Arnab Cyclone: ఆకాశం మేఘావృతమైంది. చిన్న చిన్న జల్లులు మాత్రమే కురుస్తున్నాయి.. గాలులు మాత్రం భీకరంగా వీస్తున్నాయి. చూసేందుకు ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. కానీ అక్కడి జనాలకు మాత్రం నరకం.. క్షణక్షణం భయం.. ఏం జరుగుతుందో తెలియని భయానకం.. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లడం లేదు. అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
అర్నాబ్ తుఫాన్ వల్ల ఏపీలో చాలా ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాలులు కూడా వీస్తున్నాయి. యానాం దగ్గర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. తుఫాన్ ప్రభావం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. మిగతా ప్రాంతంలో కూడా వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. పలు ప్రాంతాలలో వరికోతలు మొదలయ్యాయి. ధాన్యం తడిసింది. తుఫాన్ ప్రభావం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
అర్నబ్ వల్ల సముద్ర తీర ప్రాంతాలలో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ఉప్పాడ ఏరియాలో సముద్రపు అలజడి తీవ్రంగా ఉంది. దారులపై నుంచి నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఉప్పాడ ప్రాంతంలో అంతగా వర్షం కురవడం లేదు. వాతావరణం మాత్రం ఆహ్లాదకరంగా ఉంది. ఈ ప్రాంతంలో సముద్రం భీకరంగా ఉంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. దేశ ప్రజలు అప్రమత్తమై సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో నష్టం ఎక్కువగా ఉంది.
గాలుల తీవ్రత అధికంగా ఉండడంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుఫాన్ ప్రభావం ఏపీ రాష్ట్రం మీద బుధవారం, గురువారం దాకా ఉంటుందని తెలుస్తోంది. గాలుల వల్ల సముద్రం నుంచి అంత ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే అధికారులు ముందుస్తు చర్యలు తీసుకున్నారు. తీర ప్రాంతంలో ఉన్న వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. ఉప్పాడ సముద్రానికి దగ్గరగా ఉంటుంది. తుఫాన్ వల్ల సముద్రం ముందుకు వచ్చింది. ఇక్కడ మాత్రమే కాకుండా.. కాకినాడ.. విశాఖపట్నం.. ఇతర తీర ప్రాంతాలలో సముద్రం ముందుకు వచ్చింది.
ఉప్పాడలో సముద్రపు అలజడి
ఉప్పాడ రోడ్డు పై నుంచి సముద్రపు నీరు ఇళ్లలోకి చేరడంతో ఆందోళనకు గురవుతున్న గ్రామస్తులు..
వర్షం లేకపోయినా సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
ఉప్పాడ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. https://t.co/xM5gFpw3if
— RTV (@RTVnewsnetwork) October 27, 2026