Story of YouTube channel:“మీడియా సంస్థలు ఉద్యోగులను వాడుకుంటాయి. ఉద్యోగులకు కష్టాలు వస్తే పక్కన పెడతాయి. కానీ ఈయన మాత్రం గొప్పోడు. మనసున్నోడు. అందువల్లే తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టాన్ని గుర్తించాడు. కార్లు బహుమతులుగా ఇచ్చాడు. సీఈఓ లను చేశాడు. అంతటితో ఆగలేదు తన సంస్థలో పనిచేస్తున్న వారికి ప్లాట్లు కూడా ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప ఉదారత ఏముంటుంది.. ఇంతకంటే ఉన్నతమైన ఆలోచన ఇంకేం ఉంటుంది.. సంస్థ కోసం పని చేస్తున్న వ్యక్తులను కరివేపాకులా చూస్తున్న రోజుల్లో ఇతడు ఉన్నతంగా ఆలోచించాడు. గొప్ప జీవితాన్ని ప్రసాదించాడు” ఇలా సాగిపోతున్నాయి ఆ యూ ట్యూబ్ చానెల్స్ అధినేత మీద ప్రశంసలు.
Also Read: మహేష్ బాబు చేసిన సినిమాల్లో రాజమౌళికి నచ్చని సినిమా అదేనా..?
వాస్తవానికి ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులపై యాజమాన్యం ఉదారత చూపించడం మంచి విషయం. వారి మంచి కోసం పనిచేయడం ఇంకా గొప్ప విషయం. బయటికి చెబుతున్నట్టుగా ఆ సంస్థ చేస్తోంది నిజమేనా? ఇంతటి ప్రేమ వాస్తవమేనా? అని తరచి చూస్తే అందుకు భిన్నమైన సమాధానం వినిపిస్తోంది.. అదంతా కేవలం ప్రచారం కోసమేనని.. ఉద్యోగులపై ఎటువంటి ఉదారతలేదని.. అంతకుమించి అనే రేంజ్ లోనే స్కెచ్ వేశారని.. దానికోసమే ఇదంతా అని తెలుస్తోంది.
లెక్కకు మిక్కిలి యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి.. హోమ్ టూర్ నుంచి మొదలుపెడితే ఫ్రిడ్జ్ టూర్ వరకు ప్రతి దాంట్లోనూ కమర్షియల్ కోణమే ఆ యూట్యూబ్ ఛానల్స్ అధినేతకు తెలుసు. అలాంటి వ్యక్తి ఉద్యోగుల కోసం అంత చేస్తున్నాడంటే ఆ సంస్థలో పనిచేస్తున్న వారే మొదట్లో నమ్మలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వారు ప్రయత్నించారు. చివరికి వారు అనుకున్నదే నిజం అయింది. ఎందుకంటే ఆ సంస్థ అధినేత పక్కా కమర్షియల్. ఏది కూడా ఉచితంగా ఇవ్వడు. ఉదాహరణకు అప్పట్లో కొంతమందికి కార్లు ఇచ్చాడు. ఆ కార్లలో కొంత పరిధి వరకు మాత్రమే అతడు ఈఎంఐ చెల్లించాడు. మిగతాది మొత్తం ఉద్యోగులకు అప్పగించాడు. దీంతో చచ్చినట్టు వారే ఈఎంఐ చెల్లిస్తున్నారు. ఇక ఫ్లాట్ల విషయంలోనూ అదే జరిగింది. ఇచ్చిన ఫ్లాట్ నిజమే.. కాకపోతే ఆ ప్లాట్లు ఇప్పుడప్పుడే ఉద్యోగులకు అందుబాటులోకి రావు. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత ఉద్యోగులకు ప్లాట్లు ఇస్తారు. మరోవైపు ఆ ప్లాట్లకు తొలి ఈఎంఐ మాత్రమే సంస్థ చెల్లిస్తుంది. ఆ తదుపరి వాయిదాలు మొత్తం ఉద్యోగులే చెల్లించాలి. కానీ ఈలోపు ఇవి ఇచ్చినట్టు ఆ సంస్థ అధిపతి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. గొప్ప గొప్ప వ్యక్తులను పిలిపించి తన సంస్థను మరింత బలోపేతం చేసుకున్నారు.
Also Read: విశ్వంభర చిత్రాన్ని టార్గెట్ చేసి ఖతం చేస్తున్నారే
ఇంతటి ప్రచారం వెనుక కారణం లేకపోలేదు. తన సంస్థ గొప్పదని చాటింపు వేయించుకోవడం.. భారీగా ప్రకటనలు సాధించడం.. సంస్థలో పెట్టుబడులను ఆహ్వానించడం.. ఇవన్నీ కూడా ఆ ఛానల్ అధినేత లక్ష్యాలు. అయితే చవక బారు కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన ఆ ఛానల్ ను, దాని అధినేతను నమ్మి ఎవరు పెట్టుబడులు పెడతారు? అంత సులువుగా పెట్టడానికి వారు ఎందుకు ముందుకు వస్తారు? ఇంటర్వ్యూ చేసిన అంత ఈజీగా పెట్టుబడిదారులు రాలేరు కదా? ఈ విషయాలను గొట్టం ఛానల్స్ అధినేత ఎలా మర్చిపోయాడో అర్థం కావడం లేదు.. స్థూలంగా చూస్తే ఇప్పటికి ఆ అధినేత నిర్వహిస్తున్న ఛానల్స్ లో ఏ ఒక్కటి కూడా కోటి సబ్స్క్రైబర్ ను కలిగి లేదు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ.. ఆ గొట్టం చానల్స్ అధినేత ఆ స్థాయికి ఎదగకపోవడం నిజంగా ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ఈ ప్రకారం చూసుకుంటే తమిళనాడులోని విలేజ్ ఛానల్ రెండు కోట్ల సబ్స్క్రైబర్లను దాటేసింది. పది కోట్ల రెవెన్యూ ను సంపాదిస్తోంది. ఆ ఛానల్ వెనుక ఉంది మహా అయితే పదిమంది మాత్రమే. జనాలకు కొత్తదనాన్ని అందివ్వడంలోనే వారు విజయవంతమవుతున్నారు. కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్ అధినేత ప్రతి అంగుళాన్ని కమర్షియల్ గా మార్చేశారు. ఈ తేడా వల్లే ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. ఆయన తన కమర్షియల్ కోణాన్ని అలాగే కొనసాగిస్తే ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు. చేరుకునే అవకాశం కూడా లేదు.