CEO & HR affair viral: నేటి కాలంలో కొంతమంది భార్యాభర్తల మధ్య అంతగా అన్యోన్యత ఉండడం లేదు.. ముఖ్యంగా హై ప్రొఫైల్ కొనసాగించేవారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. తెరచాటు వ్యవహారాలలో మునిగి తేలుతున్నారు. చివరికి ఏదో ఒక సందర్భంలో దొరికిపోతున్నారు. అలా దొరికిపోయిన ఓ కంపెనీ సీఈవో ఇప్పుడు తల పట్టుకున్నాడు. ఆయన రాసలీలకు సంబంధించిన వీడియో సంచలనం గా మారింది.
Also Read: మసూద్ అజర్ జాడ దొరికింది.. ఇక లేపేసుడే ఆలస్యం?
అమెరికాలో ఆస్ట్రోనోమర్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఐటి, ఇతర సేవలను అందిస్తుంది.. అందిస్తున్న సేవలపరంగా ఈ కంపెనీకి మంచి పేరు ఉంది. ఈ కంపెనీ సీఈవో ఆండీ బైరాన్ కు గతంలోని వివాహం జరిగింది. ఇతడు సతీమణి పేరు మేగాన్. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆస్ట్రో నోమర్ కంపెనీ మానవ వనరుల విభాగ అధిపతిగా క్రిస్టిన్ కొనసాగుతోంది.. క్రిస్టిన్ కు బైరాన్ కు కొంతకాలంగా చనువు ఏర్పడింది. అది కాస్త వేరే బంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే బైరాన్ తన సతీమణి దూరం పెట్టడం మొదలుపెట్టాడు. దీనిని మేగాన్ అంతగా గుర్తించలేదు. అయితే ఇటీవల ఆమె తో కలిసి బైరాన్ ఓ కన్సర్ట్ కు వెళ్లాడు. అక్కడ ఆమెతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు.. ఈ క్రమంలోనే కిస్ క్యామ్ వారిద్దరిని పట్టించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Also Read: స్వాతంత్య్రానికి మరింత చేరువైన బలూచిస్తాన్.. లోంగుబాటలో పాకిస్తాన్ సైన్యం
ఈ వీడియో మేగాన్ దృష్టికి రావడంతో ఆమె ఒక్కసారిగా ఆవేదనలో కూరుకుపోయింది. తీవ్రమైన దుఃఖంలో ఆమె మునిగిపోయింది. ఈ విషయాన్ని ఆమె అత్యంత తీవ్రంగా పరిగణించింది. అంతేకాదు తన ఫేస్ బుక్ లో తన ప్రొఫైల్ నుంచి మేగాన్ తన భర్త పేరును తొలగించింది.. అంతేకాదు త్వరలో అతడి నుంచి విడాకులు తీసుకున్నందుకు ఆమె ప్రయత్నాలు చేస్తోంది.. బైరాన్ మొదట్లో తన భార్యతో బాగానే ఉండేవాడు. ఇప్పుడైతే క్రిస్టిన్ సంస్థలోకి వచ్చిందో.. అప్పుడే తన తీరు మార్చుకున్నాడు. ఆమెతో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నించేవాడు. ఆఫీస్ పని ముసినప్పటికీ.. ఆమెతో కాఫీ తాగుతూ.. స్నాక్స్ తింటూ.. కబుర్లు చెప్పుకునేవాడు. అయితే క్రిస్టిన్ వైవాహిక స్థితి గురించి ఎటువంటి సమాచారం రాలేదు. బహుశా ఆమె అవివాహిత అయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.. తన వ్యవహారం బయటపడడంతో బైరాన్ సైలెంట్ అయిపోయాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు.. బైరాన్ వ్యవహారంతో అక్కడ మీడియాలో రకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం ఆస్ట్రో నోమర్ కంపెనీ భవితవ్యాన్ని ఏం చేస్తుందోనని అక్కడ మీడియా తను ప్రసారం చేసిన కథనాలలో స్పష్టం చేసింది.
View this post on Instagram