Homeఅంతర్జాతీయంDonald Trump Long Term Attack Plan On Iran: యుద్ధం ఇప్పుడే ముగియదు.. సుదీర్ఘ...

Donald Trump Long Term Attack Plan On Iran: యుద్ధం ఇప్పుడే ముగియదు.. సుదీర్ఘ దాడులకు ట్రంప్‌ ప్లాన్‌!

Donald Trump Long Term Attack Plan On Iran: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ పెట్టిన అణుచిచ్చు.. నాలుగు రోజులుగా గల్ఫ్‌ దేశాలను దహించి వేస్తోంది. మొన్నటి వరకు కలిసి ఉన్న దేశాలు ఇప్పుడు పరస్పర దాడులతో ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్‌ అణు కార్యక్రమాలు ఆపాలని డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’తో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ హయతుల్లా ఖమేనీ మరణించాడు. దీంతో ఇరాన్‌ ప్రతిదాడులు చేస్తోంది. గల్ప్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్‌ను టార్గెట్‌ చేసింది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. ఈ యుద్ధం ఇప్పడే ముగియదని మరో నాలుగు నుంచి ఐదు వారాలు కొనసాగుతుందని ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌ అణ్వాయుధాల తయారీని ఆపకపోవటం, అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం గల క్షిపణులను కలిగి ఉంచటంతో ఈ దాడులు తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. మునుపటి హెచ్చరికలను ఇరాన్‌ నిర్లక్ష్యం చేసినందుకు దాని మిసైల్‌ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడమే ప్రధాన లక్ష్యమని ట్రంప్‌ హెచ్చరించారు.

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

ట్రంప్‌ కీలక ప్రకటనలు..
ఇరాన్‌ అణ్వాయుధాల కార్యక్రమాన్ని పూర్తిగా అంగీకరించడం లేదని, దాని కొనసాగడం ప్రపంచ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోందని ట్రంప్‌ వాదించారు. ఇరాన్‌ దగ్గర అమెరికా స్థావరాలు, ఆర్థిక మూలాలపై దాడి చేసే దీర్ఘ పరిధి క్షిపణులు ఉన్నాయని, వాటిని నాశనం చేయడమే ఈ ఆపరేషన్‌ ఉద్దేశమని చెప్పారు. ఇరాన్‌కు ఇచ్చిన మునుపటి హెచ్చరికలను బేఖాతరుగా పట్టించుకోవడం ఈ దీర్ఘకాల దాడులకు కారణమని ఆయన స్పష్టం చేశారు.

నాలుగైదు వారాలు దాడులు..
ప్రస్తుత దాడులు మరో నాలుగు నుంచి ఐదు వారాలు పరిమితి లేకుండా సాగుతాయని అమెరికా రక్షణ మంత్రి కూడా ప్రకటించారు. ఇప్పటికే ఇరాన్‌లో 200 మంది మరణించినా, ఇరాన్‌ రిపబ్లిక్‌ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ), మిలిటరీ దళాలు ఆయుధాలు వదలితే క్షమించి వదిలేస్తామని ట్రంప్‌ పిలుపునిచ్చారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని, దౌత్య మార్గాలు తెరిచే ఉన్నా సైనిక చర్యలు ప్రధానమని చెప్పారు. అమెరికా సైనికుల్లో కొందరు మరణించినా యుద్ధం ముందుకే సాగుతుందని ఆయన ధైర్యంగా ప్రకటించారు.

ఖమేనీ మరణం తర్వాత ఉద్రిక్తతలు
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ, మాజీ ప్రధాని మరణాల తర్వాత అమెరికా–ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు బాలిస్టిక్‌ మిసైల్‌ కేంద్రాలు, అణు స్థావరాలపై బిట్‌ స్టెల్త్‌ బాంబర్లతో జరుగుతున్నాయి. ఇరాన్‌ ప్రతిదాడులు యూఏఈ, ఖతార్‌లోని అమెరికా బేస్‌లపై కురిపించగా, మూగ్గురు అమెరికన్‌ సైనికులు మరణించారు. ఈ ఆపరేషన్‌ ఇరాన్‌ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా బలహీనపరచడానికి రూపొందించబడిందని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ పేర్కొంది.

ఇరాన్‌ అణు కార్యక్రమం ప్రపంచ భద్రతకు హెచ్చరిక సంకేతాలు ఇస్తోందని ట్రంప్‌ వాదనలు సూచిస్తున్నాయి. మిసైల్‌ వ్యవస్థ ధ్వంసం ద్వారా ఇరాన్‌ ప్రాంతీయ ఆధిపత్యాన్ని అరికట్టాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. దీర్ఘకాల దాడులు మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థలు, చమురు ధరలను ప్రభావితం చేస్తాయి. ఓమాన్‌ మధ్యవర్తిత్వంతో జెనీవాలో జరిగే చర్చలు సఫలమైతే యుద్ధం ఆగే అవకాశం ఉంది. మరోవైపు రష్యా, చైనా దాడులను వెంటనే ఆపమని పిలుపునిచ్చాయి. యూరోపియన్‌ యూనియన్‌ శాంతి చర్చలకు మద్దతు తెలపడంతోపాటు అణు అంబాగోచా భయం వ్యక్తం చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper