Homeఅంతర్జాతీయంChina Vs India : భారత్ అంటే భయపడుతున్న చైనా

China Vs India : భారత్ అంటే భయపడుతున్న చైనా

China Vs India : భారత్ అంటే చైనాకు ఎప్పుడూ భయమే.. ఎందుకంటే భారతదేశంలో ఉంది ప్రజాస్వామ్య ప్రభుత్వం.. ఇక్కడ తమను ఎవరు పాలించాలో ప్రజలే నిర్ణయిస్తారు.. జనాభా ఎక్కువ ఉన్న దేశం కాబట్టి మానవ వనరులు కూడా చౌకగా లభిస్తాయి.. పైగా భారత్ లో పారిశ్రామికవేత్తలు అధికంగా ఉంటారు. సాంకేతిక నిపుణులు కూడా ఎక్కువ స్థాయిలో ఉంటారు.. మనదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఐటీ కంపెనీల్లో కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు.. అందుకే భారత్ అంటే చైనాకు మంట.. మరోవైపు చైనాలో నియంతృత్వ పాలన సాగుతూ ఉంటుంది.. ప్రజలకు మాట్లాడే అవకాశం ఉండదు.. స్వేచ్ఛగా తమ వాణి వినిపించే అవకాశం ఉండదు.. అన్నింటికీ మించి నిరసన కూడా తెలిపే అవకాశం ఉండదు.. ఆ అవకాశాన్ని కూడా అక్కడి ప్రభుత్వం తొక్కి పారేయడంతో… ప్రజలు తెలుపు కాగితాలను ప్రదర్శిస్తున్నారు.. ఆ విధంగా ఆయన ప్రభుత్వం తమ బాధను వింటుంది అని..

సరిహద్దు గొడవలు చైనా వల్లే

ఇక భారత్ ను ముప్పు తిప్పలు పెట్టాలని చైనా చేయని పన్నాగం అంటూ లేదు.. పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందించి కాశ్మీర్ లో నిత్యం అల్లకల్లోలం సృష్టిస్తుంది.. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అలజడి సృష్టిస్తుంది.. దీనివల్ల ప్రభుత్వ అటెన్షన్ మారుతుంది.. అక్కడి గొడవలు సద్దుమణిగించేందుకే సమయం సరిపోతుంది.. దీనివల్ల చైనా తన పనులు తాను చేసుకుంటుంది.. అంతేకాదు ఇతర ప్రాంతాలను ఆక్రమించేందుకు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న గొడవలు అలాంటివే.

పారిశ్రామికవేత్తల మనసు మారింది

ఇక గత కొంతకాలంగా చైనాలో పరిస్థితి దిగజారింది.. కోవిడ్ వల్ల వృద్ధిరేటు మందగించింది.. దీనికి తోడు అక్కడ నియంతృత్వ ప్రభుత్వ విధానాల వల్ల విసిగి వేసారి పోయిన పారిశ్రామికవేత్తలు స్వేచ్ఛాయుత వాణిజ్యం వైపు దృష్టిసారిస్తున్నారు.. అందులో భాగంగా వారు భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు.. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కోరికపోయినప్పటికీ భారత్ మాత్రమే మెరుగైన వృద్ధిరేటు సాధిస్తున్నది.. దీనిని ఆధారంగా చేసుకొని పారిశ్రామికవేత్తలు భారత్ లో పెట్టుబడులు పెడుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశ విదేశాంగ విధానంలో అంత గణనీయమైన మార్పులు ఉండేవి కావు.. దీనివల్ల భారత్ పై ప్రపంచ దేశాలకు, పారిశ్రామికవేత్తలకు అంతగా నమ్మకం ఉండేది కాదు.. పేరుకు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ ఆ స్థాయిలో తన ముద్ర వేయలేకపోయేది.. కానీ మోడీ వచ్చిన తర్వాత విదేశాంగ విధానం సమూల మార్పులకు గురైంది. దీనికి తోడు అతిపెద్ద వినియోగదారులు ఉన్న మార్కెట్ కావడంతో ప్రపంచ దేశాల వైఖరి కూడా మారింది.. దీంతో ఇప్పుడు అందరూ చూపు భారత్ వైపు మళ్ళింది.. ఇదే సమయంలో చైనా పతనం కూడా స్టార్ట్ అయింది. అందుకే అంటారు పెద్దలు పెరిగేది విరుగుట కొరకే అని.. ఇది ఇప్పుడు ఆ డ్రాగన్ దేశం స్వయంగా చవిచూస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular