Venky Atluri: ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లు తమ టాలెంట్ ని చూపిస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా యంగ్ హీరోలకు సూపర్ సక్సెస్ లను కట్టబెడుతున్నారు. ఇక అందులో వెంకీ అట్లూరి ఒకరు… ఆయన చేసిన తొలిప్రేమ మూవీతో సక్సెస్ ని అందుకున్నాడు. ఆయన ఆ తర్వాత అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను, నితిన్ తో చేసిన రంగ్ దే సినిమాలు ఆశించిన మేరకు విజయాలను సాధించలేకపోయాయి. దాంతో ఆయనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా అవకాశం ఇవ్వలేదు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న ధనుష్ తో సార్ అనే సినిమా చేసి సక్సెస్ సాధించాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు తమిళ్ హీరో అయిన సూర్యతో ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిపాడు. దాంతో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వెంకి అట్లూరితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇప్పటికే అతనికి ఇద్దరు హీరోలు ఫోన్ చేశారట. మరి ఆయన వారిలో ఎవరితో సినిమా చేస్తాడనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే చిరంజీవి ఫోన్ చేసి ఒక సబ్జెక్టుని రెడీ చేయమని చెప్పారట. ఇక ఇదే క్రమంలో నాని సైతం వెంకీ కి కాల్ చేసి ఇంతకుముందు తనకి చెప్పిన ఆ సబ్జెక్ట్ ని మళ్ళీ తెరమీదకి తీసుకొద్దామని చెప్పారట. మరి వీళ్లిద్దరిలో వెంకీ అట్లూరి ఎవరికి ఓటేస్తాడు.
చిరంజీవితో సినిమా చేస్తాడా? లేదంటే నానితో వెళ్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి బిజీగా ఉన్నాడు కాబట్టి తనతో తర్వాత చేసి కప్పుడు నాని తో చేయాలని చూస్తున్నాడా ఆయన ఏం అనుకుంటున్నాడు అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా వెంకీ అట్లూరి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ నెగ్లెక్ట్ చేసింది. అందువల్లే ఆయన నుంచి మంచి సినిమాలు ఇతర భాషల హీరోలకు వెళ్లిపోయాయి అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…