Nithin: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత 25 సంవత్సరాలుగా ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు నితిన్…జయం సినిమాతో మొదటి సక్సెస్ ని సాధించిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మధ్యలో కొన్ని ప్లాప్ లు వచ్చినా కూడా తను పట్టు వదలని విక్రమార్కుడిలా సినిమాలను చేస్తూనే వచ్చాడు. మొత్తానికైతే 13 ప్లాప్ ల తర్వాత ఇష్క్ సినిమాతో బ్రేక్ వచ్చింది. అప్పటినుంచి ఆయనకు ఒక సక్సెస్ వస్తే నాలుగైదు ఫ్లాపులు రావడం ఆనవాయితీగా మారిపోయింది. ఇక ప్రస్తుతం వరుసగా 6 ప్లాపులను మూట గట్టుకున్న ఆయన ఇప్పుడు చేసే సినిమాల విషయంలో ఆచితూచి మరి అడుగులు వేస్తున్నాడు. విఐ ఆనంద్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమైన నితిన్ ఆ మూవీలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా బడ్జెట్ అయితే విపరీతంగా పెరిగిపోతుందట. దానివల్ల ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్ లో ఉండాలంటే నితిన్ మార్కెట్ ను మించి బడ్జెట్ ను పెట్టే అవకాశం లేదని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆ కథని వదులుకోవడం నితిన్ కి ఇష్టం లేకపోయిన అంత తక్కువ బడ్జెట్లో సినిమా చేయడం విఐ ఆనంద్ కి నచ్చలేదట. దానివల్ల ఈ సినిమా అయితే తాత్కాలికంగా ఆగిపోయింది. దాంతో నితిన్ నాగ వంశీ బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది.
అందుకోసం ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ నాగవంశీ కి బాగా నచ్చడంతో నితిన్ కి ఆ కథను వినిపించి ఆ కథను లాక్ చేశాడు. మొత్తానికైతే ఇప్పుడు నాగ వంశీ బ్యానర్లో నితిన్ ఒక సినిమా చేస్తున్నాడు. విఐ ఆనంద్ డైరెక్షన్లో చేయాల్సిన సినిమా ప్రస్తుతానికైతే ఆగిపోయింది. వేరే ప్రొడ్యూసర్ ను తీసుకొని వచ్చి నితిన్ తో ఈ సినిమా చేయగలుగుతాడా?
లేదంటే వేరే హీరోతో ఈ సినిమా చేసే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది… ఇదంతా చూసిన ప్రేక్షకులు మాత్రం నితిన్ విషయంలోనే ఎందుకిలా జరుగుతుంది. ప్రతి సినిమా విషయంలో అతనికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సినిమాలు ప్లాప్ అవ్వడం, సినిమాలు ఆగిపోవడం ఇవన్నీ అతనికే జరుగుతున్నాయంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…