
Viral News: మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అన్నారో సినీకవి. ప్రస్తుత సమాజంలో మానవసంబంధాలు దారి తప్పుతున్నాయి. అయినవారెవరు? కానివారెవరో తెలియడం లేదు. సాక్షాత్తు అల్లుడితోనే అత్త ప్రేమాయణం వెలుగు చూసింది. ఆస్పత్రికి వెళ్తానని చెప్పిన అత్త ఇంటికి చేరలేదు. లాడ్జిలోనే శవమైంది. కట్ చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అత్త, అల్లుళ్ల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇది బయట పడుతుందనే ఉద్దేశంతో ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక అల్లుడే ఆమెకు ఉరివేశాడా? అనేది తేలాల్సి ఉంది.
హైదరాబాద్ లోని ఓ కోళ్ల ఫారంలో రావూరి అరుణ (35) తన భర్త క్రిష్ణారావు తో కలిసి పనిచేస్తోంది. ఈనెల 14న తనకు కడుపునొప్పి వస్తోందని మన ఊరు వెళ్లి వైద్యులకు చూపించుకుని వస్తానని చెప్పి బయలుదేరింది. కానీ ఇంటికి చేరలేదు. భద్రాచలంలో అల్లుడితో కలిసి ఓ గది తీసుకుని రాత్రంతా అతడితో గడిపింది. తీరా విషయం తెలిస్తే గొడవవుతుందని అనుకుందో ఏమో ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.
తన భర్త మేనల్లుడు ఆంజనేయులుతో అత్తకు గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇద్దరు ఆ రోజు ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అరుణ తనకు తానే ఆత్మహత్య చేసుకుందా? లేక ఆంజనేయులే ఉరివేసి చంపాడా? అనేది తేలాల్సి ఉంది. అరుణ మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆంజనేయులుపై సెక్షన్ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అరుణ కేసులో ఆంజనేయులే హంతకుడా? లేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా అనేది తెలియడం లేదు. విచారణ చేపడితే నిజానిజాలు వెలుగు చూసే అవకాశముంది. మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం. వివాహేతర సంబంధంతో ఓ ప్రాణమే పోయింది. క్షణిక సుఖం కోసం అర్రులు చాస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. మొత్తానికి అరుణ మరణంపై పోలీసులు నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఏర్పడింది.