Raj Tarun and Lavanya : గత ఏడాది హీరో రాజ్ తరుణ్, లావణ్య ప్రేమ వ్యవహారం గురించి మీడియా లో ఏ రేంజ్ రచ్చ జరిగిందో మనమంతా చూసాము. రాజ్ తరుణ్ తనని మోసం చేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని, ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఇలా ఎన్నో సంచలన ఆరోపణలు చేసి, నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి అందరికి తెలిసిందే. మొదట్లో హీరో రాజ్ తరుణ్ ఎదో తప్పు చేశాడని అందరూ అనుకున్నారు, లావణ్య పై పాజిటివిటీ బాగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆమె నిజస్వరూపాన్ని శేఖర్ బాషా అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి బయటపెట్టాడో, అప్పటి నుండి లావణ్య పై తీవ్రమైన నెగటివిటీ పెరిగిపోయింది. ఇంకా లాగితే తెగిపోతుంది అని అర్థం చేసుకున్న లావణ్య, ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఇంట్లో ఉంటున్న రాజ్ తరుణ్ ని కలిసి పెద్ద గొడవ చేసే ప్రయత్నం చేసింది.
Also Read : నార్త్ లో అదరగొడుతున్న సౌత్ డైరెక్టర్స్..
కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రీసెంట్ గా ఆమె రాజ్ తరుణ్ ని వదిలేసి, మరో మాజీ ప్రియుడు మస్తాన్ సాయి కి సంబంధించిన హార్డ్ డిస్క్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించింది. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ ‘రాజ్ తరుణ్ ని చాలా ఇబ్బంది పెట్టాను, అవకాశం ఇస్తే అతని కాళ్ళు పట్టుకుంటాను’ అని చెప్పుకొచ్చింది. ఇక వీళ్ళ మ్యాటర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో నేడు మళ్ళీ మొదలైంది. విషయంలోకి వెళ్తే ప్రస్తుతం హైదరాబాద్ లో లావణ్య ఉంటున్న ఇల్లు, తన సొంత ఇల్లు కాదు. రాజ్ తరుణ్ ఇల్లు, లావణ్య తో ఆయన కలిసి ఉంటున్న రోజులకు సంబంధించిన ఇల్లు ఇది. లావణ్య తో విడిపోయిన తర్వాత రాజ్ తరుణ్ ఈ ఇంటి నుండి ఆమెని వెళ్ళిపోమని చెప్పలేదు.
ఆమె కోసం ఆ ఇంటిని వదిలేసాడు. కారణం హైదరాబాద్ కి వచ్చి సినీ అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్న రోజుల్లో లావణ్య తనకు సహాయం చేసిందని, అందుకే విడిపోయిన తర్వాత కూడా ఆ ఇంటిని వెనక్కి తీసుకోవాలని నాకు అనిపించలేదంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు రాజ్ తరుణ్ అమ్మానాన్నలు అద్దె ఇంట్లో ఉంటున్నారు. రాజ్ తరుణ్ కూడా ప్రస్తుతం అద్దె ఇంట్లోనే ఉంటున్నాడట. మా సొంత ఇల్లు ఉన్నప్పుడు మేమెందుకు అద్దె ఇంట్లో ఉండాలి, పైగా మా ఆయనకు రీసెంట్ గానే కాళ్లకు ఆపరేషన్ జరిగింది, మాకు అద్దె కట్టుకోవడానికి డబ్బు సరిపోవడం లేదు, అందుకే మా ఇల్లు మాకు ఇవ్వమని డిమాండ్ చేసాము, కానీ లావణ్య మమ్మల్ని బయటకు నెట్టేసింది, మా ఇల్లు మాకు తిరిగి ఇచ్చేంత వరకు ఇక్కడి నుండి కదళము అంటూ ఇంటి ముందే బైఠాయించారు. పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో చూడండి.
Also Read : మరోసారి వాయిదా పడిన ‘హరి హర వీరమల్లు’..కన్నీటి పర్యంతం అయిన నిర్మాత!