Homeఎంటర్టైన్మెంట్Pathaan Sharukh Khan : పఠాన్ కోసం ఆ ముఖ్యమంత్రిని ప్రాధేయపడ్డ షారుక్ ఖాన్

Pathaan Sharukh Khan : పఠాన్ కోసం ఆ ముఖ్యమంత్రిని ప్రాధేయపడ్డ షారుక్ ఖాన్

Pathaan Sharukh Khan : షారుక్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమా విడుదలైంది.. సినిమాకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్క విధంగా స్పందిస్తున్నారు.. ఇక పెయిడ్ యూ ట్యూబర్లు అయితే షారుక్ ఖాన్ ను “కింగ్ ఇస్ బ్యాక్ ” అని కీర్తిస్తున్నారు..ఇన్ని స్తుతి కీర్తనల మధ్య ఇంట్రెస్టింగ్ గా అనిపించింది పఠాన్ సినిమాకు అస్సాం ముఖ్యమంత్రి సపోర్ట్ ఇచ్చాడని… దీనికి సంబంధించి లోతుల్లోకి వెళితే ఆసక్తికరమైన విషయాలు కనిపించాయి.

 

 

సిగ్గు శరం లేని సినిమాను తీసిన షారుక్ ఖాన్ ను వెనుకేసుకుని రావడానికి కొందరికి ఇప్పుడు అస్సాం సీఎం దొరికాడు.. ఒక బీజేపీ వాడు దొరికితే చాలు, ఇక ఎవరిని సమర్థిస్తున్నామనే సోయి కూడా ఉండదు వాళ్లకు. ఎంతసేపు బిజెపి కోణంలోనే చూడాలా ప్రతి విషయాన్ని? పఠాన్ సినిమాకు వ్యతిరేకంగా ఒక అస్సాంలోనే కాదు, దేశంలోని పలుచోట్ల నిరసనలు జరుగుతున్నాయి.. ఇవ్వాళ కూడా పలుచోట్ల పోస్టర్లు చింపేశారు.. థియేటర్ల ఒనర్లను బెదిరిస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో “బ్యాన్ పఠాన్ హ్యాష్ ట్యాగ్” హోరు కనిపిస్తోంది.. ఇదంతా కరెక్టా? కాదా? అనే చర్చలోకి వెళ్లడం లేదు ఇక్కడ.. పర్టికులర్ గా హిమంత విశ్వ శర్మ ధోరణి పైనే ప్రస్తావన.

ఈమధ్య ఎవరో అస్సాం ముఖ్యమంత్రిని పఠాన్ వివాదం మీద అడిగారు. (ఆయన ఎవరు అని ఒక సీఎంతో అడిగించుకోవడం అంత అవమానం మరొకటి ఉండదు షారుక్ ఖాన్ వంటి బాలీవుడ్ అగ్ర సెలబ్రిటీకి.. ఇది వేరే కథ. మేము తోపులం, దైవంశ సంభూతులం అనే పొగరును బద్దలు కొట్టింది ఇలాంటివే)… ఆ  ప్రశ్నలలో తప్పేముంది? ” నేను చాలా సంవత్సరాలుగా సినిమాలు చూడటం లేదు.. అప్పట్లో అమితాబ్, ధర్మేంద్ర, జితేంద్ర సినిమాలు చూశాను.. వారంతా నాకు గుర్తున్నారు.. ఈయన ఎవరో నాకు తెలియదు” అని అస్సాం ముఖ్యమంత్రి చెప్పుకొచ్చాడు.

నిజమే, తెలియాలని ఏముంది.. ఆయన ఒక ముఖ్యమంత్రి. షారుక్ ఖాన్ సినిమాలు చూడాలని ఏముంది?, పఠాన్ అనగానే గొప్ప సినిమా, గొప్ప నటుడు అని మెచ్చేసుకుని చప్పట్లు కొట్టాలా? పైగా బట్టలు లేకుండా దీపిక హీనంగా డ్యాన్స్ చేసినందుకా? సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఇష్టానుసారంగా చేస్తున్నందుకా? వాళ్లు ఆ దరిద్రపు పోకడలు పోవాలి, ఈ సిస్టం వాటికి రక్షణ కల్పించాలి, వారెవ్వా… అలాంటి వేషాలు వేయడం ఏల? అందరి కాళ్లు పట్టుకొని బతిమిలాడనేల?

“నాకు కోట్లమంది ఓట్లు వేశారు. అందరితోనూ నాకు పరిచయం ఉందా? గుర్తుపట్టగలనా? షారుక్ ఖాన్ కూడా అంతే” అస్సాం ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్య షారుక్ ఖాన్ చుట్టూ ఉన్న సూపర్ ఈగో యిస్టిక్ భ్రమాత్మక పొరలని తొలగించేసింది.. కానీ అవసరం తనది.. సినిమా వాళ్ళు అవసరానికి ఎక్కడికి దిగజారుతారో తెలిసిందే కదా.. సీఎంకు ఓ మెసేజ్ పెట్టాడు.. ” నేను షారుక్, మీతో మాట్లాడాలి అని” ఇక్కడ కూడా అహమే.. ఒక సీఎంకు ” సర్, నా పేరు షారుక్, ఒక్క నిమిషం మీతో మాట్లాడవచ్చా” అని పెట్టి ఉంటే బాగుండేది.. ఎందుకంటే తను సీఎం కాబట్టి..

సో అహాన్ని కూడా హిమంత బ్రేక్ చేయాలని అనుకున్నాడు. లైట్ తీసుకున్నాడు.. కానీ ఈ విషయం పై మాత్రం స్పందించాల్సిందే.. సో మెల్లిగా తెల్లవారుజామునో ఒక మెసేజ్ పెట్టాడు.. “ఎస్ ఆర్ కెన్ ఐ డు ఫర్ యు” అని.. వెంటనే షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాకు అడ్డంకుల గురించి చెప్పాడు. ఇక్కడ హిమంత ఒక సీఎం గా స్పందించాడు.. గొడవలేవి జరగవు అని ఫోన్ పెట్టేసాడు.. “ఒక సీఎంగా రాష్ట్రానికి చెడ్డ పేరు రానివ్వను.. అది నా విధి. ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు. లేకపోతే సినిమా జోలికి వెళ్లరు.. అంతేతప్ప ఈ ఆందోళనలు, అనుచిత చర్యలు వేస్ట్ ” అని సింపుల్ గా తేల్చి పడేసాడు. అంతే కదా సరైన స్పందన. పొద్దున్నే షారుక్ తెలియదు అన్నాడు.. సాయంత్రానికి షారుక్ ఫోన్ చేశారంటూ చెప్పాడు.. చాలామంది హిమంతకు చంచలత్వం ఉందని అన్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత కూడా ఆయన పై విమర్శ చేయడానికి ఏముంది ఇందులో? ఆ సినిమాలో సిగ్గు శరం లేని పాట గురించి, షారుక్ సినిమా గురించి ఆయనేం వ్యాఖ్యలు చేయలేదు.. పైగా ఒక ముఖ్యమంత్రిగా అనుచిత చర్యల్ని సమర్థించబోను అన్నాడు. ఇక్కడ చాలామంది మర్చిపోయింది ఏంటంటే అస్సాం ముఖ్యమంత్రి హార్డ్ కోర్ బిజెపి క్యారెక్టర్ కాదు.. ఏళ్ళకు ఏళ్ళు కాంగ్రెస్ లో మునిగి తేలిన వాడే. అంతే.. అంతకుమించి ఏమీ లేదు..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular