Homeటాప్ స్టోరీస్Telangana Assembly Revanth Reddy Speech: అసెంబ్లీలో 'గులాబీ' ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.....

Telangana Assembly Revanth Reddy Speech: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

Telangana Assembly Revanth Reddy Speech: ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో సీన్ చూస్తుంటే.. “మెయిన్ హీరో రానిదే క్లైమాక్స్ మొదలవ్వదు” అన్నట్లుగా ఉంది. కానీ ఇక్కడ క్లైమాక్స్ ఆల్రెడీ నడుస్తోంది.. కాకపోతే హీరో మాత్రం ‘ఫామ్ హౌస్’కే పరిమితమయ్యారు. అవును.. గులాబీ బాస్ కేసీఆర్ గైర్హాజరీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని “నిట్టూర్పుల నిలయం”గా మార్చేసింది. Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు? వ్యూహం అదిరింది.. కానీ రివర్స్ అయింది! […]

Telangana Assembly Revanth Reddy Speech: ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో సీన్ చూస్తుంటే.. “మెయిన్ హీరో రానిదే క్లైమాక్స్ మొదలవ్వదు” అన్నట్లుగా ఉంది. కానీ ఇక్కడ క్లైమాక్స్ ఆల్రెడీ నడుస్తోంది.. కాకపోతే హీరో మాత్రం ‘ఫామ్ హౌస్’కే పరిమితమయ్యారు. అవును.. గులాబీ బాస్ కేసీఆర్ గైర్హాజరీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని “నిట్టూర్పుల నిలయం”గా మార్చేసింది.

Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు?

వ్యూహం అదిరింది.. కానీ రివర్స్ అయింది!

సభలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డిని కార్నర్ చేద్దామని గట్టిగానే ప్లాన్ వేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం “మీరు పాత ఫైళ్లు తీస్తే.. నేను పాత కాలపు డైలాగులు తీస్తా” అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. కేటీఆర్ ఒక ప్రశ్న వేస్తే, రేవంత్ రెడ్డి పది పాత వైఫల్యాలను బయటకు తీసి “ఇదేనా మీ పదేళ్ల పాలన?” అంటూ గూగ్లీలు వేస్తున్నారు. దీంతో బ్యాటింగ్ చేయాల్సిన కేటీఆర్ అండ్ టీమ్, డిఫెన్స్‌కే పరిమితమవ్వాల్సి వస్తోంది.

‘కోటి’ రూపాల ప్రశ్న.. రేవంత్ మార్క్ పంచ్‌లు!

కేసీఆర్ కు అసెంబ్లీకి రాకున్నా ఇస్తున్న జీతం కోటి.. రాక మాత్రం అంటిముట్టనట్టు” అంటూ రేవంత్ రెడ్డి సంధిస్తున్న బాణాలు గులాబీ క్యాడర్‌కు గుచ్చుకుంటున్నాయి. “ప్రజాధనం తీసుకుంటూ.. ప్రజల గొంతుక వినిపించరా?” అంటూ రేవంత్ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గులాబీ తమ్ముళ్లు నీళ్లు నములుతున్నారు. కేసీఆర్ ఉండి ఉంటే తనదైన శైలిలో ‘ఏం తమ్మి.. ఏం మాట్లాడుతున్నావ్?’ అని కౌంటర్ ఇచ్చేవారేమో కానీ, ఇప్పుడు ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

కేటీఆర్ ‘చలో’.. రేవంత్ ‘రివర్స్’ చలో!

కేటీఆర్ అస్త్రంగా ఆరు గ్యారెంటీలు ఏవి? నిరుద్యోగ భృతి ఏమైంది? అంటుంటే.. రేవంత్ మీ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలు ఏవి? ఆ ప్రాజెక్టుల అంచనాలు ఏమయ్యాయి? అంటూ నిలదీస్తున్నారు. చర్చ ప్రజా సమస్యల మీద జరగాల్సింది పోయి, “నువ్వు ఎక్కువ తిన్నావా.. నేను ఎక్కువ తిన్నానా?” అన్న చందంగా పాత రికార్డుల దుమ్ము దులిపే కార్యక్రమంగా మారిపోయింది. కేసీఆర్ మార్క్ వ్యూహచతురత లేకపోవడంతో రేవంత్ దూకుడు ముందు కేటీఆర్ వ్యూహాలు “తేలిపోయిన అప్పడాల్లా” మారుతున్నాయని విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు.

బాస్ వస్తేనే ‘బ్రేక్’ పడేది!

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏకపక్షంగా సాగిస్తున్న ఈ ‘వన్ సైడ్ వార్’ ఆపాలంటే, గజ్వేల్ సింహం గర్జించాల్సిందే అని పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “సార్.. మీరు రండి సార్.. లేకపోతే రేవంత్ అన్న మాకు చుక్కలు చూపిస్తున్నాడు” అని లోలోపల మదనపడుతున్నారు.

మొత్తానికి కేసీఆర్ రాకపోయేసరికి అసెంబ్లీలో బీఆర్ఎస్ పరిస్థితి “కెప్టెన్ లేని టీమ్ ఇండియా”లా తయారైంది. మరి కేసీఆర్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు? రేవంత్ స్పీడ్‌కు ఎప్పుడు బ్రేక్ వేస్తారు? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న!

 

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper