రియల్ మీ 16 ప్రో:
ఈ మొబైల్ లో 6.8 అంగుళాల ఎమోల్డ్ డిస్ ప్లే ఉండనుంది. 144 రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉన్న దీని సన్నని డిజైన్ చూస్తే ఆకర్షితులవుతారు. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 300 ఉండనుంది. అలాగే 5జీ చిప్ సెట్ తో పాటు 8 జీబీ ర్యామ్, 12 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇచ్చారు. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.44,999గా ఉంది. దీనిపై రూ. 4000 పెంచారు. దీంతో ప్రస్తుతం దీనిని రూ. 49,999తో కొనుగోలు చేయాలి.
రియల్ మీ 16 ప్రో ప్లస్:
ఈ ఫోన్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 53,999తో విక్రయిస్తున్నారు. దీనిపై రూ. 3,000 పెంచారు. దీంతో ప్రస్తుతం దీని ధర రూ. 58,999కి మారింది. ఇందులో 6.8 అంగుళాల 4డి కర్వ్డ్ డిజైన్ ను అమర్చారు. ఇది 144 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగర్ 7జెన్ 4 ఆక్టా కోర్ చిప్ సెట్ ను ఉంచారు. 200 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు 7,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 12 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
రియల్ మీ 16 5జీ మొబైల్ ధర కూడా పెంచారు. ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 36,999తో విక్రయించగా.. దీనిపై రూ.1,000 ను పెంచారు. అలాగే రియల్ మీ 16 టి మోడల్ పై రూ.1000 పెంచారు. మొత్తంగా ఈ కంపెనీ ఫోన్లపై రూ.1,000 నుంచి రూ.4,000 వరకు పెంచింది. అయితే ప్రస్తుతం పండుగల సీజన్ సందర్భంగా కొన్ని మొబైల్స్ పై ఆఫర్లు వర్తించే అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్త మొబైల్ కొనుగోలు చేసే సమయంలో ధరను చెక్ చేసుకోవాలి.
ప్రస్తుతం ఈ కంపెనీ ధరలు పెంచడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లో వినియోగించే చిప్ సెట్ తో పాటు విడిభాగాల ధరలు పెరిగాయి. అలాగే గ్లోబర్ మార్కెట్లో విడిభాగాల కొరత ఉండడతో ధరలు పెంచాల్సి వచ్చిందని అంటున్నారు.