India Pakistan Diplomatic Row: ఆపరేషన్ సిందూర్ దెబ్బతో కోలుకోలని పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రపంచ కోర్టును సిందూ జలాల విషయంలో ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితిలో భారత్‌పై తరచూప్రేలాపణలు చేస్తోంది. తాజాగా పాక్ తీసుకున్న చర్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ వద్ద పాకిస్తాన్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద భారత్ కూడా అలాంటి చర్యలే చేపట్టింది. ఇది రెండు దేశాల మధ్య నిరంతర ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది.
ఇస్లామాబాద్‌లోని పరిణామాలు..
ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్ బయట ఉన్న పార్కింగ్ పోల్స్, బ్యారికేడ్లను పాకిస్తాన్ తొలగించింది. భారత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పాక్ వెనక్కి తగ్గలేదు. ఈ చర్య దౌత్య నిబంధనలకు విరుద్ధమని భారత్ పక్షం వాదించింది. మూడు రోజుల తర్వాత భారత్ సమానమైన చర్యకు పూనుకోవడం గమనార్హం.
న్యూఢిల్లీలో అవే చర్యలు..
భారత్ కూడా అలాంటి చర్యలే చేపట్టింది. న్యూఢిల్లీలో పాక్ హైకమిషన్ సమీపంలో, ముఖ్యంగా వీసా కార్యాలయం బయట ఉన్న కొన్ని నిర్మాణాలు, క్యూల కోసం ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను భారత అధికారులు తొలగించారు. ఈ నిర్మాణాలకు అనుమతి లేదని అధికారికంగా వెల్లడించారు. రెండు వైపులా ఇలాంటి చర్యలు పరస్పర ప్రతీకార స్వభావం కలిగి ఉన్నాయి.
దౌత్య ఉద్రిక్తతల పెరుగుదల..
ఈ సంఘటనలు రెండు దేశాల మధ్య నమ్మకం లోపాన్ని సూచిస్తున్నాయి. హైకమిషన్లు దౌత్య ప్రతినిధుల కేంద్రాలు. వాటి చుట్టూ ఉన్న సౌకర్యాలపై జోక్యం దౌత్య ఆచారాలకు విరుద్ధం. ఒక వైపు చర్య తీసుకుంటే మరోవైపు ప్రతీకారం తీసుకోవడం సాధారణమైపోయింది. ఇది సమస్యను పరిష్కరించకుండా మరింత లోతుగా నెట్టే అవకాశం ఉంది. భారత్–పాక్ సంబంధాలు ఇప్పటికే కాశ్మీర్, ఉగ్రవాదం, సరిహద్దు సమస్యలతో క్లిష్టంగా ఉన్నాయి. ఇలాంటి చిన్న చర్యలు కూడా పెద్ద దౌత్య వివాదాలుగా మారే ప్రమాదం ఉంది. రెండు దేశాలు దౌత్య మార్గాల ద్వారా సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ పరిణామాలు దౌత్య సంబంధాలను సాధారణీకరించడంలో అడ్డంకిగా నిలుస్తాయి. రెండు దేశాలు పరస్పర గౌరవం, అంతర్జాతీయ దౌత్య నిబంధనలను పాటించడం అవసరం. లేకపోతే ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతమై, ప్రజల మధ్య విశ్వాసాన్ని మరింత దెబ్బతీయవచ్చు.
पाकिस्तान हाई कमीशन के बाहर सुरक्षा का बाहरी घेरा पर बुलडोजर चला दिया गया है । शांतिपथ स्थित पाकिस्तान हाई कमीशन के बाहर सारे बैरियर तोड़ दिए गये हैं. बता दें, पाकिस्तान ने भी भारतीय हाई कमीशन के सामने ऐसी ही करवाई किया है जिसके जवाब में भारत ने यह कदम उठाया. pic.twitter.com/DgeW0fZD1t
— Yogesh Mishra (@iYogeshMishra) August 20, 2026