Sai Dharam Tej: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పిలవబడే హీరోల్లో ఒకరు సాయి ధరమ్ తేజ్. పెళ్లి అంటే అసలు ఆసక్తి లేదు అన్నట్టుగా వ్యవహరించే ఈ హీరో కూడా ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. రీసెంట్ గానే హైదరాబాద్ లోని తన నివాసం లో కిరణ్ అమ్మాయితో సాయి ధరమ్ తేజ్ కి నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్ధ వేడుకకు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుండి సాయి ధరమ్ తేజ్ కి అత్యంత సన్నిహితులైన వాళ్ళు కొందరు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలందరినీ ఒకే చోట చూడడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇంతకీ ఈ కిరణ్ ఎవరు?, ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ అనే దానిపై సోషల్ మీడియా లో ఆసక్తి కరమైన చర్చ సాగుతోంది.
వాస్తవానికి సాయి ధరమ్ తేజ్ ఒక సినిమా హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడేమో అని అంతా అనుకున్నారు. ఎందుకంటే గతం లో ఆయన రెజీనా కాసాండ్రా తో డేటింగ్ చేసాడు. ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ రాశీ ఖన్నా తో కూడా డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించాయి కానీ , అందులో ఎలాంటి నిజం లేదట. వీళ్ళిద్దరితో కాకపోయినా , భవిష్యత్తులో సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకుంటే సినీ ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయినే చేసుకుంటాడని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు. చాలా రోజుల నుండి వీళ్లిద్దరి మధ్య మంచి రిలేషన్ నడుస్తోంది. ఇద్దరు డేటింగ్ కూడా చేసుకుంటున్నారు. కొన్ని నెలల క్రితమే తమ కుటుంబ సబ్యులకు ప్రేమ గురించి వెల్లడించారు. వాళ్ళు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా వీళ్లిద్దరి పెళ్ళికి ఒప్పుకున్నారు.
ఇక కిరణ్ బ్యాక్ గ్రౌండ్ వివరాల విషయం లోకి వెళ్తే , ఈమె తండ్రి ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త. ఆయనకు దేశవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. అంతే కాదు , పలు సినిమాలకు ఆయన ఫైనాన్షియర్ గా కూడా వ్యవహరించాడు. అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కిరణ్ చాలా సింపుల్ గా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక సాధారణ మధ్య తరగతి అమ్మాయి ఎలా ఉంటుందో, అలా కనిపిస్తుంది కిరణ్. ఈమె వృత్తిపరంగా ఒక సాఫ్ట్ వేర్ డెవలపర్ అట. గత 6 ఏళ్లుగా ఆ రంగం లో ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. ఆస్తులు కూడా వందల కోట్ల రేంజ్ లోనే ఈమెకు ఉన్నాయి. కట్నం గా సాయి ధరమ్ తేజ్ ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయకపోయినప్పటికీ, వీళ్లిద్దరి కోసం కిరణ్ తండ్రి ఒక అందమైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడట. వచ్చే నెలలో వీళ్లిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది. పెళ్లి తర్వాత మన టాలీవుడ్ లో యంగ్ హీరోల జాతకాలు మారిపోయాయి. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ జాతకం కూడా అలాగే మారబోతుందో లేదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.