spot_img
Homeవైరల్ వీడియోస్Pot Seller: కుండలు అమ్ముకునే యువతిని ఫ్యాషన్ మోడల్‌గా మార్చేసింది.. వీడియో వైరల్..

Pot Seller: కుండలు అమ్ముకునే యువతిని ఫ్యాషన్ మోడల్‌గా మార్చేసింది.. వీడియో వైరల్..

Pot Seller: ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ మహిమా బజాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి వారినైనా క్షాణాల్లో అద్భత శిల్పంగా మార్చగలదు. జుట్టు నుంచి పాదాల వరకు అందంతో మెరిపించగలదు. అందుకే మహిమా బజాజ్ కు ఎక్కువ మంది ఫిదా అవుతుంటారు. తను బయటకు వెళ్లిన సమయంలో చూసిన వారికి ఒప్పించి తన స్టూడియోకు తీసుకువచ్చి అందమైన అమ్మాయిగా మారుస్తుంది. ఈ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తుంది. మహిమా వీడియోలు చాలా వైరల్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా మహిమా బజాజ్ చేసిన అద్భుతమైన మేకప్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ వీడియో వైరల్ అవుతోంది. రోడ్డుపక్కన మట్టి కుండలు అమ్మే యువతిని ఆమె అందంగా మార్చేసింది. మహిమా తాను చేసిన ప్రతీ పనిని కెమెరాలో బంధిస్తుంది. ప్రతి స్టెప్‌ను వివరిస్తూ ఈ వీడియోను తన ఇన్‌ స్టా పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆమె ప్రతిభను అభినందించారు.

మహిమా సదరు యువతికి మేకప్ స్ట్రాట్ చేసింది. మొదట జుట్టును ఎంచుకుంది. జుట్టు తక్కువగా ఉన్న చోట త్రిఫల చూర్ణం, ముల్తానీ మట్టి, పెరుగు మిశ్రమం తలకు రాసి మసాజ్ చేసింది. ఆ తర్వాత ఫ్యాషనబుల్‌గా జుట్టు కత్తిరించింది. ఆ యువతి ముఖం మరింత కాంతివంతంగా కనిపించేలా చేయాలనుకుంది. ముఖంపై ఉన్న చాయను తగ్గించి, స్కిన్ మృదువుగా అయ్యేందుకు ఆలోవెరా, వేప మిశ్రమం ఉపయోగించింది. కొన్ని అందం పెంచే పద్ధతులు ఉపయోగించి కుండలు అమ్మే యువతిని ఫ్యాషన్ స్టార్‌గా మార్చేసింది. ఆమెను గుర్తుపట్టడం కూడా కష్టంగానే మారింది.

మహిమా బజాజ్ అద్భుతమైన మేకప్ ఆర్టిస్ట్. ఆమె చాలా మందికి మేకప్ వేసి అందంగా మార్చింది. టీ అమ్ముకునే వాళ్లు, బట్టలు ఉతకే వాళ్లు, రోడ్డుపై చెత్త తీసే వాళ్లు ఇలాంటి చాలా మందిని తన మేకప్ ద్వారా అద్భుతంగా మార్చింది.

తాను చేసే పనిని తాను ప్రేమిస్తానని అందుకే నేను ఆనందంగా ఉంటానని మహిమా బజాజ్ చెప్తోంది. వీరందరినీ ఎంచుకోవడంలో నాకు చాలా ఆనందం కలుగుతుందని, లక్షలు ఖర్చు చేసే వారికి వేసే మేకప్ కంటే ఇలాంటి పేదలకు మేకప్ వేస్తే వారి అందాన్ని వారు చూసుకొని తనను ప్రేమగా చూస్తే వారిలోని ఆనందం తనను మరింత ఆనంద పరుస్తుందని చెప్పుకచ్చారు.

ఇతరులకు మేకప్ వేయడంపై మహిమా బజాజ్ ను చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఫ్యాషన్ షోలు, ఫొటో షూట్ల కోసం మోడల్స్‌కు కూడా మేకప్ వేస్తుంది. తాజాగా ఆమె కుండలు అమ్మే అమ్మాయిని (Pot seller) మోడల్ గా మార్చిన వీడియో చాలా మందికి నచ్చింది. ఆమె ఇలాంటి వ్యక్తులను గౌరవిస్తున్నందుకు ప్రశంసిస్తున్నారు. ‘ఈ మార్పు చాలా బాగుంది’ అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...
Oktelugu Epaper