Homeలైఫ్ స్టైల్Mobile Addiction:మొబైల్ కు దూరంగా ఉండాలనుకుంటున్నారా..? ఈ 4 పనులు చేస్తే రిజల్ట్..

Mobile Addiction:మొబైల్ కు దూరంగా ఉండాలనుకుంటున్నారా..? ఈ 4 పనులు చేస్తే రిజల్ట్..

Mobile Addiction:నేటి కాలంలో చాలామంది చేతులు పుస్తకాలు కనిపించకపోయినా.. మొబైల్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అవసరాలు ఏదైనా ఆత్మీయ బంధువు వలె ఈ ఫోన్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా నష్టాలే ఉన్నాయని చాలామంది నిపుణులు అంటున్నారు. ఫోన్ వాడకం వల్ల ఆరోగ్యంతో పాటు కెరీర్ పై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఖాళీ సమయం దొరికితే ఒకప్పుడు పుస్తకాలు చదువుకొని జ్ఞానం పెంచుకునేవారు. కానీ ఇప్పుడు మొబైల్ లో పనికిరాని వీడియోలు […]

Mobile Addiction:నేటి కాలంలో చాలామంది చేతులు పుస్తకాలు కనిపించకపోయినా.. మొబైల్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అవసరాలు ఏదైనా ఆత్మీయ బంధువు వలె ఈ ఫోన్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా నష్టాలే ఉన్నాయని చాలామంది నిపుణులు అంటున్నారు. ఫోన్ వాడకం వల్ల ఆరోగ్యంతో పాటు కెరీర్ పై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఖాళీ సమయం దొరికితే ఒకప్పుడు పుస్తకాలు చదువుకొని జ్ఞానం పెంచుకునేవారు. కానీ ఇప్పుడు మొబైల్ లో పనికిరాని వీడియోలు చూస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారని కొందరు ఆవేదన చేస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఇప్పటికే చాలామంది మొబైల్ కు బానిసలు అయినట్లు తెలుపుతున్నాయి. అయితే ఈ ఫోన్ నుండి దూరం పోవాలంటే ఏం చేయాలి?

ఉదయం ఉదయం చేయాల్సిన పని ఇది..
చాలామంది నిద్ర లేవగానే ముందుగా ఏమైనా మెసేజ్ లు వచ్చాయా? ఎవరైనా ఫోన్ చేశారా? అన్న విషయం తెలుసుకునేందుకు ముందుగా మొబైల్ నే దర్శించుకుంటారు. ఆ తర్వాతే మిగతా పనులను ప్రారంభిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల ఆ చూసే మెసేజ్ లేదా కాలింగ్ మనకు ప్రతికూలంగా ఉంటే మనసులో నెగటివ్ ఏర్పడుతుంది. ఇది రోజంతా ప్రభావం చూపుతుంది. అందువల్ల ఉదయం లేవగానే ఫోన్ ను చూడకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు వ్యాయామం లేదా ధ్యానం చేసేందుకు ప్రయత్నించాలి. సాధ్యమైనంతవరకు బ్రేక్ ఫాస్ట్ అయ్యేంతవరకు ఫోన్ వైపు చూడకుండా ఉండాలి.

రాత్రి సమయంలో..
రాత్రిళ్ళు కూడా చాలామంది ఫోన్ చూసే నిద్రపోతుంటారు. కొందరు మానసిక ఆనందం కోసం సినిమాలు లేదా ఇతర వీడియోలు చూస్తే.. మరికొందరు గేమ్స్ వంటివి ఆడుతూ నిద్రపోతుంటారు. ఇలా చేయడం వల్ల మొబైల్స్ స్క్రీన్ మెదడుపై ఎక్కువగా ప్రభావం పడి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. అందువల్ల పడుకునే గంటకు ముందే మొబైల్ ను దూరంగా ఉంచాలి. అర్జెంటు కాల్స్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడమే మంచిది.

ఖాళీ సమయంలో..
ఎవరైనా ఖాళీ సమయం దొరికితే చేతిలోని మొబైల్ తీసుకొని స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక అలవాటు నుంచి విసనంగా మారిపోయింది. అయితే ఇక నుంచి అయినా ఖాళీ సమయం దొరికితే కుటుంబ సభ్యులతో మాట్లాడడం లేదా పుస్తకాలు చదవడం లేదా మనసుకు నచ్చే ప్రదేశాలకు వెళ్లి కాసేపు మౌనంగా ఉండడం వంటివి. అలా చేయడంవల్ల కొన్ని రోజుల తర్వాత ఫోన్ ఎక్కువగా వాడే అలవాటు తగ్గిపోతుంది.

స్క్రీన్ టైం..
ఇప్పటికిప్పుడు ఫోన్ కు దూరంగా ఉండడం అంటే కష్టమైన పనే. అయితే మెల్లిమెల్లిగా దూరం అయ్యే ప్రయత్నాలు చేయవచ్చు. ఉదాహరణకు ఒకరోజు 10 గంటల పాటు మొబైల్ చూడాల్సి వస్తే.. మరో రోజు 9 గంటలు.. ఇంకో రోజు ఎనిమిది గంటలు.. ఇలా ప్రణాళిక ప్రకారంగా మొబైల్ వాడకాన్ని తగ్గించుకోవచ్చు..

ఏది ఏమైనా మొబైల్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే దీని వ్యసనంలో పడితే మిగతా వాటికంటే ఎక్కువ ఆరోగ్యంతో పాటు ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper