Google: సినిమాల్లో టైం మిషన్ ద్వారా గత చరిత్ర లోకి వెళితే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఒకప్పుడు మనం ఉన్నచోటే ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. అయితే ఇది సినిమాల వరకే పరిమితం.. నిజంగా ఏం జరిగిందో మనం తెలుసుకునే అవకాశం ఉండదు.. అని అనుకుంటారు. అయితే ఇప్పుడు మీరు తెలుసుకునే అవకాశం ఉంది. మీరు ఉన్నచోటే కొన్ని ఏళ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేది? అప్పుడు ఎలాంటి భవనాలు ఉన్నాయి? అప్పటికి ఇప్పటికి ఏం మారిపోయింది? అనేది తెలుసుకోవచ్చు. అందుకోసం చేతిలో మొబైల్ అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు..
మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎటువంటి సమాచారాన్ని అయినా కూర్చున్న చోటే తెలుసుకోవచ్చు. అలాగే మీరు కూర్చున్న చోటే కొన్ని ఏళ్ల కిందట ఎలా ఉందో కూడా మొబైల్లో చూసుకోవచ్చు. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న మొబైల్ లోకి వెళ్లి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు Google Earth అని టైప్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో explore అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ లోకి వెళ్ళగానే కావలసిన లోకేషను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు కూర్చున్న చోటే ఉన్న లొకేషన్ ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కనిపించే పేజీలో View అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇందులో కొన్ని బటన్స్ కనిపిస్తాయి. వీటిలో Show Historical Images అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. అయితే ఇప్పుడు ఒక స్లైడర్ కనిపిస్తుంది. నీ స్లైడర్ లో వరుసగా సంవత్సరాలు ఉంటాయి. ఈ సంవత్సరాలలో మీకు కావాల్సిన year ను ఎంచుకోవచ్చు. అలా క్లిక్ చేయగానే ఆ ప్లేస్లో ఆ ఏడాదిలో ఎలాంటి వాతావరణ ఉండేదో కనిపిస్తుంది.
ఇలా గత సంవత్సరంలో మనం ఉన్నచోట ఏం జరిగిందో? ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయో ఇమేజ్ తో కనిపిస్తాయి. ఒకప్పుడు శాటిలైట్ ద్వారా రికార్డు అయినా ఈ ప్రాంతాలు ఇప్పుడు స్టోర్ చేయబడ్డాయి. ఇవి కావలసిన వారికి అందిస్తున్నాయి. కొన్ని భూములు, భవనాల వివరాలు తెలుసుకునేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా క్రేజీగా తమ ప్రాంతం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. అప్పటికి ఇప్పటికీ ఎలా మారిపోయింది? అప్పుడు ఏం జరిగింది? అనేది కూడా తెలుసుకుంటే ఉత్సాహంగా ఉంటుంది. ఇలాంటి విషయాలు ఒకప్పుడు సినిమాల్లోనే కనిపించేవి. కానీ ఇప్పుడు గూగుల్ లోకి వెళ్లిన తర్వాత అన్ని విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.