Prashanth Neel: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు సైతం మన హీరోలను స్టార్ హీరోలుగా మార్చడంలో కీలకపాత్ర వహించాడు. అతనితోపాటు కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ సైతం మన హీరోలను స్టార్ హీరోలుగా మార్చడంలో కొంతవరకు సహాయపడుతున్నాడు…
Also Read: హిట్ మూవీ కొత్త పోస్టర్ మామూలుగా లేదుగా…నాని అరాచకం అంతే..?
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ డైరెక్టర్ గా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కే జి ఎఫ్, సాలార్ లాంటి రెండు పవర్ ఫుల్ సినిమాలతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు. అయితే ఈయనతో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ (Sharukh Khan) లాంటి నటుడు సైతం ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం వరుసగా తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న ఆయన ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రభాస్ తో సలార్ 2 (Salaar 2) సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…
ఇక ఈ సినిమా పూర్తయితే కేజిఎఫ్ 3 ని పట్టాలెక్కించే పనిలో బిజీ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి క్రమంలోనే షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే తీరిక తనకు లేదు అన్నట్టుగా ప్రశాంత్ నీల్ తన వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా బాలీవుడ్ హీరోలను ఇప్పుడు ఏ దర్శకుడు కూడా పట్టించుకోవడం లేదు.
ఒకప్పుడు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు సంబరపడిపోయి అక్కడికి వెళ్లి సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించాలని చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మీదనే ప్రతి ఒక్కరి కన్ను పడింది.
ఇక్కడ ఉండే హీరోలతో సినిమాలు చేస్తేనే వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎదగగలము అనే ఒక నమ్మకం అయితే దర్శకులలో బలంగా పడిపోయింది. మరి ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ మంచి కథలతో తెలుగు హీరోలతో సినిమాలు చేసి పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు…