Homeఎంటర్టైన్మెంట్Ram Charan: రామ్ చరణ్ కి ఇష్టం లేకపోయిన చిరంజీవి ఫోర్స్ తో చేసిన సినిమాలు...

Ram Charan: రామ్ చరణ్ కి ఇష్టం లేకపోయిన చిరంజీవి ఫోర్స్ తో చేసిన సినిమాలు ఏంటంటే..? ఆ మూవీ హిట్టా? ఫట్టా?

Ram Charan: ‘గ్లోబల్ స్టార్’ గా అవతరించిన ‘రామ్ చరణ్’ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా సెకండ్ సింగిల్ గా ఒక సాంగ్ కూడా వచ్చింది. సాంగ్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక రామ్ చరణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న […]

Ram Charan: ‘గ్లోబల్ స్టార్’ గా అవతరించిన ‘రామ్ చరణ్’ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా సెకండ్ సింగిల్ గా ఒక సాంగ్ కూడా వచ్చింది. సాంగ్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక రామ్ చరణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇప్పటికే ఆయన పాన్ ఇండియాలో ఆయన స్టార్ హీరోగా అవతరించాడు. ఇక నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీపడుతున్న హీరోల్లో తను కూడా ఒకరు కావడం విశేషం…ఇక నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకునే కెపాసిటీ రామ్ చరణ్ కి ఉందా? లేదా అనేది తెలియాలంటే మరో రెండు సినిమాలు రిలీజ్ అయితే గాని సరైన క్లారిటీ రాదు…

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

ఇక రామ్ చరణ్ కెరియర్ స్టార్టింగ్ లో తన సినిమాలకు సంబంధించిన పూర్తి డిసిజన్ చిరంజీవి గారి చేతిలోనే ఉండేది. చరణ్ ఏ సినిమా చేయాలన్నా కూడా చిరంజీవి ముందుగా డిసైడ్ అయిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆ సినిమా ఓకే అయ్యేది. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ కి ఒక రెండు సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయిన కూడా చిరంజీవి ఫోర్స్ వల్ల చేయాల్సి వచ్చిందని గతంలో పలు సందర్భాల్లో తెలియజేశాడు.

అందులో ఒకటి తుఫాన్ సినిమా కాగా, మరొకటి బ్రూస్లీ సినిమా అని తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ సైతం ఈ విషయాల మీద ఇప్పటి వరకు స్పందించినప్పటికి తన సన్నిహిత వర్గాల దగ్గర మాత్రం ప్రతిసారి ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటాడట. తుఫాన్ సినిమా జంజీర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. బాలీవుడ్ లో జంజీర్ పేరుతో రిలీజ్ అయినప్పటికి తెలుగులో మాత్రం తుఫాన్ గా రిలీజ్ అయింది.

ఈ సినిమా రిలీజ్ రోజు డిజాస్టర్ టాక్ ను మూట గట్టుకోవడం రామ్ చరణ్ కెరీర్ లోనే పెద్ద మైనస్ గా మారింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బ్రూస్లీ సినిమా ఒక వంతుకు ఓకే అనిపించినప్పటికి అందులో ఎమోషన్స్ ని అలాగే సినిమాని హ్యాండిల్ చేసిన విధానం బాలేకపోవడంతో ఆ మూవీ ప్లాప్ అయింది. అయితే ఈ సినిమాలను స్టార్ట్ చేసేటప్పుడే రామ్ చరణ్ కి ఆ కధలైతే పెద్దగా నచ్చలేదట. కానీ అనుకొని కారణాలవల్ల చిరంజీవి ఫోర్స్ తో ఈ సినిమాలు చేయాల్సి వచ్చిందని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper