Nani Dasara Movie: న్యాచురల్ స్టార్ నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం గా తెరకెక్కుతున్న ‘దసరా’ చిత్రం టీజర్ ఈరోజు విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది..ఈ సినిమా కోసం నానీ ఎంతో కష్టపడ్డాడు..కెరీర్ లో మొదటిసారిగా ఊరమాస్ రోల్ చెయ్యడం తో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి..తెలుగు తో హిందీ , తమిళం , కన్నడ మరియు మలయాళం బాషలలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.

ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు..కొత్త దర్శకుడితో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాని ఎలా ఒప్పుకున్నాడు?, అసలే కెరీర్ లో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాని కి ఇలాంటి రిస్కులు అవసరమా వంటి కామెంట్స్ చాలానే వినిపించాయి..కానీ టీజర్ విడుదలైన తర్వాత ఆ కామెంట్స్ అన్నిటికి చెక్ పడినట్టు అయ్యింది.
కన్నడ లో కాంతారా చిత్రం ఎలాగో, తెలుగు లో అలా దసరా సినిమా నిలుస్తుందని అందరూ అనుకుంటున్నారు..హీరో నాని కూడా ఇదే చెప్పాడు..అయితే ష్యుర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ లాగ అనిపిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత నానీ తో చేద్దామని అనుకోలేదట..తొలుత ఈ సినిమాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తియ్యాలను అనుకున్నాడట ఆ చిత్ర డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.
కానీ ఈ సినిమాలోని తన గెటప్ పుష్ప సినిమాతో పోలి ఉండనే కారణం చేతనే అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట..అంతే కాదు ఈ సినిమా నాని కి సజెస్ట్ చేసింది కూడా అల్లు అర్జున్ అట..కథ విన్న తర్వాత నాని ఎగిరి గంతేసినంత పని చేసాడట..తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది అనే నమ్మకం తో ఈ సినిమాని ఒప్పుకున్నాడు నాని..మరి అల్లు అర్జున్ వదిలేసుకున్న ఈ సినిమా నాని కి కలిసి వస్తుందో లేదో చూడాలి.