Pavitra Lokesh- Naresh: నరేష్ కి షాక్ ఇస్తూ పవిత్ర లోకేష్ బెంగుళూరు వెళ్లిపోయారట. దీంతో మరోసారి నరేష్ ఒంటరి అయ్యాడట. తాజాగా ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి… కొన్ని నెలలుగా తెలుగు జనాల నోళ్ళలో నానుతున్నపేర్లు ఇవి. నరేష్-పవిత్ర వివాహం చేసుకున్నారన్న పుకార్లతో మొదలైన రచ్చ రమ్య రఘుపతి ఎంట్రీతో కొత్త మలుపు తిరిగింది. అప్పటి నుండి ఆరోపణలు ప్రత్యారోపణలు ఇద్దరి మధ్య చోటు చేసుకుంటున్నాయి. పవిత్ర లోకేష్ ని నేను వివాహం చేసుకోలేదు. కేవలం కలిసి జీవిస్తున్నామని నరేష్ అధికారికంగా తెలియజేశారు.

నరేష్-పవిత్ర మైసూర్ లో హోటల్ గదిలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న రమ్య అక్కడికెళ్లి బైఠాయించింది. దీంతో పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసుల ఎంట్రీ ఇచ్చి నరేష్, పవిత్రలను అక్కడ నుండి పంపివేశారు. మెల్లగా సద్దుమణిగిన ఈ వ్యవహారం నరేష్ పెళ్లి ప్రకటన చేయడంతో మళ్ళీ నిద్ర లేచింది. రమ్య రఘుపతి రంగంలోకి దిగింది. గత ఏడాది పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోనున్నట్లు నరేష్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా సమాచారం ఇచ్చారు.
నరేష్ ప్రకటనపై రమ్య తీవ్ర అభ్యంతరం తెలిపారు. విడాకులు ఇవ్వకుండా చేసుకునే వారి వివాహం చెల్లదు. పవిత్ర, నరేష్ ల వివాహం జరగనీయను అంటూ శబధం చేశారు. అలాగే దారుణమైన ఆరోపణలు చేశారు. నరేష్ నన్ను వదిలించుకోవడానికి అక్రమ సంబంధాలు అంటగట్టారు. మానసికంగా వేధించాడు. అతనికి ఎఫైర్స్ ఉన్నాయి. పెద్ద స్త్రీలోలుడు. నీలి చిత్రాలు చూస్తాడు. నా కొడుకు ముందే బ్లూ ఫిల్మ్స్ చూసేవాడు… ఇలా అనేక విమర్శలు చేయడం జరిగింది.

తాజాగా నరేష్ రమ్య రఘుపతి కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు. రమ్య రఘుపతి నా ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ మెటీరియల్ సిద్ధం చేసింది. చంపటానికి స్కెచ్ వేసింది. ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంది. నన్ను పెళ్లి చేసుకొని బెంగుళూరు వెళ్లి అక్రమ సంబంధాలు నెరిపింది. తాగుబోతు, తిరుగుబోతు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. నరేష్ ఆరోపణలపై రమ్య రఘుపతి ఇంకా స్పందించలేదు.
అనూహ్యంగా…. ఇప్పట్లో ఈ వ్యవహారం తేలేది కాదు. నరేష్ తో నాకు వివాహం జరగదని డిసైడ్ అయిన పవిత్ర లోకేష్ బెంగళూరు వెళ్లిపోయారట. ఇకపై నరేష్ వద్దకు రానన్నారట. పవిత్ర లోకేష్ వెళ్లిపోవడంతో నరేష్ మళ్ళీ ఒంటరి అయ్యాడట. టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ అవుతుంది. పవిత్ర సుచేంద్రన్ అనే వ్యక్తిని గతంలో వివాహం చేసుకుంది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. నరేష్ కి దగ్గరయ్యాక అతనికి దూరమైంది.