభంలోనూ సహాయం!

Ukraine Supports US In Iran War: ఉక్రెయిన్‌.. నాలుగేళ్లుగా రష్యాతో యుద్ధం చేస్తోంది. రష్యా దాడిలో తీవ్రంగా నష్టపోయింది. అయితే అమెరికా సహాయంతో రష్యా దాడులను ఉక్రెయిన్‌ సమర్థవంతంగానే ఎదుర్కొంది. అయితే అమెరికా 22 రోజుల క్రితం ఇరాన్‌తో యుద్ధం మొదలు పెట్టింది. దీంతో ఉక్రెయిన్‌ను పట్టించుకునేవారు కరువయ్యారు. మరోవైపు ఇరాన్‌ యుద్ధంతో చమురు సంక్షోభం నెలకొంది. దీంతో రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు ఎత్తేసింది. దీంతో రష్యా ఆర్థికంగా బలపడుతోంది. ఈ తరుణంలో […]

Ukraine Supports US In Iran War: ఉక్రెయిన్‌.. నాలుగేళ్లుగా రష్యాతో యుద్ధం చేస్తోంది. రష్యా దాడిలో తీవ్రంగా నష్టపోయింది. అయితే అమెరికా సహాయంతో రష్యా దాడులను ఉక్రెయిన్‌ సమర్థవంతంగానే ఎదుర్కొంది. అయితే అమెరికా 22 రోజుల క్రితం ఇరాన్‌తో యుద్ధం మొదలు పెట్టింది. దీంతో ఉక్రెయిన్‌ను పట్టించుకునేవారు కరువయ్యారు. మరోవైపు ఇరాన్‌ యుద్ధంతో చమురు సంక్షోభం నెలకొంది. దీంతో రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు ఎత్తేసింది. దీంతో రష్యా ఆర్థికంగా బలపడుతోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌పై ఏ క్షణంలో అయినా దాడి చేసే ప్రమాదం ఉంది. దీనిని గమనించిన ఉక్రెయిన్‌ సంక్షోభంలోనూ అమెరికాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

అమెరికాకు యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ..
అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం. వారం పది రోజుల్లో ఇరాన్‌ యుద్ధం ముగుస్తుందని భావించింది. కానీ ఇరాన్‌ అమెరికా, ఇజ్రాయెల్‌ను దీటుగా ఎదుర్కొంటోంది. తక్కువ ఖర్చుతో తయారు చేసి షాహిద్‌ డ్రోన్లతో ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఆయిల్‌ రిఫైనరీలపై దాడులు చేస్తోంది. వీటిని ఎదుర్కొనడానికి అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ తరుణంలో రష్యా డ్రోన్‌ దాడనికి తక్కువ ఖర్చుతో ఎదుర్కొన్న ఉక్రెయిన్‌ ఇప్పుడు యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అమెరికాకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. రోజుకు 200 యాంట్రీ డ్రోన్లను అందిస్తామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. తద్వారా రష్యా దాడి సమయంలో తమకు అమెరికా అండగా ఉంటుందని భావిస్తోంది.

ఇరాన్‌ యుద్ధ ప్రభావాలు
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులతో చమురు ధరలు పెరుగుతున్నాయి. అమెరికా రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు తొలగించింది, రష్యాకు భారీ ఆదాయం వస్తోంది. ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సహాయం, ఆయుధాలు పశ్చిమాసియాకు తరలిస్తుండటంతో కీవ్‌ రక్షణ బలహీనపడింది. రష్యా–ఇరాన్‌ సంబంధాలు ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి.

ఉక్రెయిన్‌ డ్రోన్‌ సహాయం
షాహిద్‌ డ్రోన్లతో ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలు, అమెరికాకు తక్కువ ఖర్చుతో నష్టం కలిగిస్తోంది. దీనికి ప్రతిఘటనగా ఉక్రెయిన్‌ రోజుకు 200 డ్రోన్లు అమెరికాకు సరఫరా చేస్తామని జెలెన్‌స్కీ ప్రకటించారు. రష్యా ఇచ్చిన షాహిద్‌ డ్రోన్లను ఎదుర్కొన్న అనుభవంతో తయారు చేసిన ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్లు అమెరికాకు ఆకర్షణీయమవుతున్నాయి. అవసరమైతే సైన్యం కూడా పంపుతామని హెచ్చరించారు.

రష్యా బలోపేతం
చమురు ఆదాయంతో రష్యా సైనిక శక్తి పెంచుకుంటోంది. ఇరాన్‌కు మద్దతుగా ఉండటం, యురేనియం సరఫరా అవకాశాలు కల్పిస్తోంది. ఉక్రెయిన్‌ శాంతి చర్చలు నిలిచిపోవడం రష్యాకు అనుకూలం. అరబ్‌ దేశాలతో ఇరాన్‌ సంబంధాలు ఉక్రెయిన్‌కు అడ్డంకిగా మారాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper