ఒక్క ఓటమి.. ఎన్నో గుణాపాఠాలు.. మరెన్నో తాయిలాలు.. ఇదీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్న సంప్రదాయం. దుబ్బాక బై పోల్‌లో అనూహ్యంగా దెబ్బతిన్న అధికార టీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. అందుకే.. మున్ముందు రానున్న ఎన్నికలను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ఫలితాలు రిపీట్ కావొద్దని అప్పుడే తాయిలాలు ప్రకటించేసింది.
Also Read: కేసీఆర్ ఫెయిల్యూర్ కు అసలు కారణం అదేనా !?
ప్రభుత్వంపై గ్రేటర్ హైదరాబాద్ జనం ఇప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. భారీ వర్షాలు, వరదల నుంచి కొన్ని ప్రాంతాలు ఇంకా తేరుకోనేలేదు. వరద సాయం ఇచ్చామని సర్కారు చెప్తున్నా.. చాలాచోట్ల తమకు అందలేదంటూ బాధితులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు కార్పొరేటర్లపైనా జనంలో వ్యతిరేకత కనిపిస్తోంది. మరోవైపు దుబ్బాక గెలుపుతో జోష్‌లో ఉన్న బీజేపీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. అందుకే.. బీజేపీ జోరు మరోసారి కొనసాగకుండా అడ్డుకట్ట వేయాలని శాయశక్తులా ప్రయత్నిస్తోంది టీఆర్ఎస్.
దుబ్బాక దెబ్బతో టీఆర్ఎస్పార్టీలో టెన్షన్మొదలైంది. మరికొద్ది రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో సర్కార్ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే టైంలో పార్టీపై అసంతృప్తితో ఉన్న కులాలను, నేతలను బుజ్జగించేందుకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని నామినేటెడ్పదవుల్లోనూ నియామకాలు చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 74 లక్షల ఓటర్లు ఉండగా.. సాధారణంగా 50– 55 శాతం వరకు మాత్రమే పోలింగ్జరుగుతుంటుంది. బస్తీలు, కాలనీల వాసుల్లో చాలా వరకు ఓట్లు వేయడం లేదు. దీంతో టీఆర్ఎస్ఈసారి వారినే టార్గెట్ చేయాలని పనిలో పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఎల్ఆర్ఎస్చార్జీల్లోనూ తగ్గింపు వంటివి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలోని ప్రజలంతా దీపావళి పండుగ జరుపుకుంటున్న సమయంలోనే మున్సిపల్ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజీ అయ్యారు. రాష్ట్ర చీఫ్సెక్రటరీతో భేటీ అయి.. ఆస్తిపన్ను చెల్లింపులో 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ తర్వాత గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట సహా పలు మున్సిపాలిటీల ఎలక్షన్లు ఉండటంతో.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను చెల్లింపు రాయితీ వర్తింపజేశారు. ఇక ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లోని నాలుగున్నర లక్షల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.450 కోట్లు వరద సాయం అందించామని.. ఇంకో లక్ష కుటుంబాలకు సాయం చేసేందుకు మరో రూ.100 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. హైకోర్టులో కేసు కారణంగా బీఆర్ఎస్ పెండింగులో ఉండటంతో దానికి బదులుగా ఎల్ఆర్ఎస్ చార్జీల్లో సడలింపు ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా పెద్ద సంఖ్యలో ఓటర్లకు గాలం వేసేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆర్య వైశ్య నేతలు చాలా కీలకం. వాళ్లు ప్రభావితం చేసే ఓటర్లు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. హైదరాబాద్ లో సెటిలైన ఉత్తరాది వారితో ఆర్య వైశ్య నేతలకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ వర్గం వాళ్లను మచ్చిక చేసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ఇటీవల ఏకంగా మూడు పదవులు ప్రకటించారు. బొగ్గారపు దయానంద్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయగా.. ఉప్పల శ్రీనివాస్, అమరవాది లక్ష్మీనారాయణలకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇచ్చారు. మరికొందరికి కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా ఈ వర్గం వారి ఓట్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: కేసీఆర్‌కు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారా..?
సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎంప్లాయీస్‌ను సైతం ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులకు కరోనా టైంలో కట్ చేసిన 50 శాతం జీతాలను చెల్లించాలని నిర్ణయించింది. అటు కాంట్రాక్టు లెక్చరర్లపైనా సానుభూతితో ఉన్నామని, వారు వేరే కాలేజీలకు మారడానికి అవకాశం కల్పిస్తామని సీఎం ప్రకటించారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 3 డీఏల్లో ఒకటి రిలీజ్చేస్తున్నట్టు ఉత్తర్వులు వచ్చాయి.
గ్రేటర్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాకుంటే ఎక్స్ అఫీషియో ఓట్ల అస్త్రాన్ని ప్రయోగించాలని టీఆర్ఎస్ చూస్తోంది. టీఆర్ఎస్కు ఎంఐఎంతో కలిపి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ద్వారా 33 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఇంకో ముగ్గురు ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు. ఇద్దరు రాజ్యసభ సభ్యుల ఓట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 38కి చేరుతాయి. ఒకవేళ సీట్లు తగ్గితే.. ఈ ఓట్లతో జీహెచ్ఎంసీ పీఠం చేజిక్కించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సరిపడా సీట్లు గెలవలేకపోయిన మున్సిపాలిటీలను ఇలాగే ఎక్స్ అఫీషియో ఓట్లతో దక్కించుకుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ముఖ్యంగా ఎన్నికలను టార్గెట్ చేస్తూ.. టీఆర్ఎస్ గవర్నమెంట్ నిన్న ఈ తాయిలాలు ప్రకటించింది.. గ్రేటర్లో వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాదికి ఇంటి పన్నులో 50 శాతం రాయితీ ఇస్తున్నారు. శానిటేషన్ వర్కర్ల శాలరీస్ పెంచారు. వివిధ కులాలు, నేతలకు నామినేటెడ్పదవులు ఇస్తున్నారు. ఆర్టీసీలో కరోనా టైమ్‌లో కట్ చేసిన జీతాలను తిరిగి చెల్లించనున్నారు. ఇందుకోసం రూ.120 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి.. బస్తీ దవాఖాన్లను ప్రారంభించనున్నారు. సరే.. వీటన్నింటినీ చూస్తే బాగున్నా ఈ తాయిలాలకు ఓట్లు రాలుస్తాయా అనేది డౌట్‌గానే ఉంది. మినీ అసెంబ్లీ ఎన్నికల్లాగా భావించే జీహెచ్ఎంసీలో మరోసారి గులాబీ జెండా ఎగురుతుందా..? కాషాయం రెపరెపలాడుతుందా..? ‘హస్త’ గతం అవుతుందా..? ఆసక్తికరంగానే కనిపిస్తోంది ఈసారి ఎన్నికల మాత్రం.
-శ్రీనివాస్. బి
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: What is the story behind telangana government gifts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com