spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TV9 Rajinikanth - YCP : టీవీ9 రజినీ లెక్కలు : ఏపీలో అధికారం వీరిదేనట?

TV9 Rajinikanth – YCP : టీవీ9 రజినీ లెక్కలు : ఏపీలో అధికారం వీరిదేనట?

TV9 Rajinikanth – YCP : ఏపీలో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటివరకయితే అధికారంలోకి వస్తామని అటు కూటమి, ఇటు వైసిపి పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నాయి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్టీవీ అధినేత రవి ప్రకాష్ ముందుగానే సర్వే పేరుతో సంచలమైన విషయాలను వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు.. రవి ప్రకాష్ సర్వే పట్ల టిడిపి నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తే.. వైసిపి నాయకులు విమర్శలు మొదలు పెట్టారు.. సరే జర్నలిజం అనేది అందర్నీ సంతృప్తి పరచదు కాబట్టి.. రవి ప్రకాష్ సర్వేను అలా వదిలేస్తే.. ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తెరపైకి సంచలనమైన విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..

ఏపీలో పోలింగ్ సరళి రాజకీయ పార్టీలకే కాదు పెద్ద పెద్ద విశ్లేషకులకు కూడా అంతుపట్టలేదు. ఒకానొక సందర్భంలో పోలింగ్ శాతం తగ్గుతుందని అందరికీ అంచనాలు ఉండేవి. ఆ తర్వాత ఊహించని స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది. ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి భారీగా ఓటర్లు వచ్చారు. స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాలలో వివాదాలు, ఘర్షణలు, దాడులు, ప్రతి దాడులు, ఈవీఎం ల ధ్వంసం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ఎక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే పెరిగిన ఈ పోలింగ్ శాతం అటు అధికార పార్టీని, ఇటు ప్రతిపక్ష పార్టీని ఆలోచనలో పడేసింది. పైకి ఎవరికివారు అధికారంలోకి వస్తామని చెప్తున్నారు గానీ.. కచ్చితంగా మేమే వస్తామని మాత్రం అనలేకపోతున్నారు..

ఏపీలో పెరిగిన పోలింగ్ అధికార పార్టీకి అనుకూలంగా మారిందట. కచ్చితంగా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందట. గతంలో మాదిరి బంపర్ మెజారిటీ కాకపోయినప్పటికీ.. దరిదాపు 100కు పైగా సీట్లను వైసీపీ గెలుచుకుంటుందట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్. “ఆంధ్రప్రదేశ్లో ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసిపికి అనుకూలంగా ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 100కు పైగా సీట్లల్లో వైసిపి గెలుస్తుంది. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని” రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. జగన్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉందని.. దాన్ని పక్కన పెట్టేందుకే రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. “పట్టణ ఓటర్లలో జగన్ పై వ్యతిరేకత ఉంది. కానీ గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసీపీకి జై కొట్టారు. కచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని” రజనీకాంత్ వ్యాఖ్యలు చేయడం విశేషం.

అయితే తన ఆర్ టీవీ ద్వారా రవి ప్రకాష్ చేసిన సర్వేలో కూటమికి అధికారంలోకి వస్తుందని చెబితే.. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రవి ప్రకాష్ శిష్యుడు రజనీకాంత్ ఏకంగా వైసిపి అధికారంలోకి వస్తుందని ప్రకటించాడు. అంటే గురు శిష్యులు పార్టీలుగా విడిపోయారన్నమాట.. ఇంతకీ గురు శిష్యులు చెప్పిన జోస్యం లో ఎవరికి అధికారం దక్కుతుందో, ఎవరికి ప్రతిపక్ష స్థానం లభిస్తుందో జూన్ 4న తేలనుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Oktelugu Epaper