Sreemukhi Show: బుల్లితెర పై ఎంటర్టైన్మెంట్ షోస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన టీవీ చానెల్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా స్టార్ మా ఛానల్ కూడా ఉంటుంది , అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ షోకి అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ రప్పిస్తున్న ఎంటెర్టైనెంట్ షోస్ లో ఒకటి ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’. ప్రతీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఈ ఎంటర్టైన్మెంట్ షో గత 5 ఏళ్ళ నుండి అద్భుతమైన రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తోంది. శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కి ముక్కు అవినాష్ , హరి ‘కో – హోస్ట్’ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి చేసే సందడి మామూలు రేంజ్ లో ఉండదు. పొట్టచెక్కలు అయ్యేలా నవ్వాల్సిందే. అయితే రేపు ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
రేపటి ఎపిసోడ్ లో స్టార్ మా ఛానల్ లో అత్యధిక రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న టాప్ సీరియల్స్ ‘పొదరిల్లు’, ‘గుండెనిండా గుడి గంటలు’ కి సంబంధించిన నటీనటుల మధ్య పోటీ జరగనుంది. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడం , పంచులు వేసుకోవడం, ఆటల్లో పోటీ పడడం వంటివి చిన్న సైజు రణరంగాన్ని తలపించాయి. అయితే ఇదంతా ఫన్నీ మోడ్ లోనే సాగడం విశేషం. ముఖ్యంగా ఒకే సీరియల్ కి సంబంధించిన నటీనటులకు ఉన్న చెడు లక్షణాలకు సంబంధించి ’10’ కి ఎన్ని మార్కులు ఇస్తారు అనే టాస్క్ ని నిర్వహిస్తుంది శ్రీముఖి. ఈ టాస్క్ లో ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్ నుండి బాలు – మీనా లు ఒకరికి ఒకరు మంచి మార్కులు ఇచ్చుకొని పాజిటివ్ గా ఉంటారు, కాకపోతే బాలు మీనా కి అలగడం ఎక్కువ అనే చెడు లక్షణం కి మార్కులు వేస్తాడు.
ఇక ‘పొదరిల్లు’ సీరియల్ హీరోయిన్ కృత్తిక కి అయితే, ఆ సీరియల్ హీరో ఆమెకు కాస్త పొగరు ఎక్కువ అని మూడు మార్కులు ఇస్తాడు. ఇక్కడ కృత్తిక కి కోపం వచ్చి , ఎప్పుడు పొగరు చూపించానో చెప్పకపోతే తదుపరి షెడ్యూల్ లో కచ్చితంగా నా పొగరు చూపిస్తా అని వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా చాలా ఫన్నీ గా సాగిపోయింది. కేవలం ప్రోమో లోనే ఇంత ఫన్ ఉంటే, ఇక రేపు టెలికాస్ట్ అవ్వబోయే ఈ షోలో ఇంకెంత ఫన్ ఉంటుందో మీరే ఊహించుకోండి.