Allu Arjun and Atlee : సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం శాసిస్తున్న హీరోల్లో మన హీరోలు మొదటి వరుసలో ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు చిన్నచూపు చూసేవాళ్ళు మన హీరోలను పట్టించుకునే వాళ్ళు కాదు. మన దర్శకులు వాళ్ళతో సినిమాలు చేయడానికి కథలు చెబితే రిజెక్ట్ చేసేవారు.
Also Read : అల్లు అర్జున్, అట్లీ సినిమాలో హీరోయిన్ ఆమేనా..? ఫ్యాన్స్ ఏమైపోతారో!
ప్రస్తుతం పాన్ ఇండియా లో తెలుగు సినిమాల డామినేషన్ పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలను బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు సైతం పట్టించుకోవడం లేదు. మన హీరోలకే వాళ్ళు పట్టం కడుతున్నారు. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మన స్టార్ హీరోలు వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవుతూ ముందుకు సాగుతున్నాయి అంటే మన ఇండస్ట్రీ ఎంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో వచ్చిన ఏ సినిమా కూడా సూపర్ సక్సెస్ లను సాధించడం లేదు. కానీ తెలుగు నుంచి వస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు భారీ కలెక్షన్స్ ను కూడా కొల్లగొడుతూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో అన్ని రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. పుష్ప 2 (Pushpa 2) సినిమాతో 1850 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ స్టార్ హీరో ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాతో మరిన్ని రికార్డును కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లీ ఇంతకుముందు షారూక్ ఖాన్ (Sharukh Khan) తో చేసిన జవాన్ (Jawan) సినిమాతో వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాడు. కాబట్టి పాన్ ఇండియాలో తనకు మంచి మార్కెట్ అయితే ఉంది. అందువల్లే అల్లు అర్జున్ తనను తాను ఇంకా భారీ గా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమా వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చాలా హై టెక్నాలజీతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారనే విషయం అయితే చాలా క్లియర్ కట్ గా తెలియజేశారు.
Also Read : అల్లు అర్జున్ అట్లీ మూవీ ఓపెనింగ్ డేట్ వచ్చేసిందిగా..?
ఇక ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రంభ ఒక కీలక పాత్రలో నటించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇంతకుముందు అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు (Deshamuduru) సినిమాలో అల్లు అర్జున్ తో ఒక స్పెషల్ సాంగ్ లో ఆడి పాడిన రంభ (Rambha) మరోసారి అతనితో కలిసి ఈ సినిమాలో నటించబోతుందట.
మరి ఆమె పాత్ర ఏంటి ఆవిడ ఎలాంటి పాత్రను పోషిస్తుంది. తద్వారా ఆ పాత్ర సినిమాకి ఎంత వరకు ఉపయోగపడబోతుంది అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి…