Kanche Gachibowli
Kanche Gachibowli : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్(Hyderabad)లోని కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవిని నిర్మూలించి, ఆ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆ భూములను తమవిగా భావిస్తూ కాపాడుకోవడానికి నిరసనలు చేపట్టారు. అర్ధరాత్రి వందలాది జేసీబీ(JCB)లు అడవిని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు, నెమళ్ల(Pecock) ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీస్తున్న దుప్పిల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ప్రజల మనసులను కదిలించాయి.
Also Read : ఆ భూములు ప్రభుత్వానివా? HCU కు చెందినవా?
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి(Kanche Gachibouli)లో 400 ఎకరాల అడవిని నిర్మూలించి, ఆ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. అయితే దీనిపై సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంతో నిండిపోతున్న హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్(Oxigen) అందించే ఈ అడవిని నాశనం చేయడం అన్యాయమని విమర్శిస్తున్నారు.
కొణిదెల ఉపాసన..
హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల(Upasana Konidela) ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఈ అడవిని నాశనం చేస్తే, అక్కడి మూగజీవాలు, పక్షులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు? దీనికి సమాధానం చెప్పండి‘ అని డిమాండ్ చేశారు.
రేణుదేశాయ్..
నటి రేణూ దేశాయ్(Renu deshai), పవన్ కల్యాణ్ మాజీ భార్య, ఒక వీడియోలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు. ‘ఒక తల్లిగా వేడుకుంటున్నాను. నాకు 44 ఏళ్లు, రేపో మాపో పోతాను. కానీ మన పిల్లలకు, రేపటి తరానికి ఆక్సిజన్, నీళ్లు కావాలి. అభివృద్ధి అవసరమే, కానీ ఈ 400 ఎకరాలను వదిలేయండి. నిర్మానుష్య భూములను వెతకండి. దయచేసి ఆలోచించండి’ అని కోరారు.
యాంకర్ రష్మీ గౌతమ్..
ప్రముఖ యాంకర్ రష్మీగౌతమ్(Rashmi Goutham) కూడా మూగజీవాలను అడవి నుంచి తరిమేయవద్దని కోరుతూ వీడియో విడుదల చేసింది. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అడవుల ధ్వంసం ఆపాలని కోరారు.
ఈ వివాదం అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సంఘర్షణను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం ఉద్యోగాల సృష్టి కోసం పరిశ్రమల స్థాపనను సమర్థిస్తుండగా, విద్యార్థులు, సెలబ్రిటీలు, మరియు ప్రజలు అడవిని కాపాడుకోవాలని గళమెత్తుతున్నారు.
Also Read : గచ్చి బౌలి లో ఆ 400 ఎకరాల వెనుక అసలు కథ ఇది..
Web Title: Kanche gachibowli forest controversy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com